శర్మ కాలక్షేపంకబుర్లు-చచ్చి బతికిన అర్జునుడు

చచ్చి బతికిన అర్జునుడు

జబ్బు చేసి బయటపడితే సంతోషం, అటువంటిది చచ్చిబతికితే ఎలా ఉంటుంంది? మొన్నీ మధ్య అనారోగ్యం చేసింది, ఒకసారి తగ్గి మరలా తిరగబెట్టింది. అమ్మయ్య తగ్గింది, ఇక పథ్యం తీసుకోవచ్చనుకునే సమయంలో చేసిన ఒక చిన్న పొరపాటు ప్రాణాపాయ అంచులదాకా తీసుకుపోయి, ఇల్లాలి సమయస్ఫూర్తితో మరలా బతికితే ఆనందమే కదా! ఇటువంటి సంఘటన భారతం లో ఒకటుంది, అదే అర్జునుడు చచ్చి బతికిన ఘట్టం. అర్జునుడు చనిపోయి బతకడమా అని అనుమానం కదా! ఈ ఘట్టం చదవండి మరి…

పూర్వరంగం.
భారత యుద్ధం ముగిసింది,ధర్మరాజుకు పట్టాభిషేకం జరిగింది. ఆ తరవాత కృష్ణుని పనుపున ధర్మరాజు అశ్వమేథయాగం చేశాడు. అందులో భాగంగా గుర్రాన్ని వదలిపెట్టేడు. దానికి రక్షణగా అర్జునుని పంపేడు. అర్జునుడు ఆ గుర్రం సంచరించిన దేశాల రాజులతో యుద్ధం చేసి ఓడించి సామంతులను చేసుకుంటూ పోతున్న సమయం. ఈ స్థితిలో యాగాశ్వం మణిపుర రాజ్య సరిహద్దులకు చేరింది. మణిపురానికి అర్జునునికి, చిత్రాంగదకు జన్మించిన బభ్రువాహనుడు రాజుగా ఉన్నాడు. ఇతను భారత యుద్ధంలో పాల్గొన్న దాఖలాలు లేవు. ఈ మణిపుర రాజ్యం బభ్రువాహనుని మాతా మహుల రాజ్యం. ఇక కథా ఘట్టం..అశ్వమేథ పర్వం ఆశ్వాసం.౪..౪౯ నుండి ౯౦వరకు స్వేఛ్ఛానువాదం.

మణిపుర రాజ్య సరిహద్దుకు గుర్రం చేరగానే బభ్రువాహనుడు అర్జునునికి ఎదురెళ్ళి నమస్కరించి స్వాగతం చెప్పి పలకరించాడు,కాని అర్జునుడు అనాదరం చేశాడు. ఏందుకు తండ్రి అనాదరం చేస్తున్నాడో తెలియని బభ్రువాహనుడు కలతచెందగా అర్జునుడు యాగంలో విడిచిపెట్టబడిన అశ్వం కనక యుద్ధం చేసి గెలుపోటములు నిర్ణయించుకోవాలసిందేనని పలికేడు. బభ్రువాహనుడు తిరిగివస్తూండగా, అర్జునుని మరొక భార్య ఉలూపి అనే నాగకన్య జరిగినది తెలుసుకుని బభ్రువాహనుని దగ్గరకొచ్చి,నీ తండ్రి యుద్ధం చెయ్యమంటున్నాడు, చెయ్యాలిసిందేనని బభ్రువాహనుని రెచ్చకొట్టింది.బభ్రువాహనుడు అర్జునునితో యుద్ధం చేస్తున్నాడు, యుద్ధం భీకరంగా సాగుతుండగా బభ్రువాహనుడు వేసిన ఒక అస్త్రానికి అర్జునుడు నేలకూలి ప్రాణాలు కోల్పోయాడు. సంగతి తెలిసిన చిత్రాంగద, ఉలూపి ఇద్దరూ రణరంగానికొచ్చారు. చిత్రాంగద అర్జునుని చూసి విలపించి సవతి ఉలూపితో కొడుకుని రెచ్చగొట్టి తండ్రితో యుద్ధం చేయించి పతి ప్రాణాలు తీయించావు, నీకిది ధర్మమా అని అడుగుతూ, అర్జునుడు జీవించకపోతే నేను ప్రాయోపవేశం చేస్తానని అర్జునుని కాళ్ళ దగ్గర కూచుంది. బభ్రువాహనుడు ఖిన్నుడై తను చేసిన పనికి విచారిస్తూ తల్లి దగ్గర కూచుండిపోయాడు. సంజీవినితో మరల అర్జునుని బతికించడం నీవల్లనే అవుతుంది కనక బతికించమని ఉలూపిని చిత్రాంగద కోరింది. ఇదంతా విలాసంగా చూస్తున్న ఉలూపి ఎందుకు ఏడుస్తారు? ఇదంతా నేను కల్పించినదే అని అర్జునుని సంజీవినితో బతికించింది. అర్జునుడు లేచి కూచుని ఇద్దరు భార్యలను కొడుకును చూచి ఎందుకు అందరూ చింతాక్రాంతులై ఉన్నారు? మీరిద్దరూ యుద్ధరంగానికి ఎందుకొచ్చారు అని అడుగుతాడు. అప్పుడు ఉలూపి,

