విజ్ఞప్తి-ఈ బ్లాగు మూసివేయబడినది..

విజ్ఞప్తి-ఈ బ్లాగు మూసివేయబడినది..

బ్లాగుల్లోఅసహనం పరాకాష్టకి చేరిపోయింది, ఎంతగా అంటే, ఇష్టం లేనివాళ్ళు ఇంకా చావలేదా అన్నంతగా 🙂 . నా బ్లాగులను ఆగ్రిగేటర్ల నుంచి తొలగించమని విన్నపం మాలిక,కూడలి మరి కొంతమందికి పంపుకున్నాను.కూడలి వారు తొలగించేరో లేదో కాని కొత్త టపాలు కనపడటం లేదు. కొందరు మీ బ్లాగుల్ని మాలికనుంచి తొలగించడానికి అడ్డుపదతామన్నారు,మాలికవారికి ఇబ్బందేమో తెలియదు, వారు టపాలు ఇంకా ప్రచురిస్తూనే ఉన్నారు. అందులకుగాను నేనొక నిర్ణయం తీసుకున్నాను.

ఇక  ముందు నా రెండు బ్లాగులలో టపాలు ప్రచురింపబడవు.విసిగిపోయాను,

చదువుకున్నవారిలో,మేదావులలో ఇంత అసహనం గూడు కట్టుకుని ఉండటం, ఘనీభవించడం చూసి ….ఇంతటి అసహనపరుల మధ్య ఉండలేను.. మన్నించండి. 

 

ఇక ముందు నా టపాలు చూడాలనుకునేవారు 01.01.2016 తేదీనుండి ఈ కిందిబ్లాగులో చూడగలరు. .

https://sarmabc.blogspot.com

ఈ బ్లాగు ఆగ్రిగేటర్లలో చేర్చబడలేదు

21 thoughts on “విజ్ఞప్తి-ఈ బ్లాగు మూసివేయబడినది..

 1. అభిమానులు, మిత్రులు, బంధువులు,
  స్పందించిన అందరికి ముందుగా ధన్యవాదాలు, మన్మథ నామ సంవత్సర మకర సంక్రమణ శుభకామనలు.

  జరినది చరిత్ర, చర్వితచర్వణం వృధా ప్రయాస 🙂

  ఈ బ్లాగు మూసేసినమాట నిజమే! కొత్త బ్లాగు తెరచినదీ ఋజువే! నిరాశలో పడిపోవడం సహజం 🙂 కాని అందులో కూరుకుపోవడం కాదు.

  మానూ మాకును కాను
  రాయీ రప్పను కానే కాను
  మామూలు మణిసిని నేను

  అందుకే టపా సోమవారం నాడు ”అలా మొదలయింది మళ్ళీ”తో పునః ప్రారంభం.
  ధన్యవాదాలు

  • జరిగినది చరిత్ర, చర్వితచర్వణం వృధా ప్రయాస 🙂

   హమ్మయ్య 🙂

   సంక్రాంతి శుభాకాంక్షల తో

   రాబోవు భాస్కరుల వారి టపా రగడ ల కై వేచి చూస్తో 🙂

   చీర్స్
   జిలేబి

 2. ప్రతి కుక్క మొరుగు ను పట్టి ఆలోచిస్తూ ఆగిపోతే ఎలా…వీధి లో కుక్క ల బెడద ఎక్కువే ,,,కర్ర చేతిలో ఉంచి మీ కష్టా న్ని కొనసాగించండి

 3. >ఈ పూల టీగ ఎవరబ్బా ? మరీ తెలిసిన వారిలా ఉన్నారే!

