శర్మ కాలక్షేపంకబుర్లు-తమలపాకుతో…..

తమలపాకుతో…..

“తమలపాకుతో నీవొకటంటే తలుపు చెక్కతో నే రెండంటా” అని నానుడి. ఎవరినైనా ఒక మాటంటే, తిరిగి వారు మరో రెండు మాటలు వడ్డీతో బాకీ తీర్చేస్తారు, మానెయ్యరు. కాని కొంతమంది మాటాడరు,ఓర్పు వహిస్తారు, “ఎదుటివారు చెప్పుకొరికితే మనం సిద్ది కొరుకుతామా?” అంటారు, ఇదొక నానుడి.. మాటకి మాటా సమాధానం చెప్పెయ్యరు.సమాధానం చెప్పకపోయినవాళ్ళంతా చేతకానివాళ్ళనుకోడం అవివేకం. అటువంటివారి దగ్గరే జాగ్రత్త అవసరం. “అని, అనిపించుకోడం అత్తగారా నీకలవాటు” ఇదో నానుడి. మాటలంటూ పోతే పాపం మూటకట్టుకోడమే! ఏదిపాపం? “పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం” ఈ పీడనం ఏరకంగానైనా ఉండచ్చు. “ఎవరు చేసిన కర్మ వారనుభవింపకా ఏరికైనా తప్పదన్నా! ఏనాటి ఏతీరు ఎవరు చెప్పాగలరు అనుభవింపక తప్పదన్నా!” నోరుంది కదానని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటే పర్యవసానాలు ఆ అతరవాత భయంకరంగా ఉండచ్చు. పాపం మూటకట్టుకోడమే. ఆ గాడిదగుడ్డు ఎవడు చూడొచ్చాడు. శుభం, ఎవరుకాదనగలరు? అనుభవం మరెక్కడో కాదు ఇక్కడే! ఇక్కడే!! ఇక్కడే!!! తప్పదు. పాపపుణ్యాలలెక్కలు తప్పవు, కాదు తప్పుకావు. స్వర్గ నరకాలు వేరుగాలేవు. నవ్వుతూ చేస్తాం ఏడుస్తూ అనుభవిస్తాం, అంతే తేడా..

నరసాపురంలో ఉద్యోగం చేస్తున్న రోజులు. ఒక రోజు జెట్టిపాలెం అనే ఊరెళ్ళేను. అదే, ఆ ఊళ్ళోనే మొదటగా ఆయిల్ పడిన ఊరది. అసలు పేరు గుర్తులేదిప్పుడు, కాని దాన్ని జెట్టిపాలెం అంటారు, ఆ( గుర్తొచ్చింది అది లింగంబోయిన చర్ల కాని దీన్నికూడా ఎల్.బి.చర్ల అనడమే అలవాటు… కుమ్మరిపురుగుపాలెం, పేరుపాలెం ఊళ్ళకి వెళ్ళేదారిలో తగులుతుంది, ఈ ఊరు. రోడ్ కి ఒక వైపు ఇళ్ళు రెండవ వైపు పంటకాలవ. పంటకాలవ అవతల ఒకటే శ్రేణిలో ఇళ్ళూ, ఊరు పొడూగ్గా ఉంటుంది, ఒక కిలో మీటర్ దూరం. కోనసీమలో ఊళ్ళన్నీ అలాగే ఉంటాయి. అదిగో ఆ ఊరెళ్ళేను కేంపుకి. నేను ఊరి మొదటికి చేరేటప్పటికి ఆ ఊరు లైన్మన్ సుబ్బారావు కనపడ్డాడు. అతను సైకిల్ మీద నేను మోటార్ సైకిల్ మీద ఉన్నాం. నెమ్మదిగా అతనితో పాటు మోటార్ సైకిల్ నడుపుతూ వెళ్తున్నాం, మాటాడుకుంటూ, ఆఫీస్ కి. ఒక ఇంటి దగ్గర నుంచి పెద్ద గొంతుతో ఇలా సంభాషణ వినపడింది. “ఒసే! గుడిసేటి లంజా! ఎక్కడ సచ్చేవే! పిలస్తంటే ఇనపట్టంలా” అన్నమాటలకి “దేవుడు నీ కాలూ చెయ్యీ పారేసేడు కాని నోరు పారెయ్యలేదే! సస్తన్నా! నువు సస్తే దినారంతో నా దెయిద్రం తీరిపోద్ది”” అన్న మాటలు వినపడ్డాయి, దానికి ప్రతిగా “నిన్ను ఎన్నెమ్మ ఎత్తుకెల్లా! నా నోరడిపోలేదంటావుటే దెష్టముండకానా, నా దినారం సేస్తావా! నా కొడుకు మెత్తనోడు గనక నీయాటలు సాగుతున్నయే గుడిసేటి లంజా” అన్న జవాబూ వినపడింది.ఒక్క సారి నిర్ఘాంతపోయి ఆగేను. మా సుబ్బారావు నవ్వుతూ నడవండి చెబుతానంంటే ముందుకెళ్ళిపోయాం.

