శర్మ కాలక్షేపంకబుర్లు-నమస్సులు

నమస్సులు.

నేడు బ్లాగ్ లోకంలో ఉన్న అసహన పరిస్థితుల దృష్ట్యా తెనుగు బ్లాగులనుండి నుండి తొలగిపోతున్నాను.

గమనిక:- నా బ్లాగుల్ని నాలుగు ఆగ్రిగేటర్లతో అనుసంధానింనించాను. ఆగ్రిగేటర్లు ఇప్పటివరకు ఇచ్చిన సహకారానికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.నా బ్లాగుల్ని ఆగ్రిగేటర్లతో అనుసంధానం తొలగించమని వారిని కోరుతూ మెయిల్ ఇస్తున్నాను. వారు తొలగించేదాకా నా బ్లాగుల్లో టపాలు ఆగ్రిగేటర్లలో కనపడతాయి.

RYRYRYRYRYRYRYRYRYRYRYRYRYRYRYRYRYRYRRY

వందనం.

మిత్రులు,స్నేహితులు, హితులు,సన్నిహితులు,అమ్మలు,అమ్మాయిలు, నా అభిమాన చిరంజీవులు చిన్నారులు అందరికి ఒక వినతి.

నేను బ్లాగ్ లోకం నుంచి తొలగుతున్నాను కాని నా బ్లాగులనుంచి కాదు. నా బ్లాగులలో టపాలు ఓపిక ఉన్నవరకు రాస్తూనే ఉంటాను.

Please save URL addresses

36 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-నమస్సులు

 1. జిలేబీగారూ,
  మీ మనస్సులో దురుద్దేశాలున్నాయని అనుకోమండీ. కాని మీరు సరదాకే‌ కామంటలను ఎగదోస్తున్నా సరే ఆమంటలు కొంపలంటిస్తుంటే – “నాకే దురుద్దేశాలూ‌లేవు అపార్థం చేసుకోకండీ‌” – అనటం వలన అటు ఇళ్ళంటుకున్న వాళ్ళకీ, ఇటు అబ్బే‌తమాషాకే‌ అని అమాయకంగా అనేసే మీకూ కూడా ఏం‌ లాభం చెప్పండీ. పెద్దాచిన్నాలేకుండా నోరుపారేసుకునే వాళ్ళు పండగ చేసుకొనే చోట ఉండటం దండగ అని విఙ్ఞులు మథనపడితే అది వారి తప్పు కూడా కాదు కదండీ. సరే‌ జరిగిందేదో జరిగింది. మీరూ బ్లాగు పెద్దల్లో ఒకరేనూ. పనిలో‌పనిగా మీ‌ప్రతిష్ఠకూ ఈ కామెంటాసురులు చిచ్చు పెట్తారాయిరి! మరి దిద్దుబాటు చర్యలకోసం నడుం బిగించి మీరు వేంఠనే ముందుకు దూకుతారని అందరం ఆశిస్తున్నాం. ఉంటానండీ, ఏం‌అనుకోకండేం?!

  • పూలతీగగారు,

   పెద్ద వారికి అల్పులంటే లోకువండి.
   ధన్యవాదాలు

   జిలేబిగారు!
   తమరేమందురు?
   మాలాటి అల్పజీవుల జీవితాలతో తమబోటి పెద్దలు చెలగాటమాడితే బతక గలమా?

   ధన్యవాదాలు.

 2. శర్మ గారు,
  దయచేసి నా మొదటి కామెంట్ ను, ఈ కామెంట్ ను డిలీట్ చెయ్యండి. ఏదో కంప్యూటర్ మిస్టేక్ జరిగిందని పొరబడి ఇంకో రెండు మూడు లైన్స్ add చేయబడి మరల పోస్ట్ చేయడం జరిగింది. అసౌకర్యానికి మన్నించండి.

  • nmraobandi గారు,
   కొంచం తికమక పడ్డాను, అందుకు అన్నీ ప్రచురించాను.
   ఇక ముందు లక్ష్యం మీరే కావచ్చు బహుపరాక్!

   ధన్యవాదాలు.

