శర్మ కాలక్షేపంకబుర్లు-నాస్తి

నాస్తి

అస్తి అంటే ఉన్నది, నాస్తి అంటే లేకున్నది, న=లేక అస్తి=ఉన్నది. లేకుండటమేంటో తెలియాలి, అంటే ఇదివరలో ఉండి ఇప్పుడు లేకపోయిందా? అర్ధం కాలా?నాస్తిలో కూడా అస్తి ఉన్నది. 🙂

అస్తి, నాస్తి అనేటప్పటికి ముందు గుర్తొచ్చేవాడు దేవుడే. దేవుడున్నాడనీ లేడనీ చర్చలు మానవజాతి పుట్టినప్పటినుంచీ ఉన్నట్టున్నాయి.

హిరణ్యకశిపుణ్ణి దేవుడు లేడనేవారి జాబితాలో కలిపేసుకున్నారుగాని అది నిజంకాదు. ఈ ఉన్నాడన్నవాళ్ళలో మరో రకమే హిరణ్యకశిపుడు. ఇతనూ దేవుడు ఉన్నాడు, అది ”నేనే’ అనేవాడు. ”ఏకమేవా అద్వితీయం బ్రహ్మ”. దేవుడొకడే రెండవవాడు లేడు, అది నేనే ”అహం బ్రహ్మస్మి”, నేనే దేవుడిని, మరొకరు దేవుడెలా అవుతాడు? అన్నది ఇతని వాదన. ప్రహ్లాడుడంటాడూ, ”ఏకమేవా అద్వితీయం బ్రహ్మ”, దేవుడొక్కడే రెండవవాడు లేదు. ”అహం బ్రహ్మస్మి” ఇది ఎవరి మటుకు వారనుకోవాలి, భగవంతుడు నీలో, నాలో ఈ సర్వజగత్తులో ఉన్నాడంటాడు.అందుకే అహం బ్రహ్మస్మి అనుకోవాలి. సూర్యుడు ఆకాశం లో ప్రకాశిస్తున్నాడు, ఎవరిమటుకు వారికి ఒకడుగా కనపడతాడు, అలాగే దేవుడు నీలో, నాలో సర్వ జగత్తులో ఉన్నాడయ్యా! అద్దం లో చూస్తే సూర్యుడు కనపదతాడు, ఒకడే, అదే అద్దం ముక్కలైతే అన్నిటిలోనూ కనపడతాడు కదా! అన్ని అద్దం ముక్కలలోనూ ఒకే సూర్యుడు కనపడుతున్నాడా? లేక అనేకమంది సూర్యులున్నారా? సూర్యుడొక్కడే! కాని ప్రతిబింబాలే కనపడుతున్నాయి. అలాగే దేవుడు ఒక్కడే, అందరిలోనూ ఉన్నాడు. అలాగే దేవుడు అందరిలో ఉంటాడు, నీ మనసును జయించు, నీలో నీకు దేవుడు కనపడతాడు అంటాడు, ప్రహ్లాదుడు. ఇదీ తేలని తగువు, మొత్తానికి ఉన్నాడని హిరణ్యకశిపునికి కనపడ్డాడన్నారు. నేటి కాలానికొస్తే,

ఉన్నాడన్నా తగువులేదు, లేడన్నా తగువులేదు, కానీ ఈ ఉన్నాడన్నవారు లేరన్నవారిదగ్గరకిపోయి ఉన్నాడు, ఉన్నాడు అంటుంటారు. ఇక లేడన్నవారు ఉన్నాడు అన్నవారి దగ్గరికిపోయి లేడు, లేడు అని అరుస్తుంటారు. అసలీ గొడవెందుకు? ఎవరి ఇష్టానికి తగినట్టు వారు ఉన్నాడనో,లేడనో అనేసుకోవచ్చుగా?