మా సుబ్బారావు భావుకుడు కూడా

అత్తగారు మంచంలో పడింది, పక్షవాతంతో, కోడల్ని తిడుతోంది, మరి ఇప్పుడు కోడలుకాలం కదండీ అందుకు కోడలూ అందుకుందని కొన సాగించేడు. ఈ అత్త ఉట్టి గయ్యాళి, మామగారున్నప్పుడూ అతన్నీ మాటాడనిచ్చిన మనిషి కాదు. పాపం కోడలు మేదకురాలే! చాలా కాలం అత్త దాష్టీకాన్ని భరించింది,దెబ్బలూ తింది, ఇప్పుడు అత్త మంచంలో పడింది, మరిలేవలేదని గ్రహించింది కోడలు, ఇక భరించలేక తిరగబడుతోంది, ఈ మధ్యనే. బయట వరండాలో చలి కదా అన్నా! నులకమంచంలో పడేశారండి, అన్నీ అందులోనే! కిందకిపోతాయి, కోడలు తరవాత చూసుకుంటుంది పాపం. రెండు గదుల ఇల్లు, ముసలమ్మకి చలిలేకుండా చుట్టూ కట్టేరు, రెండు రగ్గులు కప్పుతారు. “ఏమైనా ముసలమ్మకి కష్టమే” అన్నా! బలేవారు! ఈ ముసలమ్మ ఒకప్పుడు ఈ కోడలిని చలిలో కప్పుకోడానికి మరో చీరకూడా ఇవ్వకుండా కటికి నేలమీద బయట సంవత్సరాల తరబడి పడుకోబెట్టిందండి, కొడుకుతో సంసారం కూడా చెయ్యనివ్వలేదండీ, రెండు గదుల ఇంట్లో అంతకుమించి చెయ్యలేరు లెండి, అన్నాడు. ఇలా మాటాడుతోంటే ఇరుగు పొరుగు అని సాలోచనగా అర్ధోక్తిలో ఆగాను. ఆ రోజు అత్త కోడల్ని కష్ట పెట్టినా లోకం మాటాడలేదండి, ఇప్పుడు కోడలు మాటలంటున్నా లోకం మాటాడటం లేదండి. లోకం ఇంతే కదండీ! ”అనేకబాహూదరవక్త్రనేత్రం” నారాయణుడంతా సాక్షిమాత్రంగా చూస్తూ ఉంటాడండి,ఇక్కడ చేసినపాపం ఇక్కడే అనుభవిస్తోందండి ఆముసలమ్మ. అని ముగించాడు.

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తమలపాకుతో…..

 1. కథ చాలా బావుంది సార్…. అత్తంటే కోడల్ని సాదిస్తూ వుండాలి…అని తరతరాలుగా ఆడవాళ్ళ బుర్రల్లో నాటుకు పోయింది… ఈనాటి ఆధునిక యుగంలో కూడా కోడల్ని చూడగానే మూతి మూడు వంకర్లు తిప్పుతూ సాదించే అత్తగార్లు ఉండటం దురదృష్టం…టీ.వీల్లో సీరియల్లు కూదా ఇలాగే తగలడ్డాయి… ఇంకో వందేళ్ళయినా ఇలాగే వుంటాయేమో ఈ అత్తాకోడళ్ళ బంధాలు.. శాంతి లేని బతుకులు…

 2. కాయం లేని ఆసామి ఆ నారాయణుడు !

  అతనికి అనేక బాహూ, ఉదర వక్త్ర నేత్రం కూడా నా 🙂 జేకే !

  జిలేబి
  (ఏదో మరో టపా దీనిపై పడుతుందని ఆశిస్తో :
  ఆనందో బ్రహ్మ ! అయితే కాసుకోండి :))

  • కథ చాలా బావుంది సార్…. అత్తంటే కోడల్ని సాదిస్తూ వుండాలి…అని తరతరాలుగా ఆడవాళ్ళ బుర్రల్లో నాటుకు పోయింది… ఈనాటి ఆధునిక యుగంలో కూడా కోడల్ని చూడగానే మూతి మూడు వంకర్లు తిప్పుతూ సాదించే అత్తగార్లు ఉండటం దురదృష్టం…టీ.వీల్లో సీరియల్లు కూదా ఇలాగే తగలడ్డాయి… ఇంకో వందేళ్ళయినా ఇలాగే వుంటాయేమో ఈ అత్తాకోడళ్ళ బంధాలు.. శాంతి లేని బతుకులు…

   • shankarvoletiగారు,
    అత్త,కోడలు మధ్యలో ఉన్నది స్వామ్యపు పోరాటం. కొడుకుని కోడలు పట్టుకుపోతోందేమోనని అత్త బాధ, తనదైనదాన్ని అత్త ఇంకా వదలకపోడమేమని కోడలు బాధ. వడ్లగింజలో బియ్యపు గింజ తెలుసుకుంటే.

  • జిలేబిగారు,
   అమ్మో,అయ్యో, అదో ఏదైనా ’వ్యక్తాఽవ్యక్త న్స్వరూపిణి’ కదండీ. అనేక బాహువులు , ఉదరాలూ కలిగిన జనసామాన్యమూ ఆ శక్తే, అవ్యక్తమైనదీ ఆ శక్తే అదే అద్వైతం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s