శర్మ కాలక్షేపంకబుర్లు-నమో మన్మథాయ

నమో మన్మథాయ

సీ. రతిమనః కాంతాయ రాజీవకుంతాయ
మలయానిల రథాయ మన్మథాయ
సత్కీరవాహాయ జగదేకమోహాయ
మత్త శూర్పషధాయ మన్మథాయ
పద్మాకుమారాయ బాలికాధారాయ
మహనీయవిభుదాయ మన్మథాయ
మాధవప్రభవాయ మాధవసచివాయ
మానితాత్మకథాయ మన్మథాయ

తే.గీ.  మంజుహర్షణ బోధాయ మన్మథాయ
మథుపగుణచాపనాథాయ మన్మథాయ
మహిత శృంగార సదనాయ మన్మథాయ
మనసిజాయ తుభ్యం నమో మన్మథాయ

రతిఃమనక్కాంతాయ రతీ దేవి మనోనాథుడు,రాజీవము, తామరపువ్వు కుంతము అనగా ఆయుధముగాకలవాడు, మలయానిలరథాయ, పిల్లగాలి రథముగాగలవాడు మన్మథుడు.కీరము,చిలుక వాహనంగా కలిగినవాడు, జగాన్ని మోహింపచేసేవాడు, మత్తశూర్పషధాయ ( ఎంత కొట్టుకున్నా అర్ధం తెలియలేదు, మత్త మత్తెక్కిన, శూర్పము చేట…ఇంక ముందుకుపోలేదు, లేదా శూర్పషధము అంటే వేరే అర్ధం ఉందా?)మన్మథుడు.పద్మాకుమారుడు లక్ష్మీదేవి కుమారుడు, బాలికాధారాయ స్త్రీలకు ఆకరమైనవాడు,మహనీయుడు మన్మథుడు.మాధవుని కుమారుడు, మాధవుని చెలికాడు,గొప్ప చరిత్ర కలవాడు మన్మథుడు.

చక్కగా మాటాడే మాటలు కలవాడు,మధుపం, తుమ్మెద,గుణం,వింటినారి, చాపము,విల్లు అనగా తుమ్మెదలే వింటినారిగా కలిగినవాడు,గొప్పదైన శృంగారానికి నాయకుడు అయిన మనసిజాయ మనసునపుట్టిన ఓ మన్మథా నీకు నమస్కారం.

కూచూడానికి పడుకోడానికి కూడా సుఖంగా లేని సమయంలో ఇదిగో ఈ పుస్తకం కవయిత్రి ముద్దుపళని రచించిన రాధికా స్వాంతనం దొరికింది. తిరగేస్తుంటే ఈ పద్యం కనపడింది. దీని అర్ధం కొంచం విపులంగా తెలిసినవారు చెప్పవలసినదిగా కోరిక.

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నమో మన్మథాయ

    • RAJESWARI గారు,
      అసలే ఒక విషయంలో హడావుడి పడుతుంటే మరొక విషయంతో కూడా హడావుడి పడవలసిరావడాన్ని ఇలా చెబుతారు. వివరాలు నాకూ ఇంతకంటే తెలియవు.

  1. astrojoyd20 November 2015 at 22:02
    మత్త శూర్పషధాయ–మదగజము యెక్క కన్నుఅల్ నుంచి కారు మద జలము యెక్క వాసనను గ్రహించిన నల్లని గండు తుమ్మెదల గుంపు యెక్క రొద లేదా దాడిని ను మత్హసూర్పషధము అంటారు..అంటే మన్మన్ధతాపం కలిగితే కామం నల్ల గండుతుమ్మేధలవలె ప్రాణిని వొక పట్టాన శాంతిగా నిలవనివ్వవని అర్ధము..ఇక్కడ సూర్పము అంటే ఏనుగు చెవులని అర్ధము..ఎందుకంటే అవి చూడటానికి చేత ను పోలిఉంటవి కనుక.. ఇది నాకు తెలిసిన అర్ధము శర్మ గారు..

    ReplyDelete
    Replies

    astrojoyd20 November 2015 at 22:04
    చేట-కన్నుల-అనిచదువుకోనగలరు..

    Delete
    Reply

  2. ఏ వయసుకా ముచ్చట్లు 🙂 సరియైన ‘మాన్’ మదన్ ని పట్టడానికి ‘రాదిక’ వేరు సమయం 🙂

    జేకే!

    జిలేబి

    • జిలేబిగారు,

      సంతోషం కోసమే మానవుల పరుగు 🙂 దానికోసం డోపమైన్ లెవెల్ సరిచూసుకునే ప్రయత్నాలే అన్నీ, అందరూ, అన్ని వయసుల్లోనూ 🙂

  3. మన్మథుడు దహించబడ్డ తర్వాత శ్రీ కుమారస్వామి వారి జననం.
    ఆయన శ్రీకృష్ణుని కుమారుడు.
    అలా చూస్తే 5000 సం. క్రితం కుమార సంభవం.
    కాని శ్రీశైల చరిత్ర, స్కంద పురాణం, ప్రకారం ఎన్నో యుగాల ముందుది కుమార సంభవం. ఎలా? సందేహం తీర్చండి మాష్టారు గారూ..
    అంటే మన్మథుడు మళ్ళీ పుట్టాడా శ్రీకృష్ణుని కొడుకుగా?

    • కుమార్ గారు,
      మన్మథుడు సృష్టి కి కారకుడు 🙂 ఇతనికి మరణం అనేదే లేదు. ఇక విషయం లో కొస్తే

      దక్షయజ్ఞం,సతీ శరీరత్యాగం, పార్వతీ తపం, ఈశ్వర తపస్సు, దేవతలు పార్వతీ కల్యాణం కోసం కాముని వేడుకోడం, కాముడు పూలబాణం వేయడం, కామ దహనం, రతీ విలాపం, కాముని పునర్జీవితుడవటం,పార్వతీ కల్యాణం, ఆ తరవాత చాలా పెద్ద కథ జరిగి కుమార సంభవం ఇదీ క్రమం…
      ఇక కాముడు కృష్ణునికి కుమారుడుగానూ జన్మించడం అంశ. నాకు తెలిసినవరకు చెప్పేను.

వ్యాఖ్యానించండి