శర్మ కాలక్షేపంకబుర్లు-ఆనందమయ కోశం.

ఆనందమయ కోశం.                                                 వివేక చూడామణి-7

ఆనంద స్వరూపమైనది ఆత్మ. ఆత్మ ప్రతిబింబం తమోగుణంతో కూడి ఉండేది ఆనందమయ కోశం. దీనికి మూడు గుణాలు, (ప్రియము,మోదము,ప్రమోదము). కోరినవి సిద్ధించినపుడు ప్రకటితమవుతూ ఉంటుంది. పుణ్యకర్మ వలన కలిగే సుఖాలను జీవులందరు అప్రయత్నముగానే పొందుతారు. ఆనందమయ కోశపు ఉత్కట స్థితి సుషుప్తిలో ఎక్కువ, జాగ్రదవస్థ, స్వప్నావస్థలలో కూడా దీని వలన ఆనందం పొందుతారు. ఈ ఆనందమయ కోశం కూడా ఆత్మ కాదు, ఎందుకంటే ఇది ఉపాధితో కూడినది, ప్రకృతి వికారం కలది. ఇది ఉపాధిని (శరీరాన్ని) ఆశ్రయించి ఉంటుంది.

నేతి, నేతి, ఇదికాదు ఇదికాదు అని నిషేధిస్తూ పోతే చివరికి మిగిలేదే ఆత్మ. అన్నమయాది పంచకోశాలలో లేక ( అందుకే ఏ కోశానా లేదన్న మాట పుట్టింది)జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలకు సాక్షిగా నిర్వికారంగా, నిర్మలంగా, నిత్యానంద స్వరూపమై ఉండేదే ఆత్మ. ఎక్కడుంది?

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆనందమయ కోశం.

 1. అంతా స్తబ్దు గా ఉంది !

  కష్టే ఫలే వారు కుశల మేనా ?

  వివేక చూడా మణి వారికి తితీక్ష గురించి చెప్పాల్సిన పని లేదను కుంటా ! స్తబ్దు వదల వలె ! వెల్, కం బేక్ టు ఏక్షన్ 🙂
  This too shall pass ; Arise awake ….

  మళ్ళీ మీరు టపా ‘పరమ’ పాటాల్ కొనసాగిస్తారని ఆశిస్తో :

  జిలేబి

  • Zilebi గారు,
   This too shall pass … Yes true
   ఆనంద సమయంలో కాలం నిలవదు 🙂 కష్టసమయంలో కాలం గడవదు. ఆనందమనుకున్నదీ, కష్టమనుకున్నదీ ఏదీ నిలవదు, నిజమూ కాదు.
   ధన్యవాదాలు.

  • మిత్రులు విన్నకోట నరసింహారావు గారు,
   ఇబ్బందితో ఆలస్యంగా చూశాను, మీ అభిమానానికి ధన్యవాదాలు. మీకు మీకుటుంబ సభ్యులకి శ్రీకృష్ణాష్టమి పండుగ శుభకామనలు, ( ఆలస్యమే అయింది).
   ధన్యవాదాలు.

 2. అవును , ఆత్మా ఎక్కడుంది ?

  లేని దాన్ని ఉందీ ఉందీ అంటూ ఇంత దూరం దాకా లాక్కొచ్చి ఇక్కడా లేదంటే ఎట్లా కష్టే ఫలే వారు?

  న ఇతి 🙂

  అసలు ఆత్మ ఉందంటారా నిజం గా నే ?

  జిలేబి

  • Zilebiగారు,
   అసలు ’నేను’ ఎవరు? అనే ప్ర్శన వేసుకుని బయలుదేరితే శంకరుల వివేక చూడామణీ దగ్గర తేలేను. రాయాలనే ఉంది, ఆత్మ ఉంది……శంకరులే న+ఇతి అనే elimination process లో చెప్పేరు. ”గుండెలు తీసిన బంటు”లకి ఆత్మ కనపడదు లెండి.
   ధన్యవాదాలు.

 3. దీనికి మీరే జవాబు రాయాలి.నాకు తెలిసినంతవరకు;ఆత్మ ఒక పదార్థం కాదు.అది శక్తి.(energy)సర్వవ్యాపకమై ఉంటుంది. అది పోగానే చైతన్యం పోతుంది,మరణం సంభవిస్తుంది.

  • Ramana Rao Muddu గారు,
   నేను ఈ విషయాన్ని శంకరుల వివేక చూడామణి నుంచి తీసుకుంటున్నాను. రాయాలనే ఉంది, ప్రస్థుతం శరీరం సహకరించటం లేదు,
   ధన్యవాదాలు.

   • మిత్రులు శర్మగారు,

    శరీరం సహకరించటం లేదని మీరు వ్రాయటానికి ఇబ్బంది పడుతున్నారన్న మాట విచారం కలిగించింది. నాకైతే మనస్సు సహకరించటం లేదు ఏమి వ్రాయటానికీ ప్రస్తుతం.

   • తాడిగడప శ్యామలరావు గారు,

    శరీరం కాని మనసుకాని సహకరించకపోవడం జరుగుతూనే ఉంటుంది. మనసుని మాత్రం చాలా జాగ్రత్తగా పట్టుకోవాలండి, లేకపోతే నిరాశావాదం లో కూరుకుపోతుంది, అదెప్పుడూ పనికిరానిది కదా! మళ్ళీ పుంజుకోండి, మీరే మొదలుపెడతారు,రాయడం.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s