శర్మ కాలక్షేపంకబుర్లు-పొట్టు వడియాలు/నల్లేరు వడియాలు.

పొట్టు వడియాలు

ఇడ్లీ వేసుకోడానికి,గుమ్మడి వడియాలు పెట్టుకోడానికి, గారెలు వండడానికి పొట్టు మినపపప్పు నానబోస్తారు. పప్పు నానిన తరవాత పొట్టును గాలించి తీసేసి పప్పు రుబ్బుకుంటారు, పనయిపోతుంది, ఈ పొట్టు మిగిలిపోతుంది. ఏంచెయ్యాలి? పాత రోజుల్లో ఐతే పాలుపోసేవాళ్ళకిస్తే పట్టుకుపోయి పశువుకి పెట్టేవారు. ఇప్పుడు పేకట్ పాలేగా. దీన్నేంచేయాలో తోచక డ్రైన్ లో పారబోస్తారు, తప్పక లేదా దాని ఉపయోగం తెలియకా.

ఇలా తీసేసిన మినపపొట్టు లో తుక్కు, ఇసకలేకుండా చూడండి, కాసిని నీళ్ళుపోసి గాలిస్తే అన్నీ పోతాయి. ఈ పొట్టును ఒక్కసారి అంటే ఒక్కసారే మిక్సీలో వేసి ఒక్కటంటే ఒక్క తిప్పు తిప్పెయ్యండి. రుబ్బినపిండి కొద్దిగట్టిగా ఉన్నది సరిపడినంతా కలపండి, పిండి ఎక్కువైతే వడియం గట్టిగా రాయిలా ఉంటుంది, తక్కువైతే విడిపోతుంది. పొట్టు, పిండికి తగిన ఉప్పు, చిటికెడు పసుపు చేర్చండి. తగినంత కారం కోసం పచ్చి మిర్చి మిక్సీ లో వేసి కలపండి. వీటిని వడియాలలాగా పెట్టి ఎండలో పెట్టండి. నాలుగురోజుల్లో ఎండిపోతాయి. వీటిని గాలి చొరని డబ్బాలో నిలవ చేయండి.నూనెలో వేయించండి, పప్పూ అన్నం, చారు అన్నం, పులుసు అన్నం తినేటపుడు నంజుకోండి, బలేబాగుంటాయి. మరో సంగతి తెలుసా? ఇందులో మినప పిండిలో కంటే ఎక్కువ పోషకాలున్నయి! B1,B2,B6,B12తో సహా.

కూరవడియాలు.

ఈ వడియాలు పెట్టుకోడానికి పెద్ద శ్రమలేదు. రుబ్బిన మినపపిండిలో చిటికెడు పసుపు, తగిన ఉప్పు, పచ్చిమిర్చి దంచినది చేర్చి కలిపెయ్యండి. వడియాల్లా పెట్టేయండి. నాలుగురోజుల్లో ఎండిపోతాయి. వీటిని కూరల్లో వేయించి వేసుకుంటే బాగుంటాయి. వంకాయ కూర, ఆనపకాయ కూర, గుమ్మడికాయ కూర, గుమ్మడికాయ కూరలో గుమ్మడి వడియాలు కూడా వేయించుకుని కలుకుంటే బలేగా ఉంటుంది, రుచి. ఇలా కూరలలో వేసుకుంటే బాగుంటుంది, అందుకే వీటిని కూర వడియాలన్నారు.

నల్లేరు వడియాలు.
నల్లేరు తెచ్చుకుని చిన్న ముక్కలుగా తరుక్కుని శుభ్రంగా ఉప్పువేసిన నీటిలో కడిగి ఒక్క తిప్పు మిక్సీలో వేసి తిప్పి ఉంచుకుని, దీనికి తగిన మినపపిండి కలిపి, పచ్చి మిర్చి కూడా చేర్చి, తగిన ఉప్పు, చిటికెడు పసుపు వేసుకుని కలిపిన ముద్దను చిన్న చిన్న వడియాలలాగా పెట్టుకోండి. వారంలో ఎండిపోతాయి.ఎండినవాటిని నిలవ చేసుకోండి. నూనెలో వేయించుకుంటే అన్నంలోకి బాగుంటాయి, నంజుడుగా కూడా. మరో ముఖ్యమైన సంగతి, నల్లేరు పచ్చడి కూడా బాగుంటుంది, ఒక సారి చెప్పిన గుర్తు. నల్లేరు కీళ్ళ నొప్పులకి మంచి మందు మరి.

పళ్ళు కట్టించుకున్న తరవాత వడియాలు తింటున్న సందర్భంగా 🙂

15 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-పొట్టు వడియాలు/నల్లేరు వడియాలు.

 1. కష్టే ఫలే వారు సవ్యసాచి . ఒడియాలు గురించీ రాయగలరు ఒడ్డియానం గురించీ గూడా రాయగలరు ; ఒద్దిక గురించీ కూడా రాయగలరు !

  ఇడ్లీ వేసుకోవడమా ? అంటే ఏమి టండీ ? సూపర్ మార్కెట్ లో డీప్ ఫ్రీజ్ లో కదూ ఇడ్లీలు దొరికేది 🙂

  జిలేబి

  • Zilebi గారు,
   అమ్మవారి మాటలూ చేతలూ కూడా అర్ధం కావటం లేదుస్మీ అమ్మ పొగుడుతోందో తిడుతోందో కూడా తెలీటం లేదు . అంతా అమ్మ నడిపించే విష్ణుమాయ 🙂
   ధన్యవాదాలు.

 2. వడియాలకేం, భేషుగ్గా ఉన్నాయి.
  ఈ కాలంలో అయితే చాలా మందికి (ఆడవాళ్ళతో సహా) “ఆ, తొక్క, తోలు”, “తొక్కలోది”, “తొక్కలాగుంది” అని చులకనగా అనడం ఫాషన్ అయిపోయింది (“సినేమా”ల ప్రభావమా, మజాకానా). పోన్లెండి మీరు పొట్టు దాని ఉపయోగాల గురించి చెప్పింది చదివి తెలుసుకుంటారు.

 3. మినుప వడియాల టేస్టు , గుమ్మిడివి కూడ
  వహ్వ ! యింకొక ముద్దతో జిహ్వ దిగును
  ఇండ్లలో నిప్పుడెవరికి తీరు గాక !
  బయటి ‘ హాట్చిప్సు ‘ వడియాల బతుకులిపుడు .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s