శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ విచారం.

ఆత్మ విచారం.                                                               వివేకచూడామణి-8

జంతూనాం నర జన్మ దుర్లభం అన్నారు శంకరులు, అటువంటి నరజన్మలో పురుషుడవటం గొప్ప అన్నారు, ఇతనికి మోక్షాపేక్ష కలగటం, ఆపైన సత్పురుష సహవాసం కలగటమనేది భగవంతుని కృపవలనగాని సాధ్యం కాదన్నారు. ఒక సారి ఆత్మ విచారం లో కొన్ని మాటలకి అర్ధాలు తెలుసుకున్నాం, ఇప్పుడు మరికొన్ని,ఆది శంకరుల వివేక చూడామణి చదివిన తరవాత నాకనిపించినది రాశాను, నా అవగాహన తప్పు కావచ్చు.

వాసన… ఆత్మ క్రితం జన్మలో ఉపాధిని అనగా శరీరాన్ని వదలివేసేటపుడు కూడా తెచ్చుకునేది, ఇది విద్య, విజ్ఞానం , అలవాటు ఏదేని కావచ్చు. ఇది కొత్త ఉపాధిలో కూడా ఉంటుంది…ఇది మూడు రకాలు, లోకవాసన,శాస్త్రవాసన,దేహవాసన.

ఆత్మజ్ఞానం అనగా మోక్షం కావాలంటే విద్య,యోగం,సాంఖ్యం వీటివల్ల సమకూరదు,అలాగని వీటిని అభ్యసించడమూ మానేయకూడదు. వీటి వలన ఆత్మజ్ఞానం కలగదు, వీటివలన ఆత్మ విశ్వాసం పెరగచ్చు, ఆరోగ్యమూ చేకూరవచ్చు..

విషయం…. శబ్ద,స్పర్శ,రూప,రస,గంధాలను జ్ఞానేంద్రియాల ద్వారా అనుభవిస్తాము. ఇవి బలవత్తరమైనవి. శబ్దానికి వశమై లేడి వలలో చిక్కుకుంటుంది, స్పర్శా సుఖనికై వెంపరలాడి మగ ఏనుగు ఆడ ఏనుగు వెనకపడి, గోతిలో పడి స్వాతంత్రాన్నే కోల్పోతుంది, మిడుత అగ్నిని చూచి భ్రమించి అందులో దూకుతుంది,ప్రాణం పోగొట్టుకుంటుంది. చేప ఎరను మింగడానికి చూచి గాలానికి చిక్కి చనిపోతుంది, చివరిగా తుమ్మెద వాసనకు ఆకర్షింపబడి పద్మంలో చిక్కుకుపోతుంది. ఈ ప్రాణులు ఆ యా ఇంద్రియాల ప్రలోభంతో, భ్రమలో ప్రాణాలు పోగొట్టుకుంటాయి, లేదా చిక్కుకుంటాయి. ఈ ఇంద్రియాలన్నీ బలవత్తరంగా ఉన్న మానవులు విషయాలలో అనగా ఇంద్రియ సుఖాలకోసం వెంపరలాడటమే విషయ సుఖానుభవం…

అవిద్య అనగా తెలియనితనం లేదా మనసు.

మాయ.…దీనినే అవ్యక్తం అంటారు,మూడు గుణాలతో ( సత్వ,రజస్తమో గుణాలతో)అనాది అవిద్యగా పరమేశ్వరుని శక్తి ఏది కలదో అదేమాయ…ఈ సర్వజగత్తూ పుట్టినది మాయనుండే.. ఇది సత్యంకాదు, అసత్యమూ కాదు,సత్యమూ అసత్యమూ కాదు, ఇది అంగ సయితంకాదు, అంగ రహితమూ కాదు, అదీ కాదు, ఇదీకాదు, పరమాద్భుతమైనది, అనిర్వచనీయమైనది.

అనాత్మ....దేహం,ఇంద్రియాలు,ప్రాణాలు, మనస్సు, అహంకారము, మొదలైన వికారాలు, సుఖదుఃఖాలు,పంచభూతాలు, మాయ మహత్తు, మాయ యొక్క సమస్థ కార్యాలు అన్నీ అనాత్మరూపాలు.

అధ్యాస: లేనిదానిని ఉన్నట్టుగా భావించడం. ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి. నిజంగా అక్కడ ఉన్నది తాడు కాని అవిద్య, అజ్ఞానం చేత దానిని పాముగా భ్రమించడమే అధ్యాస.

ఆత్మ....అహం అనగా నేను అన్నదానికి నిత్యమైన పదార్థం ఏదయితే ఉందో అదే ఆత్మ.ఇది స్థూల శరీరపు మూడు అవస్థలోనూ సాక్షిగా బుద్ధి మొదలైనవాని యొక్క చర్యలను చూస్తూ ఉంటుంది. ఆత్మ అన్నిటినీ చూస్తూ ఉంటుంది గాని ఆత్మనెవరూ చూడలేరు.

సర్వే యేనానుభూయంతే యస్స్వయం నానుభూయతే
తమాత్మానం వేదితారం విద్ధి బుధ్యా సుసూక్ష్మయా…..216
దేని చేత సర్వమూ అనుభవించబడుచున్నదో, ఏది తాను స్వయముగా అనుభవింపబడదో ఆ సర్వ సాక్షియగుదానినే నీ ఆత్మయని అతి సూక్షమైన బుద్దితో ఎరుగుము

ఆత్మ ఎక్కడుంది?…. బుద్ధి గుహలో ఉందన్నారు.

దేహం ధియం చిత్ప్రతిబింబమేతం
విసృజ్య బుద్ధౌ నిహితం గుహాయామ్
ద్రష్టారమాత్మానమఖండబోధం
సర్వప్రకాశం సదసద్విలక్షణం….222

దేహము బుద్ధి చిదాభాసము అను మూడింటిని వీడి బుద్ధి గుహలోనున్న సాక్షి రూపమగు ఈ ఆత్మను అఖండ బోధస్వరూపునిగా, సర్వప్రకాశకునిగా,సత్తు, అసత్తులకు భిన్నమైనవానిగా,నిత్యునిగా,విభునిగా,సర్వగతునిగా,సూక్ష్మరూపునిగా,బాహ్యాంతర భేద రహితునిగా,తనకంటె సర్వవిధముల అభిన్నునిగా ఎరిగుము.

నేటి కాలంలో ప్రత్యక్ష ప్రమాణాన్ని తప్పించి మరొక ప్రమాణాన్ని కొంతవరకు, అనుమాన,పరోక్షప్రమాణాలను కూడా ఒప్పుకోలేకపోతున్నాం కనక ఈ ఆత్మ గురించిన భావన అంత తేలికైనది కాదు

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆత్మ విచారం.

  1. శర్మ గారూ,మెరు కాలక్షేపం కబుర్లు అని చెప్పి క్లిష్టమైన వేదాంతమంతా రాస్తున్నారు. .జీవితమెలాగైనా సీరియస్. కాస్త సరదాగా రాయండి.

  2. >>>నేటి కాలంలో ప్రత్యక్ష ప్రమాణాన్ని తప్పించి మరొక ప్రమాణాన్ని కొంతవరకు, అనుమాన,పరోక్షప్రమాణాలను కూడా ఒప్పుకోలేకపోతున్నాం కనక ఈ ఆత్మ గురించిన భావన అంత తేలికైనది కాదు.

    प्रत्यभिज्ञात हृदयः 🙂

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s