  “నే నెవరో తెలిసిన వారూ ఈ ధరలో లేనే లేరూ” మొర్రో అంటూంటే మీరు భలే మరీ తెలిసిన వారిలాగా ఉన్నానంటారా. బాగుందండోయ్ బాగుంది. అవున్లెండి. పూలతీగలను చూడనివారుంటారా నిజంగా. కాకపోతే సవాలక్ష పూలతీగల్లో నేనెవర్నో మరి. ఐనా ఈ కాలం వాళ్ళు గోలలవెంట బడి ఓహోహో-ఓహో అంటూ తిరుగుతున్నారే కాని పూవులముఖాలు చూసే తీరికేదబ్బా వీళ్ళకి. ఇంక పూలతీగల ముఖాలేం తెలుస్తాయీ వీళ్ళ ముఖాలకి. ఏదో మీ బోటివాళ్ళు చూసినట్లే ఉందీ, తెలిసినట్లే ఉందీ అంటే కాబోలనుకోవటమే. సంతోషపడి పాటలు పాడుకోవటమే. ఐనా చూస్తున్నారుగా ఈ పూలతీగ పాటలెవ్వరూ ఆట్టే వింటున్నట్లు లేదే. ఏంచేసేదబ్బా!

  ఇకపోతే కష్టేఫలీ వారి సంగతంటారా. వారిని వారూ వీరూ అని లేకుండా, చివరాఖరుకు మీలాంటి వారు కూడా కష్టపెట్టేయచ్చును మాటలతో. కాని వారు మాత్రం మనసు కష్టపెట్టుకోరాదూ – పట్టించుకోరాదూ అంటారు. అవున్లెండి. వారున్నూ కష్టాలు పడలేకా, ఇంకా మనసు కష్టపెట్టుకోలేకా, మీరంతా వద్దన్నా కష్టపడి మిమ్మల్ని కష్టపెట్టలేకా తప్పుకున్నట్లున్నారు. అలాగైనా వారిని కాస్త సుఖంగ ఉండనివ్వండి పాపం.

   • ఏమి తెలిసెనబ్బా! లీలగానొకింత అన్నారు కదా. లీలో, సుశీలో చక్కగా విని ఊరుకోకూడదూ. బాగుంది బాగుంది. శంకలెందుకు మనకి? హాయిగా పాటలు పాడుకుంటూ తిరగటమే. మనోజ్ఞం అని చెప్పేసి ఇంచక్కా వినే వాళ్ళు వింటారు – అలా కానిద్దామర్రా.

 4. ఒకచో నవోన్మేష ముదయించు ధిషణకు
  అక్షర రూప హృద్యంగమమ్ము
  ఒకచోట దర్శించి వికలమై హృదయమ్ము
  స్పందించి వ్రాసిన బ్రతుకు బొమ్మ
  ఒకచో మనోల్లాస చకిత జీవన చిత్ర
  రమణీయ భావనా రస విశేష
  మొక్కచో బ్లాగర్ల కొక్కింత మార్గ ద
  ర్శనము శాయంగల ప్రతిభ లున్న

  అనుభవ జ్ఞాని , జగమెరిగిన బుధుండు ,
  నియతి ‘కష్టే ఫలే’ బ్లాగు నిర్వహించు
  హితుడు ‘భాస్కర శర్మ’ మాకిష్టు -డరయ
  బ్లాగు లోకాన వెలసిన భాస్కరుండు

  వట్టి కబురులు గావు – చేవ గల జీవి
  తానుభవ సత్యములు – నేటి మానవులకు
  మార్గ దర్శకము-లప్రతిమాన ప్రతిభ
  రూపు దాల్చిన శర్మగారూ ! నమస్సు .

 5. శర్మగారికి !

  అంతర్జాలం లో తెలుగులో ఉన్న బ్లాగుల్లో ,
  ఒక ఉత్తమమైన బ్లాగు మీది !
  చక్కటి తెలుగులో , మీ అనుభవాలూ , మీ అభిప్రాయాలూ ,
  మీదైన శైలి లో తెలియ చేస్తూ ,
  విజ్ఞానాన్ని విస్తరింప చేస్తున్నారు మీరు !
  కు విమర్శలు చేశే వారిని పట్టించుకుని ,
  మీరు నిర్ణయాలు తీసుకోకండి !
  ఎవరి అభిప్రాయాలు వారివి !
  మీ మనసుకు తోచింది, మీ టపాలో రాసుకోవడం ,
  మీ ప్రాధమిక హక్కు !
  ఇష్టం లేని వారు, అవి చూడక పొతే సరిపోతుంది !