   • @kastephale … “ఇక ముందు లక్ష్యం మీరే కావచ్చు బహుపరాక్!” …

    శర్మ గారు…
    ముందస్తు వాతావరణ హెచ్చరికకు కృతజ్ఞతలు. రెండో తారీకున చెన్నై వెళ్ళవలసిన వాణ్ని మీ లాంటి సహృదయుల హెచ్చరిక కారణంగా త్రుటిలో చెన్నై కష్టాలు తప్పించుకున్నా. అయినా నాబోటి(లో ఓటి కూడా ఉంది) చిన్నోడి జోలికొచ్చి ఆవిడ మీ లాంటి పెద్ద పెద్దోళ్ళను చిత్రిక పట్టే టయాన్ని వేస్ట్ చేసుకునేంత చిన్న ప్రయత్నం చేయరని నా ధీమా. ఒకవేళ మీ పంచనే గాని ఆవిడ నన్ను నిలబెడితే, అంతకన్నా ఈ చిన్న రాతగాడికి గౌరవమేముంటుంది. అయినా ‘బ్లాగుబలి’తో పెట్టుకునే సాహసం నాకు కూడా తక్కువేలెండి. ఒక దణ్ణం పెట్టుకుని కట్టప్పనైపోతా…
    లోల (lol)… :————-)

   • nmraobandi గారు,
    చెప్పడం నా ధర్మం, మీ లెక్క మీకుంటుందనుకోండి. 🙂 కట్టప్ప వగైరా సినీ భాష తెలియదు.
    ధన్యవాదాలు.

 3. @ “జిలేబి ని బకరీ చేస్తున్నారా !”
  దీన్లో నాకు ‘జిలేబీని బకరా చేయగల వారున్నారా’ అన్న ఒక నిగూడార్ధమేదో దాగి ఉన్నటుల కాన్పట్టుచున్నదే.
  (నాకు తెలుసు మీరు అన్నన్నా అని హాశ్చర్య ప్రకటనొకటి విసిరేస్తారని)
  @ ” నారదా ఎక్కడున్నావ్ నువ్వు ?”
  మిమ్మల్ని మీరు పిల్చుకుని – అదెవరో వేరే వారిని పిలుస్తున్నట్లుగా …
  చిలిపి …

  జిలేబి మాతా …
  ఏతా వాతా … కనబడుతున్నదేమిటంటే …
  శర్మ గారు గానీ, శ్యామలీయం గారు పొందిన మనఃక్షోభకు మూల కారణమెక్కడున్నా దాన్నిరాజేసి కోతి పుండును కాస్తా బ్రహ్మ రాక్షసిగా మార్చడంలో మీ పాత్ర తక్కువగా ఏమీ లేదనేది నిర్వివాదాంశం. మీకు చెప్పెంతటి సాహసానికొడిగట్టినందుకు నన్ను మన్నించండి. నాకు అర్ధమైనంతలో మీరు నిస్సందేహంగా విజ్ఞులు, వివేకులు. మీ సమయానుకూల కమింటుల పటుత్వం, హాస్య పరత్వం, ప్రియత్వం – oh! lakhon mein ek – కాకపొతే కాస్తంత కలహ ప్రియులు. నిజం చెప్పాలంటే మీ చెణుకు లన్నిటినీ చక్కగా ఎప్పటికప్పుడు నేను కూడా ఆస్వాదిస్తూనే ఉంటాను. అక్కడెక్కడో హాస్య నటుడు ఆలీది కూడా అచ్చం ఇలాంటి ఎపిసోడే. ఆయన వేసే జోకులన్నీ, క్రూడ్ గా ఉన్నా, ఆ క్షణం లో నవ్విస్తాయి. మరు క్షణం ఇంత పచ్చితనమా ! అనిపిస్తాయ్. అలానే, శ్యామలీయం ఎపిసోడ్ లో కూడా మీరు హాస్యాన్నే పిండుకునే ప్రయత్నమే చేశారు తప్ప, సందర్భం అదుపు తప్పుతున్నడనే స్పృహ ప్రక్కన బెట్టి, హాస్య కదంబాన్ని కొనసాగించారు. అవాంచనీయ వ్యక్తిత్వ హననాన్ని ఓ వినోదం నిండిన సీక్వెల్ గా కొనసాగనిచ్చారు.
  నా స్పందన ఖచ్చితంగా ఓ పక్షాన చేరి, పక్షపాతంతో కొమ్ము కాసి చేస్తున్న ప్రయత్నం కాదు. జరిగిన దానిలో మీ పాత్ర కూడా తక్కువేదీ లేదన్న అభిప్రాయం శర్మ గారికే కాదు, మా అందరికీ, పోనీ మాలో కొందరికీ కూడా కలిగిందన్న అభిప్రాయ ప్రకటన మాత్రమే. గొప్పవాళ్ళు, పండితులు తప్పు చేయరన్నదేమీ లేదు. ఓ మాట ఎప్పుడన్నా, ఎక్కడన్నా మీరినప్పుడు, సహనంగా వారిపై ఓ చెణుకు విసిరితే చాలు, అదే వారికి ఓ పేద్ద నొప్పి, పదే పదే గింజుకొనేంత, అంతరంగాన్ని తడుముకునేంత.