భారత యుద్ధం పూర్తైన తరవాతఒక రోజు నేను చెలికత్తెలతో గంగా స్నానం చేయబోయాను. ఒక ఘట్టం లో వసువులు గంగాదేవితో మాటాడుతుండగా చూశాను. వసువులు గంగతో అర్జునుడు అన్యాయంగా శిఖండిని ముందుంచుకుని భీష్ముని శరతల్పగతుని చేశాడు అన్నారు. దానికి గంగ కూడా ఒప్పుకొంది, వసువులు శాపం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. నేను పరుగు పరుగున వచ్చి నా తండ్రికి జరిగిన సంగతి చెప్పేను. నా తండ్రి వసువులవద్దకుపోయి అనేక విధాల ప్రార్ధించగా బభ్రువాహనుని చేత చంపబడితే ఆ పాపం నశిస్తుందని చెప్పేరు, అందుకు నేను బభ్రువాహనుని యుద్ధానికి రెచ్చగొట్టేనని చెబుతుంది.

అర్జునుడంతవాడికే చచ్చిబతక్క తప్పలేదు….

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చచ్చి బతికిన అర్జునుడు

 1. వ్యాస ప్రణీతం లో కద వేరుగా ఉన్నదీ మాష్టారూ..బభ్రువహునిది వీరత్వం అర్జునిడి శూరత్వానికి అడ్డు అని కృష్ణుడు భావించి అతడిని వొప్పించి ఆత్మ త్యాగం చేసుకొనేలా చేశారని,దానికి బభ్రువాహనుడు వొక వరాన్ని ఇచ్చే పక్షాన మాత్రమే వోప్పుకోగలనని అన్నారని.. కృష్ణుడు ఆ వరమేమితని అడగ్గా ,తాను మరణించిన తరువాత కురుక్షేత్ర సంగారమాన్ని తిలకించడం కుదరదు కనుక ,ఆ పద్దెనిమిది రోజుల యుద్హాని తన శిరము తిలకించడానికి అనువుగా వో ఎత్హైన రాతి గుట్ట పై వొక శూలానికి గుచ్చి దానిలో ప్రాణము ,ప్రతి చర్య ఉండేలా చేయాలని బభ్రువాహనుడు కోరడాని..కృష్ణుడు ఆవరాన్ని అనుగ్రహించాడని ఉన్నదీ..కానీ మేరు అశ్వమేధం వరకూ బాబ్ర్హువహనుడు జీవించి ఉన్నట్లుగా పేర్కొన్నారు..వివరించగలరు..

  • చల్లా జయదేవ్ గారూ, మీరు చెప్పిన కథలాంటిది ప్రచారంలో ఉంది. అది వ్యాస భారతంలో ఉందా అన్నది నాకు తెలియదు. కాని అక్కడి అబ్బాయి పేరు బభ్రువాహనుడు కాదు, బర్బరీకుడు అని విన్నాను.

   • జయదేవ్ గారు చెప్పిన కథ మీరన్నట్లు బర్బరీకుడి త్యాగానికి సంబంధించినదే కదా? (బభ్రువాహనుడు అర్జునుడి కొడుకు కాగా బర్బరీకుడు ఘటోత్కచుని కొడుకు. బభ్రువాహనుడు కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నట్లులేదు.)

  • jayadev.challa గారు,
   ఈ కథను కవిత్రయ భారతం నుంచి తీసుకున్నాను. మీరన్నది కూడా విన్నానుగాని ఎక్కడా చదవలేదు, వ్యాస ప్రణీతమేమో నాకు తెలియదు.
   ధన్యవాదాలు.

 2. >>>ఇల్లాలి సమయస్ఫూర్తితో మరలా బతికితే ఆనందమే కదా!

  ఆ సమయస్పూర్తి ఏమిటో వివరించుడీ !

  రాబోవు తరము మీ వారలము 🙂

  మేము ప్రవేశించుతున్న మలిసంజలోనికి మీరు ఇప్పటికే ప్రవేశించి ఉన్నవారు ఆ సమయస్ఫూర్తి గురించి కూడా చెప్పవలె !

  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s