శర్మ కాలక్షేపంకబుర్లు-అలా మొదలయింది మళ్ళీ

అలా మొదలయింది మళ్ళీ

మా ఇంట, సంకురుమయ్య ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్ వస్తువులమీద నడచాడు, చివరిగా పెద్దది డెస్క్ టాప్ ని, ఒకటో తారీకు తరవాత పరశురామ ప్రీతి చేస్తూ 🙂 …. “కాలినచోట ఇల్లవుతుందని” నానుడి, పది రోజులు కిందామీదా పడ్డ తరవాత ఇక లాభం లేదని కొత్త డెస్క్ టాప్ కొనేశాడబ్బాయి. ఈ లోగా రెండు రోజులు ఇబ్బంది పడ్డాగాని అలవాటు పడుతూవచ్చాను, నెట్ లేకుండా ఉండడానికి. ఇంటి పనులు చేస్తున్నాను, కంగారు పడిపోకండి, గొట్టం తో నీళ్ళు పట్టడం వగైరా… 🙂 రోజూ నడుస్తున్నా, సాయంత్రం వేళ.  నెట్ గొడవ, బ్లాగు గోల 🙂 వదిలింది గదా అని సంతోషిస్తూ ఉన్న సమయం!. రోజులన్నీ ఒకలా వెళిపోతే సమస్యలేవీ?

ఓ రోజు సాయంత్రం నడుస్తున్నా! సెల్ మోగింది ఎవరో కనపడలేదు, మాటాడేను, “తాతయ్యా! ఎలా ఉన్నారూ?” అని పలకరించిందో అమ్మాయి. ఎప్పుడో విన్నగొంతే “ఎవరూ” అనేశా పైకే! “నేనూ” అని సాగదీసింది, మరచావా అన్నది ధ్వనిస్తూ,కొంచం నిష్టురం కలిపిన గొంతుతో . “ఆ( చెప్పరా తల్లీ! ఎలావున్నావు? ఎక్కడున్నావు?” ఇలా ప్రశ్నల వర్షం కురిపించేశా, ఎవరో గుర్తుపట్టి. “హాచ్!” తుమ్మింది, నవ్వుతూ, నీ ప్రశ్నల వర్షంలో తడిసి జలుబు చేసిందన్నట్టుగా 🙂 . ఓపిగ్గా అన్నిటికి సమాధానం చెప్పి చివరగా “నేను వస్తున్నానూ, నిన్ను చూడ్డానికీ” అని ముక్తాయించింది, ఇది అలవాటుగా వినేమాట, విన్నమాట, మిత్రులు ఇలా అంటూ ఉంటారు కనక, సరే అనేశాను. మర్నాడు మళ్ళీ ఫోన్ చేసింది, ఫలానా రోజొస్తున్నానూ, ఇంక, ఇంక నమ్మక తప్పలేదు, ఇక్కడినుంచి మొదలయింది, ఎదురు చూపు, ఈ లోపు నా సెల్లు చెడిపోయింది, రింగు రాదు. అదో ప్రహసనం, చివరికి ఏ బండిలో వస్తున్నదీ చెప్పింది. వస్తోందన్న సంబరమే, బానే ఉందిగాని ”గుర్తుపట్టడమెలా?” అడిగింది. “ఓస్! అంతేనా బండి దిగేకా కళ్ళు మూసుకో! తాతా!! అను నేను నీముందుంటా, సరేనా” 🙂 అనేశా. ఐదుగంటల ప్రయాణం తరవాత బండొచ్చింది, ఎవరెవరో దిగేరు, ఎవరో వస్తున్నారు,ఎదురుగా! మనసు చెప్పింది “వారే నీవు ఎదురు చూస్తున్నవారూ” అని, చెయ్యూపేను, “తాతా!” అంటూ వచ్చేసింది, అలా సంక్రాంతి పండగ మా ఇంటికి ముందే వచ్చేసింది. ఇంటికొచ్చేకా, ఇల్లాలికి కోడలికి పరిచయం చేశాను, అంతే. “పదిరోజులుండిపోతానేం, అమ్మమ్మా!” బెల్లించింది అమ్మమ్మతో, “తాతా! నావాటా మామిడి కాయలు,పళ్ళూ” అని పేచీపెట్టింది. ఐదుగంటలు చలిలో ప్రయాణంచేసి, ముసలాళ్ళని ఛూడ్డానికొచ్చింది, ఏంటీ సంబంధం, ఎప్పటిదీ అనుబంధం? ఏమో తెలియదు, సూదంటురాయి ఇనుప ముక్కల్లా కలిసిపోయారందరూ. “అమ్మమ్మా” అంటూ అల్లుకుపోయింది, “అక్కా” అంటూ హత్తుకుపోయింది, ఎంతకాలంగానో తెలిసినదానిలా 🙂 తాతతో కొత్తేముందీ! కొత్త అనే అనిపించలా ఎవరికీ, తనకీ అలా అనిపించినట్టూ లేదు. అదిగో అలామొదలయింది! తనేం చెప్పిందో, మేమేం విన్నామో, తనేం చేసిందో! మాయో!!, మంత్రమో!!! అదో ఆనంద రసమయ హేల. తను ఆనందం మాటలలో కలగలిపి తినిపించింది, మత్తెక్కిపోయిందిమాకు , మమ్మల్ని మేము మరచిపోయాం. అప్పుడు గుర్తొచ్చింది మధురాష్టకం.

