శర్మ కాలక్షేపంకబుర్లు-ప్రాణమయకోశం

ప్రాణమయకోశం                                                              వివేకచూడామణి-4                        

”నేనెవరు?” అనే ప్రశ్నకి సమాధానం ఆత్మ ఐతే, ఆత్మ ఎక్కడుంది? ఈ శరీరమే ‘నేను’ అనే ‘ఆత్మ’ యా?శరీరం పంచకోశ నిర్మితం, ఆ ఐదు కోశాలూ 1.అన్నమయ కోశం2.ప్రాణమయ కోశం 3.మనోమయ కోశం 4.విజ్ఞానమయ కోశం 5.ఆనందమయ కోశం. మరి ఈ పంచకోశాలేంటీ?

1.అన్నమయ కోశం అంటే రక్తమాంసాలతో కూడిన ఈ శరీరం అనుకున్నాం కదూ! మళ్ళీ మళ్ళీ ఇదివరలో చెప్పినదే చెబుతున్నాననుకోవద్దు, గుర్తుండవు, అందుకు గుర్తుకు తెస్తున్నా, మరేం లేదు సుమా!

2.కర్మేంద్రియాలు ప్రాణమూ ఉండేది ప్రాణమయకోశం. అనగా కాళ్ళు, చేతులు, కళ్ళు, మూత్రద్వారం, అపానద్వారం ఇవి కర్మేంద్రియాలు+ పంచప్రాణాలు ప్రాణ,అపాన,వ్యాన, ఉదాన, సమానాలు మొత్తం పది కలిస్తే ప్రాణమయ కోశం.

అన్నం తిన్న మానవులలో; స్త్రీ, పురుషులలో శుక్ర,శోణితాలుగా తాయారయి, ఆ స్త్రీ పురుషుల సంయోగంతో మరల మానవులు పుడుతున్నారు. అలా అన్నం నుంచి ప్రాణం పుడుతోంది. పుట్టిన ప్రాణి అన్నం తిని బతుకుతుంది, అన్నం లేకపోతే నశిస్తుంది.

’ఊపిరి చొరబడితే పుట్టాడంటారు, ఊపిరి నిలబడితే పోయాడంటారు’ అన్నారో సినీ కవి, ఎవరు చెప్పినా ఇదే నిజం. ప్రాణం అంటే ఊపిరి, ప్రాణాలు ఐదు. 1.ప్రాణ. 2. అపాన. 3.వ్యానము. 4.ఉదానము. 5.సమానము. ప్రాణవాయువు నకు హృదయము, అపానమునకు గుదము, సమానమునకు నాభి, ఉదానమునకు కంఠము, వ్యానమునకు సమస్త శరీరము,ఆవరణలు. ఇవియే పంచ ప్రాణాలు.

మానవులలో వాయువు నిమిషానికి 14 ఉఛ్వాస నిశ్వాసలలో తిరుగుతూ ఉంటుంది. ఈ ఉఛ్వాస,నిశ్వాసలపై జీవితకాలం ఆధారపడి ఉంటుంది. ఊపిర్లు పెరిగితే జీవితకాలం తగ్గుతుంది, ఊపిర్లు తగ్గితే జీవితకాలం పెరుగుతుంది. దీనికి ఉదాహరణ తాబేలు, తాబేలు నిమిషానికి రెండు ఊపిరులే తీసుకుంటుంది అందుకు వందల సంవత్సరాలు బతుకుతుంది, అదే మానవుడు ఏడు ఊపిర్లు తీసుకుంటే వంద సంవత్సరాలు బతుకుతాడు.శరీరంలో వాయువు పరతంత్రమైనదే, దీనికి స్వపరభేదాలూ లేవు, ఇష్టాఇష్టాలూ లేవు.

కర్మేంద్రియాలు అన్నమయకోశాన్ని కదిలిస్తూ ఉంటాయి, చైతన్యం ఉంటుంది, ప్రాణం ఉన్నంత వరకే.
ఈ కోశమూ పుట్టుక ముందులేదు, మరణం తరవాతా లేదు, అందుచేత ఈ కోశం ఆత్మ కాదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s