అసలు తిరకాసు ఇక్కడే ఉంది, ఉన్నాడని అనుకునేవారికి కించిత్ అనుమానం, ఉన్నాడంటావా?లేడేమో! అని. లేడన్నవారికీ కించిత్ అనుమానం ఉన్నాడేమో, అని. అందుకు వీరు, మరొకరు తను నమ్ముతున్న, ఉన్నాడు అన్నవాడిని, మరొకడిని తయారు చేసుకోవాలని ఆరాటం. అలాగే లేడన్నవాడికి కూడా మరో లేడన్నవాడిని తయారు చేసుకుని తన వాదాన్ని బలపరచుకోవాలనే ఆరాటం. ఈ ఉన్నాడు లేడు అనే వాదన, పోరాటం మరొకరు కూడా తమ వాదాన్ని బలపరచేవారిని తయారు చేసుకోడం కోసమే తప్పించి మరొకటి కాదనేదే నిజం. ఇదే మానవ బలహీనత.

ఇక ఉన్నాడు అని పూర్తిగా నమ్మినవానికి ఎవరితోనూ తగవులేదు, వారెవరితోనూ తగవు పడరు, అలాగే పూర్తిగా లేడని నమ్మినవానికీ తగవులేదు, వీరూ ఎవరితోనూ తగవు పడరు. తగవులన్నీ ఉన్నాడేమో! లేడేమో అనే అనుమానపు మనుషులకే…..అదీ సంగతి.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నాస్తి

 1. సార్! అద్భుతః !

  “మరొకరు తను నమ్ముతున్న, ఉన్నాడు అన్నవాడిని, మరొకడిని తయారు చేసుకోవాలని ఆరాటం. అలాగే లేడన్నవాడికి కూడా మరో లేడన్నవాడిని తయారు చేసుకుని తన వాదాన్ని బలపరచుకోవాలనే ఆరాటం”

  100% కరెక్టుగా చెప్పారు. ఈ మధ్య ఒక హేతువాది, ఒక మేధావిననుకునే ప్రొఫెసరు, ఒకానొక స్వామీజీ టీవీ చర్చలో వాదించుకోవడం చూస్తె ఇదే అనిపించింది.

  • YVR’s అం’తరంగం’గారు,
   నాకూ అలా అనిపించే ఈ టపా గిలికేనండి. లోకో భిన్నరుచిః కదండి, అందరికి నచ్చాలా? మీకూ నాలా అనిపించినందుకు
   ధన్యవాదాలు.

 2. అసలు కష్టే ఫలే అంటే ఏంది. మెత్తటి సుత్తి తో కొట్టినట్టుగా ఉంది ఈ పోస్టు. బాలేదు.

  • అన్నియ్యగారు,
   పాల కోసం రాళ్ళు మొయ్యాలండి.పాలక్కరలేకపోతే రాళ్ళు మొయ్యక్కరలేదండి.ఆయ్! కష్టపడితే తప్పించి ఫలితం రాదండి ఆయ్!! అందరికి అన్నీ నచ్చవు కదండీ ఆయ్!!!
   ధన్యవాదాలు.

 3. అదేమిటండీ కష్టే ఫలే వారు,

  కోశంలో పడి మళ్ళీ ఆస్తి నాస్తి లో కొచ్చేసేరు ?

  ఆ కోశం కొన అట్లే వదిలి పెడితే ఎట్లా ? కొస దాకా వెళ్ళ నివ్వండి .

  మీ కోశాల గురించిన మిగిలిన టపా ల కై ఎదురు జూస్తో

  జిలేబి

  • మోహన్జీ,
   అంతా నాగొప్పే అనుకున్నంత కాలం గజరాజుకి ఇలా
   ‘కలడు కలండనెడువాడు కలడో లేడో’
   అనే భ్రాంతి కలిగింది. ఆ తర్వాత సంపూర్ణ శరణా గతితో
   ‘ లావొక్కింతయులేదు అన్నాడు’ కదా! గజేంద్ర మోక్షణ మానవులకన్వయించి టపా రాస్తే బాగుణ్ణు. ఓపిక తగ్గి…
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s