అధరం మధురం వదనం మధురం,
నయనం మధురం, హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

పెదవులు తీయన,ముఖచంద్రబింబం తీయన,కనులు తీయన,నవ్వు తీయన, హృదయం తీయన, నడకతీయన, హే!కృష్ణా, మధురాధిపా అంతా తీయన.

ఇదీ మనవరాలు, ఇంతకు మించి చెబితే దిష్టి తగులుతుంది, డబ్బా కొట్టుకుంటున్నాననుకోగలరు కూడా!. “కాకిపిల్ల కాకికి ముద్దులెండి” అనకండి! ఏమవుతున్నదీ తెలియకనే మూడు గంటలు గడిచాయి. తను అమ్మమ్మకీ,తాతకీ తెచ్చిన కానుకలిచ్చింది, అమ్మమ్మ పెట్టిన పసుపుకుంకుమలూ పుచ్చుకుంది.ఉంటానూ! ఉంటానూ!! ఉంటానూ!!! అంటూనే ఉంది, అమ్మమ్మకి అల్లుకుపోతూనూ ఉంది, మాదీ అంతకు తేడా ఉన్న సంగతి కాదు. ”తాతా! ఒకమాటా” అంది, చెప్పమన్నట్టు చూశా! “అమ్మమ్మ తరగని ధనం, పసుపుకుంకుమలూ ఇచ్చింది, నువ్వేమో ఆశీర్వచనాలూ ఇచ్చావు, అక్క మనసే ఇచ్చేసింది. నాకు, మీ బ్లాగ్ అభిమానులు,బంధువులు, మిత్రులు అందరికి బ్లాగు మూసేయడం నచ్చలేదు, మూసేసినందుకు బాధపడుతున్నాం, అది మళ్ళీ తెరవండి, ఇది నేను అందరి తరఫున చెబుతున్నమాట సుమా!” అని నెమ్మదిగా చెప్పేసింది. ఏం అనాలో తోచలేదు, ఆలోచనలో పడ్డాను.

ఈలోగా అమ్మమ్మని విడిపించుకుని చెయ్యూపుతూ బండెక్కేసింది, ”మళ్ళీ వస్తానూ” అంటూ.

అది మొదలు అంతా వెలితే, ఇక్కడే దాక్కుందేమో అన్నట్టు వెతుక్కుంటూనే ఉన్నాం. నెమ్మదిగా మా మనసులు మా దగ్గరలేవని తెలిసింది, దొంగెత్తుకుపోతే ఎక్కడుంటాయి? ఇంతకీ ఆ గుండెల గజదొంగ ఎవరనే కదా మీ అనుమానం, ఆ మనవరాలు చిరంజీవి ప్రియ, మీ అందరికి తెలిసిన అల్లరిపిల్ల.
చిరంజీవి ప్రియకు ఆశీర్వచనం
దీర్ఘాయుష్మాన్భవ
దీర్ఘ సుమంగళీభవ.
శీఘ్రమే సంతాన ప్రాప్తిరస్తు
మీరూ ఆశీర్వదించండి

__/\__

అదుగో! అలామొదలయింది మళ్ళీ!!

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అలా మొదలయింది మళ్ళీ

 1. sarma garu,
  namaskaram. mee blog chadvakapote aa roju edola vundei. hammayya malii ru.mee blog chaduvutunna chala santosam ga vundi. emadhya aa koodali close chesauru. emeto telugu blog la koodali kana padaka 20 rojulvedukulataga okate vetukulata. evvala malika
  lo dorikindi.
  chala santosam.
  namaskaralato,
  a.v. ramana.

