శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నన్నా!

download

అన్నన్నా!

అన్నన్నా! దీన్నే మనం హన్నన్నా! అనేస్తున్నాం. ఇదీ ఊతపదంలాగే కనపడుతుంది. మీకన్నిటిలోనూ ఏదో ఒకటి కనఒపడుతూనే ఉంటుందండీ, ఈ మధ్య కొందరు ఇటువంటి మాటలు మాటాడటం కూడా మానేసేరు, వీటి గురించి తెలిశాకా! 🙂  అన్నాడు మా సత్తిబాబు.

అన్న+ అన్న= అన్నన్న! అనగా అన్నగారికి అన్నగారు. ఇదే పెద్దన్నగారనమాట. దీనికేం చెబుతారన్నాడు మా సత్తిబాబు.

రామ,లక్ష్మణ,భరత,శత్రుఘ్నులు సోదరులు అని చెబుతాం. కాని అలాకాదు. వీరు సోదరులుకాదు, సహోదరులు మాత్రమే! సోదరులనగా ఏక గర్బజనితులు. సహోదరులనగా తండ్రి ఒకరు, తల్లులు వేరుగా జన్మించినవారు. మొదటగా కర్కాటక లగ్నంలో నవమినాడు కౌసల్యా తనయునిగా జన్మించినవాడు రాముడు. నవమినాడే మీన లగ్నంలో కైకయందు జన్మించినవాడు భరతుడు. ఇక లక్ష్మణ, శత్రుఘ్నులు దశమినాడు కర్కాటక లగ్నంలో జన్మించారు, వీరిద్దరూ కవలపిల్లలు. వీరిద్దరిది జాతక చక్రం ఒకటే.రాముడు భరతుడు నీలమేఘఛ్ఛాయతో ఉంటే లక్ష్మణ,శత్రుఘ్నులు ఎఱ్ఱగా ఉంటారు.

లక్ష్మణ,శత్రుఘ్నుల అన్నగారు భరతుడు, ఆయన అన్నగారు రాముడు. అన్నగారికి అన్నగారు రాముడు, అన్నన్నా అంటూనే ఉండండి.

ఇదీ ఊతపదం కాదు సుమా! ఇదీ మన సంస్కృతి.

ప్రకటనలు

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అన్నన్నా!

   • మిత్రులు శర్మగారు,

    అనేక నమస్కారములు. ఉభయకుశలోపరి –

    సహ+ఉదర=సహోదర, సవర్ణదీర్ఘ సంధికదూ అన్నారు. పొరబడ్డారనుకుంటానండీ. అది గుణసంధి.
    *********
    మిత్రులొకరు పైన చెప్పిన సంధి సవర్ణదీర్ఘ సంధి కాదు, అది గుణ సంధి అన్నారు. చిన్నప్పుడు చదువుకున్నది మరిచిపోయాను. పొరపాటు దిద్దినందుకు మిత్రులకి నమస్కారం.

    ధన్యవాదాలు.

 1. అన్నన్నా !

  సోదరునికి, సహోదరునికి ఇంత వ్యత్యాసం ఉందా !

  సోదరులనగా ఏక గర్బజనితులు ! సహోదరులనగా తండ్రి ఒకరు, తల్లులు వేరుగా జన్మించినవారు

  ఆంధ్ర భారతి నిఘంటువు రెండింటి కీ ఒకే అర్థం- తోడ బుట్టిన వాడు అని అర్థం చెబుతుందేమండీ కష్టే ఫలే వారు ? వివరించ వలె !

  మన రాజకీయ నాయకులా చాలా ఈజీ గా సోదరా అనేస్తూ ఉంటారు కదండీ

  సోదర సోదరీమణు లారా ! దీనికి నిర్వచనం మా నారా వారే ఇవ్వాలి 🙂

  జిలేబి

  • జిలేబి గారు,

   స+ఉదర=సోదర, సహ+ఉదర=సహోదర, ఈ మాటలలోనే వాటి అర్ధాలున్నాయండి! నేటి కాలంలో మాటల అర్ధాలు మారిపోతున్నాయి కదండీ! సోదరుడికి,సహోదరుడికి అర్ధం ఒకటే, అన్నగాని తమ్ముడుగాని….కాని కొంత తేడా ఉంది,తేడాలేకపోతే రెండు మాటలెందుకున్నాయంటారు?

   సోదరుడంటే ఏక గర్భజనితుడు, సహోదరుడంటే అదే తండ్రికి మరొక తల్లివలన జన్మించినవాడనేదే అసలు అర్ధం… 🙂

   ఆంధ్రభారతి నిఘంటువు మీరు చెప్పినట్టే చెబుతోంది..

   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s