  శర్మ గారి నిష్క్రమణం లోని మీ పాత్రపై వారి మనఃక్షోభ ను అర్ధం చేసుకోండి. “మరో మాట చెప్పండి” అన్న వ్యాఖ్య మీ హాస్య ప్రియత్వానికో మచ్చు తునకగా నేను ఆనందించ గలను, కానీ గాయ పడిన మనసును అది మరింతగా వేధిస్తుందని గ్రహించి, విజ్నులుగా పశ్చాతాప పడటం, వ్యక్తపరచడం వారికి కొంతైనా ఊరట కలిగించవచ్చును, తిరిగి వారిని వెనక్కి తేలేక పోయినా. మరొక్కసారి విన్నవించుకుంటున్నాను – దయతో అర్ధం చేసుకోండి, వ్యక్తిగతంగా మిమ్మల్ని గాని, వేరేవరినైనా గానీ బాధ పెట్టాలని వ్రాసిన రైట్ అప్ కాదిది. బ్లాగ్ లోకం లో ఉండాల్సిన వాతావరణమిది కాదని ఓ సారి మంచి మనసుతో విచారిస్తారని ఆశిస్తూ …

  regards.

  • nmraobandi గారు,
   మీ నిష్పక్షపాత వైఖరికి నమస్సులు.

   జిలేబిగారు,
   తమ మాటేమి తల్లీ!

   పలుకు!
   అంబపలుకు, జగదంబా పలుకు
   కంచి కామాక్షీ పలుకు,
   మథుర మీనాక్షీ పలుకు,
   కాశి విశాలాక్షీ పలుకు,
   బెజవాడ కనక దుర్గా పలుకు!

   పలుకు తల్లీ పలుకు,పలుకు

   ధన్యవాదాలు.

 4. @ “జిలేబి ని బకరీ చేస్తున్నారా !”
  దీన్లో నాకు ‘జిలేబీని బకరా చేయగల వారున్నారా’ అన్న ఒక నిగూడార్ధమేదో దాగి ఉన్నటుల కాన్పట్టుచున్నదే.
  (నాకు తెలుసు మీరు అన్నన్నా అని హాశ్చర్య ప్రకటనొకటి విసిరేస్తారని)
  @ ” నారదా ఎక్కడున్నావ్ నువ్వు ?”
  మిమ్మల్ని మీరు పిల్చుకుని – అదెవరో వేరే వారిని పిలుస్తున్నట్లుగా …
  చిలిపి …

