శర్మ కాలక్షేపంకబుర్లు-మనోమయ కోశం

మనోమయ కోశం                                                వివేక చూడామణి-5

అన్నం నుండి పుట్టినది, అస్థి,మజ్జ,మాంసము,రక్తం,మూత్రం, పురీషాలు కలిగిన ఈ శరీరమే అన్నమయ కోశం.

కర్మేంద్రియాలు ప్రాణము కలిసి ప్రాణమయ కోశం అనగా కాళ్ళు,చేతులు,నోరు,మూత్రద్వారం, పురీషద్వారం మరియు పంచప్రాణాలు ప్రాణ,అపాన,వ్యాన,ఉదాన, సమానాలు కలిగినదే ప్రాణమయ కోశం.

మనోమయ కోశం జ్ఞానేంద్రియాలు మనసు కలిగినది. జ్ఞానేంద్రియాలు కన్ను,ముక్కు, జిహ్వ,చర్మం,చెవి మరియు మనసు.

ఈ మనోమయకోశం చాలాబలవత్తరమైనది.  నాది,నేను అనే భావం కలిగి ఉంటుంది, మిగిలినకోశాలతో కలసి ఉంటుంది. మనసే అసలు అవిద్య, దీనిని మించిన అవిద్య లేదు.  ఇదే బంధనానికి,మోక్షానికి హేతువు. ఇది నశిస్తే సర్వమూ నశిస్తుంది.  మనసు విజృంభిస్తే…..ఏ పదార్ధమూ లేని స్వప్నంలో మనసు స్వశక్తితో మిధ్యా ప్రపంచాన్ని సృష్టి చేసుకుని, సమస్త వస్తువులను అనుభవించిన అనుభూతి పొందుతుంది.  జాగ్రదవస్థలో కూడా ఇలాగే చేసుకుని కట్టుబడుతూ ఉంటుంది. నిద్రలో మనసు లీనమైపోతూంది కదా! అప్పుడీ సర్వ ప్రపంచం ఉండదు. సంసారం అనేది మనసుయొక్క కల్పనా చాతుర్యమే. మేఘం గాలిచేత తీసుకురాబడుతోంది, మళ్ళీ గాలిచేతనే దూరంగా తొలగింపబడుతోంది. మనసు, దేహం మొదలైన వాటియందు రాగం కల్పించి బంధనం ఏర్పాటు చేస్తోంది. వాటిని అనుభవిస్తూ కొంతకాలానికి రోసి, ముక్తి ప్రసాదిస్తూ ఉంది. జీవునికి బంధనము,మోక్షము కలిగించేది మనసే. ఈ మనసే ఆత్మ కొరకు సూక్ష్మ,స్థూల విషయాలలో, వర్ణము, ఆశ్రమము,జాతి,భేదము,గుణము,క్రియ హేతువు,ఫలము మొదలైనవానిని కల్పన చేస్తూ ఉంటుంది. ఇలా చేసి సంగం లేని ఆత్మను మోహింపచేస్తూ, దేహము ఇంద్రియాలు,ప్రాణం వానిచే బంధించి, నేను,నాది అనే భావాన్ని కలగచేస్తూ జనన,మరణాలలో తిప్పుతూ ఉంటుంది.

ఒక విషయానికి ఏడుస్తుంది, మరొక విషయానికి నవ్వుతుంది. ఎవరో, ఏదో అన్నారని బాధపడుతుంది, ఎవరినో కించపరచేమని ఆనందిస్తుంది. పోట్లాడుతుంది, ముక్కూ మొహం తెలియని వాళ్ళని అకారణంగా ప్రేమిస్తుంది.  సర్వ అనుభూతులూ పొందుతూ ఉంటుంది. ఒక క్షణంలో ఒక చోటనుంచి మరొకచోటికి ప్రయాణిస్తుంది, స్థిరత్వం ఉండదు. ఒకరితో బాంధవ్యం అంటుంది, మరొకరితో వైరం అంటుంది. అప్పటిదాకా బాంధవ్యం అన్నది మరుక్షణం లో వైరంగా మార్చుకుంటుంది.  తనను కావాలనుకున్నవారిని తను కావాలనుకోదు, తనను కావాలనుకోనివారినే తను కావాలనుకుంటుంది. చిన్న మాటకి నిండాపడుతుంది, అపార్థం చేసుకుంటుంది, భీష్మిస్తుంది, అలుగుతుంది, బాధపడుతుంది, ఎన్ని చిన్నెలో చెప్పలేం, ఇదంతా మనసు చేసే ఒక మాయా జాలం. ఇంత చంచలమైనది మరొకటిలేదు.

ఈ మనోమయకోశం కూడా ఆత్మ కాదు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s