  కొంత విరామం ఇచ్చినా , తిరిగి మీ ” బ్లాగు యజ్ఞాన్ని ” పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నా !
  అభినందనలతో,

  Dr . సుధాకర్.

 6. ఏం జరిగింది .. మీ పోస్ట్ లలో అసహనం ఏముంది .
  అర్ధం కాలేదు , దయచేసి చెప్పగలరా ? బ్లాగుల్లో కొంతమంది విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు , కాని వాళ్ళకి మీతో గొడవ ఏంటి .
  మీ పోస్ట్ లకి , వాళ్ళ రాతలకి ఏం సంబంధం లేదే , మరి గొడవ ఏంటి .

 7. చివరికి “బ్లాగుసన్యాసం” చేశారన్నమాట. ప్రస్తుత పరిస్ధితుల దృష్ట్యా మీరే రైటేమో? అయితే వెంటాడి వేధించిన వాళ్ళకి “చూశారా నేనంటే హడల్. బ్లాగ్ మూసుకుని వెళ్ళిపోయాడు” అని జబ్బలు చరుచుకుంటూ సింహనాదం (బ్లాగునాదం) చేసే అవకాశం ఇచ్చినట్లయింది. దురదృష్టకరం, కానీ ఒక దశ దాటిన తర్వాత అటువంటి “తొక్కలో” చికాకుల్ని పట్టించుకోవడం మన టైం వృధా తప్పించి మరేమీ ఉండదు అనిపించడం సహజమేలెండి. మొన్ననే బ్లాగుసన్యాసం చేసిన బ్లాగిల్లు శ్రీనివాస్ కూడా అంతేగా.
  ప్రస్తుతానికి వీడ్కోలు. కొత్త సంవత్సరం కోసం ఎదురు చూద్దాం.

 8. శర్మ గారు,

  మనస్తాపం కలిగించే విషయం.

  బ్లాగు లోకం లో ఎవరో ఒకరో ఇద్దరి కో వెరచి మీరు వెళ్లి పోతాననడం సరి ఐన విషయం కాదని పిస్తుంది .

  ఈ బ్లాగు ని చదివే వారు చాలా మంది ఉన్నారు;

  మీకు కథాతధిత మనస్తాపం కలిగించే వారి వెర్రి వెంగళాయి రాతలు చదివే వాళ్ళు తక్కువే .

  ఓ పరిధి దాటాక వారి కామెంట్ల ని సేరియస్ గా తీసుకునే వారి సంఖ్య కూడా తక్కువే అయిపోతుంది.

  అట్లాంటి వాటి మీద మీ మనసుని ఎందుకు పాడు చేసుకుంటున్నారు ?

  వయస్సు లో పెద్దవారు మీకు నేను సలహా ఇవ్వరాదు ; ఎవరో ఏదో వాగుతున్నారని మనల్ని మనం శిక్షించు కోవడం సుతరామూ సరి అయిన విషయం కాదు;

  కాబట్టి మీరు దయచేసి మీ బ్లాగు టపాలని కొనసాగించడం మానకండి . మాలిక లో ఉండండి.

  కూడలి కూడా మూత పడి పోయినట్టుంది.

  (బ్లాగిల్లు శ్రీనివాస్ గారు కూడా జెండా పై కపి రాజు పాడేసారు .)