  జిలేబి మాతా …
  ఏతా వాతా … కనబడుతున్నదేమిటంటే …
  శర్మ గారు గానీ, శ్యామలీయం గారు పొందిన మనఃక్షోభకు మూల కారణమెక్కడున్నా దాన్నిరాజేసి కోతి పుండును కాస్తా బ్రహ్మ రాక్షసిగా మార్చడంలో మీ పాత్ర తక్కువగా లేదనేది నిర్వివాదాంశం. మీకు చెప్పెంతటి సాహసానికొడిగట్టినందుకు నన్ను మన్నించండి. నాకు అర్ధమైనంతలో మీరు నిస్సందేహంగా విజ్ఞులు, వివేకులు. కాకపొతే సరస, కలహ ప్రియులు. నిజం చెప్పాలంటే మీ చెణుకు లన్నిటినీ చక్కగా ఎప్పటికప్పుడు నేను కూడా ఆస్వాదిస్తూనే ఉంటాను. అక్కడెక్కడో హాస్య నటుడు ఆలీది కూడా అచ్చం ఇలాంటి ఎపిసోడే. ఆయన వేసే జోకులన్నీ, క్రూడ్ గా ఉన్నా, ఆ క్షణం లో నవ్విస్తాయి. మరు క్షణం ఇంత పచ్చితనమా ! అనిపిస్తాయ్. అలానే, శ్యామలీయం ఎపిసోడ్ లో కూడా మీరు హాస్యాన్నే పిండుకునే ప్రయత్నమే చేశారు తప్ప, సందర్భం అదుపు తప్పుతున్నడనే స్పృహ ప్రక్కన బెట్టి, హాస్య కదంబాన్ని కొనసాగించారు. అవాంచనీయ వ్యక్తిత్వ హననాన్ని ఓ వినోదం నిండిన సీక్వెల్ గా కొనసాగనిచ్చారు.
  నా స్పందన ఖచ్చితంగా ఓ పక్షాన చేరి, పక్షపాతంతో కొమ్ము కాసి చేస్తున్న ప్రయత్నం కాదు. జరిగిన దానిలో మీ పాత్ర కూడా తక్కువేదీ లేదన్న అభిప్రాయం శర్మ గారికే కాదు, మా అందరికీ, పోనీ మాలో కొందరికీ కూడా కలిగిందన్న అభిప్రాయ ప్రకటన మాత్రమే. గొప్పవాళ్ళు, పండితులు తప్పు చేయరన్నదేమీ లేదు. ఓ మాట ఎప్పుడన్నా, ఎక్కడన్నా మీరినప్పుడు, సహనంగా వారిపై ఓ చెణుకు విసిరితే చాలు, అదే వారికి ఓ పేద్ద నొప్పి, పదే పదే గింజుకొనేంత, అంతరంగాన్ని తడుముకునేంత.

  శర్మ గారి నిష్క్రమణం లోని మీ పాత్రపై వారి మనఃక్షోభ ను అర్ధం చేసుకోండి. విజ్నులుగా పశ్చాతాప పడటం, వ్యక్తపరచడం కొంతైనా వారికి ఊరట కలిగించవచ్చును, తిరిగి వారిని వెనక్కి తేలేక పోయినా. మరొక్కసారి విన్నవించుకుంటున్నాను – దయతో అర్ధం చేసుకోండి, వ్యక్తిగతంగా మిమ్మల్ని గాని, వేరేవరినైనా గానీ బాధ పెట్టాలని వ్రాసిన రైట్ అప్ కాదిది. బ్లాగ్ లోకం లో ఉండాల్సిన వాతావరణమిది కాదని ఓ సారి మంచి మనసుతో విచారిస్తారని ఆశిస్తూ …

  regards.

  • శ్రీనివాస్ గారు,

   ఇట్లా అందరూ బ్లాగులు కట్టి పెట్టేసి పోతా ఉంటె జిలేబి బ్లాగు మాత్రం ఉంటుందంటా రా ! అసలు కామెంట్ల సెక్షన్లు లేకుండా జిలేబి టపాలు ఎట్లా వ్రాయగలుగును 🙂 టపాలు లేకుండా కామింటులు ఎట్లు వచ్చును 🙂

   • జిలేబిగారు,
    మీవాళ్ళు దాడి చేస్తారు, మీరు ఉసిగొల్పి మీకిష్టం లేని, మీ కాల్మొక్కుతా బాంచన్ దొరా అననివాళ్ళని బ్లాగుల్నించి తరిమేయండి. అప్పుడు మీదే రాజయం…అలక్ నిరంజన్

    కామెంట్ల సెక్షన్ ని దుర్వినియోగం చెయ్యడం మనకి వెన్నతో పెట్టిన విద్య కదా!

    ధన్యవాదాలు.

 5. నమస్తే ! శర్మ గారు తీసుకున్న నిర్ణయం ఎంతో సహేతుకమైనది అని భావిస్తున్నాను . వారు ఆగ్రిగేటర్ల నుండి వెళుతున్నారు కానీ బ్లాగులో వ్రాయడం లేదు అనలేదు కదా ! ఆయన టపాలు చదవాలనుకున్నవారు బ్లాగులోకి వచ్చి చూడొచ్చు కదా దీనికి కారణం మనందరికీ తెలిసినదే .. కామెంట్ల దాడి .. ఒక బ్లాగులో టపాలకు వేరే బ్లాగు ద్వారా తిట్లపురాణాలు అందుకుంటున్నారు . దానికి బ్లాగు ఒనర్లూ అవకాశం ఇస్తున్నారు. ఆగ్రిగేటర్లు వ్యాఖ్యల విభాగాలు మూసేస్తే మేలేమో ! పూలతీగ గారు అన్నట్లు ఏమైనా అనుకుంటే అనుకోండి గానీ దీనికి కారణం జిలేబీ గారే .. వారి బ్లాగులో కోరి మరీ కామంటేటర్లను రెచ్చగొడుతున్నారు ..
  నేను మళ్ళీ ఇక బ్లాగులోకానికి రాను .. రాబోను ..