  • శర్మ గారు,
   నమస్కారం. మీ బ్లొగ్ చదవకపొతె ఆ రొజు ఎదోల వుండెది. హమ్మయ్య మళ్ళీ వచ్చారు.మీ బ్లొగ్ చదువుతున్నా చాల సంతోషం గ ఉంది. ఈమధ్య ఆ కూడలి క్లోస్ చేసారు. ఎమిటొ తెలుగు బ్లొగ్ ల కూడలి కన పడక ౨౦ రొజులు వెదుకులాటగ ఒకటె వెతుకులాట. ఈ వేళ మాలిక
   లొ దొరికింది.
   చాల సంతోషం.
   నమస్కారాలతొ,
   .a.v. ramana.

   రమణాజీ
   ధన్యవాదాలు

 2. < "“ఎవరూ” అనేశా పైకే! “నేనూ” అని సాగదీసింది, ….."

  :)) చాలా కాలం క్రితం జరిగిన ఓ తమాషా సంఘటన గుర్తొచ్చింది. ఓ రోజు నేనూ నా స్నేహితుడూ ఓ చోట మాట్లాడుకుంటున్నాం. ఇంతలో ఒకతను వచ్చి నా స్నేహితుడిని పలకరించాడు. మా వాడికి అతనెవరో గుర్తు రావటం లేదు. అందుకని హలోలు,కులాసాలు అయిన తర్వాత అతని గురించి ఇంకా వివరాలు రాబట్టడానికి
  మా వాడు తెలివిగా (అనుకున్నట్లున్నాడు) "ఊ, ఇప్పుడెక్కడ?" అని అడిగాడు. అతను (ఇంకా తెలివిగా !!) "అక్కడే" అన్నాడు 🙂 ఇంక మా వాడికేం గుర్తొస్తుంది 🙂 అతను వెళ్ళిన తర్వాత నేనయితే మా వాడిని ఓదార్చాను 🙂

  ఆ ప్రియ అనే అమ్మాయికి మీపట్ల ఉన్న అభిమానానికి మెచ్చుకోవాలి.

  నో "బెక బెక", మీకు పునఃస్వాగతం.

  • విన్నకోట నరసింహారావు గారు,
   నేను చాలా కాలంగానే అడిగేస్తున్నానండి, మీ మిత్రునిలాకాక 🙂 అబ్బాయి/అమ్మాయి నిన్ను ఎరుగుదును గుర్తురావటం లేదు, నాకు ముఖాలు, పేర్లు గుర్తుండని వ్యాధి ఉంది, కొద్దిగా పరిచయం చెప్పు, పేజ్ ఓపెనవుతుంది, ఆ తరవాత నీ జాతకం మొత్తం చదివేస్తానని సరదాగానే చెప్పేస్తా! 🙂 పైన చెప్పిన సందర్భం లో నడుస్తున్నా కదా కళ్ళ జోడు లేదు, ఎవరో చూదామంటే వెలుగులో సెల్ లో పేరు కనపడలేదు, అదన మాట సంగతి.

   చిన్నతల్లి ప్రియ మనసు పాట్లా బంగారం, ఎంత చెప్పినా తక్కువే, అందుకే అధరం మధురం అన్న పోలిక చెప్పేసేను, ఇంకా చెప్పేస్తే చిన్న తల్లికి దిష్టి తగలదూ 🙂 అంత అభిమానం కనకనే చలిలో పడి ప్రయాణం చేసి వచ్చింది.
   ధన్యవాదాలు

  • వెంకట రాజారావు . లక్కాకుల గారు,
   మీరన్నది సత్యం, ఈ అనుబంధాలూ పెరుగుతున్నాయి, బంధుత్వాలూ పెరిగిపోయాయి, ఈ కుటుంబమూ పెరిగిందండి. బహుజన హితమే సమ్మతము. మీ బంధువును అని మీరన్నమాట నాకమితానందం కలిగించింది, మీ అభిమానానికి
   ధన్యవాదాలు

  • చి. ప్రియ
   మాట మూగబోయిందమ్మా! అంతకు మించి చెప్పలేకపోయా!! ఏమనుకోకూ!!! నీ మనసు బంగారం తల్లీ
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s