  ఇక మిగిలింది మాలిక మాత్రమె. ఎంత కష్టమైనా నెగ్గు కుంటూ వస్తోంది. ఔత్సాహిక తెలుగు బ్లాగర్ల వల్ల; అట్లాంటిది మీ లాంటి మంచి టపాలు వ్రాసే వారు కూడా మాలిక నించి తొలగి పోతాననుకోవడం సబబు కాదు; కానేరదు ;

  కష్టే ఫలే టపాలు చదివే వారు ఎప్పటి కీ ఉంటూ నే ఉంటారు; ( అగ్రిగేటర్ లో ఉన్నా లేకున్నా ); కాని అగ్రిగేటర్ లు బ్లాగర్లు లేకుంటే ఉండలేవు. అదిన్నూ మంచి టపాలు వ్రాసే బ్లాగర్లు ;

  ఇప్పటికి కామింటు టపా ని మించి పోయింది కాబట్టి 🙂

  శుభోదయం
  జిలేబి

  • జిలేబీగారూ,

   బాగుంది మీ వ్యాఖ్య. ఈ ముక్కలో మీ బ్రాండ్ వ్యంగ్యం కాని నా బ్రాండ్ చురకగానీ లేదు. నిజంగానే బాగుంది.

   ఇప్పుడొక విషయం చెప్పండి. అమర్యాదకు చిరునామాలుగా ఉన్నవాళ్ళ దుర్వాఖ్యలని ప్రోత్సహించటమే కాకుండా, మీ రనుకున్నంత అగ్గిరేగలేదని అనిపిస్తే ఆలాంటి వాళ్ళ చెడ్డమాటాల్ని టపాలుకట్టి మరీ వాళ్ళచేత మరింతగా ప్రేలాపనలు చేయించేటప్పుడు మీ ఆలోచనా విధానం ఏమిటి? ఇటువంటి పనులవలన మంచి ఫలితాలు వస్తాయని ఆశించారా? శర్మగారివంటి సజ్జనుల నిష్క్రమణం కూడా మీరు అశించే అలాంటి మంచిఫలితాల్లో ఒకటా?

   గిల్లి జోలపాడినట్లుగా ఇప్పుడు ఇలాంటి స్వాంతనవచనాలకు దిగటంలో మీ ఆంతర్యం ఏమిటి? తిట్లూశాపనార్థాలూ పడటానికికాను సజ్జనులు రంగంలో ఉండాలీ అప్పుడే కదా మావాళ్ళు నాలుగు మాట లనటానికి వీలూ అని ఆలోచిస్తున్నారా?

   • పూల టీగ వారు 🙂

    ప్రతి తెలుగు బ్లాగ రందున ప్రతిభ గలదు

    తాము వ్రాయుటేగాదు వ్రాతలను జూచి

    యొకట స్పందించు భావుకత గలదు

    రచయితల కుండ దగ్గ వీ లక్షణములె

    కొట్టు కొచ్చిన సమాధానం 🙂

    వారు వీరలని జిలేబి కి తర తమ బేధాలు లేవు 🙂 పెద్ద వారైన పిన్న వారైనా వారి మాటల్లో పచ్చి నిజాలు అప్పుడప్పుడు వారికి తెలియకుండా వస్తూంటుంది ! గమనిస్తే వ్రాస్తుంటాను వాటి గురించి 🙂

    ఎక్కడ నీ హరి అని తండ్రి అడగ కుంటే ప్రహ్లాదుడు ఎక్కడ ఉండే వాడు ?

    హరి రాక మునుపు హరీ మనిపించే వారు వస్తూనే ఉంటారు 🙂

    కాల మహిమ లో ప్రతి కాలం లో నూ జరిగేదే !

    సత్తా ఉన్న కష్టే ఫలే లాంటి బ్లాగర్లు వీటికి మనసు ‘పర’ బోసుకోవడం ఎంత వరకూ సబబు కాదు ; కాబట్టి వారు దీని గురించి పట్టించు కోరాదు అని నా అభిప్రాయం.

    ఈ పూల టీగ ఎవరబ్బా ? మరీ తెలిసిన వారిలా ఉన్నారే 🙂

    జేకే !

    చీర్స్
    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s