  • > ఆగ్రిగేటర్లు వ్యాఖ్యల విభాగాలు మూసేస్తే మేలేమో
   తప్పకుండా మేలే కందడీ. ఈ గొలుసుకట్టు వ్యాఖ్యల రాధ్ధాంతాల్లో పాల్గొనే‌వాళ్ళలో అసలు టపాయేమీ, దానిలో విషయం ఏమీ, మొదట వచ్చిన విమర్శయేమీ అన్నవిషయాలు పట్టించు కుంటారా పాడా? ఊరికే సాగదీసుకుంటూ‌పోవటమే! చెప్పటానికి విషయం చాలక విఙ్ఞత వదిలి తిట్లకు లంకించుకోవటం ఒకటి. ఈ గోలంతా సద్దుమణుగుతుంది వ్యాఖ్యలవిభాగాలు మూసేస్తే.

   • పూలతీగగారు,
    సామాన్యుల మాటకి విలువలేదండీ.ఉన్న కామెంట్ల సౌకర్యాన్ని దుర్వినియోగపరుస్తున్నవారు కొందరే. ఆగ్రిగేటర్లే మూల పడుతున్నయి, సమస్య తీరిపోతోంది లెండి.
    ధన్యవాదాలు.

  • శ్రీనివాస్ క గారు,
   అది వారి సభ్యత సంస్కారమున్నూ, ఎదుటివారిని బాధించే మనస్తత్త్వాన్నేమంటారో చెప్పలేను, మేథావిని కాదుగదా! సామాన్యులకి కనిపించే ఆ రెచ్చగొట్టడం, తిట్లు వారికనిపించలేదు, విష్ణుమాయ కదా. ఉన్న ఏ సౌకర్యాన్నేనా దుర్వినియోగపరచడం మనకి అలవాటు కదండీ, మనం తెనుగువాళ్ళం. వరసగా ఆగ్రిగేటర్లు ఎందుకు మూలపడుతున్నాయంటారు?
   ధన్యవాదాలు.

  • శ్రీనివాస్ క గారు,
   అమ్మయ్య! బొడ్డుతాడు తెగిందండి. మీరు బ్లాగుల్లోకి రాను అని ధైర్యంగా చెప్పెరు, నా బాధఎవరితో చెప్పుకోను? నేనూ అందుకే ఆగ్రిగేటర్లకి రావడం ఈ రోజునుంచే మానేస్తున్నా.
   ధన్యవాదాలు.

 6. శర్మ గారికి నమస్కారం.. మీరు వ్రాయడం మానద్దు. మీరు బస్సులో ప్రయాణం చెస్తున్నారనుకోండి. రక రకాల ప్రయాణీకులు అందులో వుంటారు. కొందరు గొడవ చేస్తారు, మరికొందరు అసభ్యంగా ప్రవర్తిస్తారు. చేతనైతే వారిని మందలిద్దాం. ఒక వేళ వారు వినకపోతే మనం దారి మధ్యలో బస్సు దిగుతాముటండి? జిలేబి గారు సూచించిన బ్లాగు చూసాను. మీరు పెద్ద మనసు చెసుకొని మరొక్కసారి ఆలోచించి మీ నిర్నయాన్ని పునః పరిశీలించగలరని విజప్తి.

  నమస్కారాలతో
  నిమ్మగడ్డ చంద్ర శేఖర్
  బెంగలూరు

  • nimmagadda chandra sekhar గారు,
   నేను నా బ్లాగుల్లో రాస్తునే ఉంటాను, కాని ఆ టపాలు కామెంట్లు ఆగ్రిగేటర్లలో కనపడవు, నా బ్లాగుల్ని చూడాలంటే వేరు ఏర్పాటు చేసుకోకతప్పదు. మీ అభిమానమే తప్పక నాచేత ఇంకా రాయాలనిపిస్తోంది.
   ధన్యవాదాలు.

 7. ఎంత విసుగెత్తితే శర్మ గారు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారో? శర్మ గారి నిర్ణయంలో ఓ saving grace ఏమిటంటే టపాలు వ్రాస్తూనే ఉంటాను అని హామీ ఇస్తున్నారు, కానీ అగ్రెగేటర్లలో కనపడవు కాబట్టి మనం గుర్తుంచుకుని రోజూ వారి బ్లాగులకి వెడితే వారి తాజా టపా(లు) కనిపిస్తాయి. “పనిలేక” బ్లాగ్ రమణ గారు చేసినట్లన్నమాట. ఇదీ వారి నిర్ణయం నాకర్ధమయిన రీతి. కానివ్వండి, మొత్తానికి “బ్లాగుసన్యాసం” చెయ్యడం కన్నా నయమే కదా.

  ఏమైనప్పటికీ శర్మ గారు ఇటువంటి నిర్ణయం తీసుకునే పరిస్ధితులు కలగడం బ్లాగులోకపు దురదృష్టం.

 8. భంశు :!

  ఇదేమి కొత్త ట్విస్ట్ కష్టే ఫలే వారు !

  మీరు కూడా దేశం లో ని మేధావుల సైడు కి వెళ్లి పోయారు అంతా వెనక్కి తిప్పి ఇచ్చేస్తా నంటూ !

  మరో మాట చెప్పండి !

  జిలేబి

  • జిలేబి గారు,

   అమ్మకి అనేక నమస్కారాలతో, గౌరవం,ప్రేమ,అభిమానాలతో

   శుభం మాటని ట్విస్ట్ చేసినది అమ్మకదా! విష్ణుమాయ.

   నేను మేథావినెలా అవుతాను?

   ౧.డిగ్రీలు,పి.జిలు, డాక్టరేట్ లూ లేనివాణ్ణి
   నేను మేథావినెలా అవుతాను?
   ౨.తెనుగు తప్పించి మరో భాష రానివాణ్ణి
   నేను మేథావినెలా అవుతాను?
   ౩.ఎగతాళి, ఎక్కిరించడం చేతకాని వాణ్ణి నేను మేథావినెలా అవుతాను??
   ౪.తల్లిపాలు తాగి రొమ్ముగుద్దటం చేతకానివాణ్ణి. నేను మేథావినెలా అవుతాను??
   ౫.ఇజాల పేరు చెప్పి ముఠాలు కట్టడం చేతకాని వాణ్ణి నేను మేథావినెలా అవుతాను??
   ౬.లివ్ లెట్ లివ్ అంటే బతుకు బతకనివ్వు అంటున్నారు
   అదికాదు బతుకు బతికించు అనే తెలివి తక్కువవాడిని నేను మేథావినెలా అవుతాను??
   ౭.ప్రేమించడం తప్పించి ద్వేషించడం చేతకాని వాణ్ణి. నేను మేథావినెలా అవుతాను??

   నేను మేథావుల సరసన చేరను. అసహనానికి బలైపోతున్న నాలాటివారి తరఫున నిరసన గొంతెత్తినవాడిని, బ్లాగులనుంచి తొలగిపోతున్నా.

   >>>మరో మాట చెప్పండి
   ఈ మాట ఎక్కడవాడతామో అమ్మకి బాగా తెలిసుండాలే. బతకించడమే నా అభిమతం మరోమాట లేదు. ఇమెయిల్స్ ఇచ్చాను, ఇంక ఆగ్రిగేటర్లు తొలగించడమే ఆలస్యం.
   నాది ధర్మాగ్రహం.
   ధన్యవాదాలు.

   • పూలతీగగారు,
    నాకెందుకులే అని తప్పించుకుపోతున్నరోజులలో ధర్మాగ్రహాన్ని అందుకున్న మీకే పుష్పాభిషేకం చెయ్యాలి. అందుకోండి అభినందనలు.

    ధన్యవాదాలు.

 9. గురువు గారు ఎవరైనా బాధించారా . . మీరు ఓపిక వున్నంత వరకూ వ్రాస్తూనే వుండాలని మనవి

  నమస్కారం

  • అదేమిటండీ అలా అడుగుతున్నారూ! జిలేబీగారి వరూధిని బ్లాగు చదవరా మీరు? ‘ఇచ్చట కామింటుటకు టపాలు అద్దె కివ్వ బడును !’ అని వేరే కొన్ని చోట్లల్లో దేవిడీ‌మన్నా ఐపోయిన బ్లాగర్ల కామెంట్లకోసం ఒక చిల్లరకొట్టులాంటి టపా ఉన్నది కదా. అందులో ఉంది ఈ‌ బాధించే‌ మాటా – బాధ్యత లేని పొగరు మాటానూ. చూడకపోతే చూడండి బుధవారం‌నాటి నీహారికమ్మగారి కామెంటు తొక్కలో కాలక్షేపం కబుర్లు: అని హెడ్డింగు పెట్టి మరీ! ఇలా పెద్దాచిన్నా తేడాలేని, మర్యాద ఇవ్వటం రాని వాళ్ళతో మాటలు పడటం అవసరమా శర్మగారికి? ఏం‌ బ్లాగులోకమోనర్రా. ఇలా తయారైందీ!

   ఈ‌ తిలాపాపంలో జిలేబమ్మగారికీ మంచివాటాయే ఉందండీ నిర్మొగమాటంగా చెప్పాలంటేనూ. జిలేబీ‌గారు ఆ ఫ్రీ-ఫర్-ఆల్ టపాను పీకేసి దారిమూసెయ్యకపోతే ఇబ్బందే మర్యాదస్తులకి! అపైన ఆవిడిష్టం‌ కదా మరి.

   • వామ్మో వామ్మో

    ఉరుము ఉరిమి మంగళం పాడిందని బ్లాగ్వెత ! ఇందులో జిలేబి ని బకరీ చేస్తున్నారా !

    నారదా ఎక్కడున్నావ్ నువ్వు ? ఉన్నావా ! అసలున్నావా ! ఉంటె కళ్ళు మూసుకున్నావా ! ఈ ‘టీగ’ ఎవరో కూసింత చూడ కున్నావా 🙂

    జిలేబి

   • పూల తీగ గారు,

    అందరికి కనిపించిందిగాని అమ్మవారికి అనిపించలేదు కదా!సామాన్యుడికి కనిపించినది పెద్దవారికి అనిపించదు కదా! ఆ బ్లాగులో ఆ టపా అలాగే ఉండనివ్వండి, అమ్మవారి అనుచరుల దాడి, ఆపై అమ్మవారి ఉసొగొలపడం ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటాయి. ఈ టపా వారి అనుచరుల,వారి సభ్యతకి ఒక మచ్చు,మెచ్చుతునక కదా! ఈ టపా తీసేస్తే వారి అనుచరుల వారి సభ్యత సంస్కారాలు ప్రత్యక్షంగా ఎలా తెలుస్తాయి. అందుచేత ఆ టపాని అలాగే ఉండనివ్వండి.
    అందుకే బ్లాగులనుండి తొలగిపోతున్నాను. ఆగ్రిగేటర్లకి ఉత్తరాలు రాశాను. వారు తొలగించడమే ఆలస్యం. తెనుగు బ్లాగులిలాగే ఉంటాయి. తదుపరి బహుశః మీరే కావచ్చు, బహుపరాక్.
    ధన్యవాదాలు.

   • జిలేబిగారు,
    ఊరుము ఉరిమి మంగలం మీద పడలేదు, ఉన్నమాటేకదా అది, మరి ఉలుకెందుకు. ముంజేతి కంకణానికి అద్దం కావాలా? మీదగ్గర, మీ అనుచరులే నారదులు, ఎక్కడున్నావని వెతకక్కరలేదు. తరిమెయ్యండి, అందరైని తరిమెయ్యండి. మీకిష్టమైనవాళ్ళనే బ్లాగుల్లో ఉండనివ్వండి.
    ఈ పూలతీగెవరో పాపం ఉన్నమాటని ధర్మాగ్రహం వెలిబుచ్చితే….కానివ్వండి…..

    ధన్యవాదాలు.

   • కష్టే ఫలే వారు,

    చాలా చాలా అపార్థం లో ఉన్నారు .

    అపార్థం లో ఉన్నప్పుడు నేను కాదు అన్నా కదూ అన్నట్టే ఉంటుంది . కాబట్టి కాలమే దీనికి సమాధానం.

    జిలేబి

   • Zilebi గారు,
    అమ్మ మీద గౌరవం, అభిమానం,ప్రేమ తో
    అపార్ధం అన్నారు, మరి అసలర్ధం ఏమో?

    అడిగానని అనుకోవద్దు,
    చెప్పకుండ దాటేయద్దు,
    ఏమిటీ విచిత్రం,
    తల్లీ!
    ఏమిటీ రహస్యం?

    కాలం మీద తోసేస్తే ఎలా?

    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s