శర్మ కాలక్షేపంకబుర్లు-మఖలో పుట్టి…..

మఖలో పుట్టి…..

మఖలో పుట్టి పుబ్బలో మాడిపోవడం అంటారు, అంటే మధ్యలో వచ్చి మధ్యలో పోవడంగా చెబుతారు. మఖకి మధ్యలో పోవడానికి అసలు సంబంధం ఏంటీ? అసలు అది మఖ కాదు మఘ అనాలి కాని అందరం మఖ అనే అనేస్తున్నాం. ఇలా మాటల్ని మార్చేయడం మనతరవాతే… 🙂 మఖలో పుట్టడమేంటో చూద్దాం…

కాలాన్ని సూర్యుడు, చంద్రుడు, గురుడు, నక్షత్రాలను బట్టి గణిస్తారు. ఇలా సూర్యుని బట్టి గణించే సంవత్సరం సూర్యుడు మేష రాశిలో ప్రవేసించిన రోజుతో లెక్కిస్తారు, ఇది ఒకటి రెండు రోజుల తేడాతో ఏప్రియల్ పదునాలుక్కి వస్తూ ఉంటుంది. తమిళులు సూర్యుని బట్టి సంవత్సరాది జరుపుకుంటారు. అలాగే సూరుడు మేషరాశిలో అశ్వనీ నక్షత్రం లో ప్రవేసించినది మొదలుగా సంవత్సరాన్ని కార్తెలుగా లెక్కిస్తారు. అశ్వని మొదలు రేవతి వరకు నక్షత్రాలు ఇరవై ఏడు కదా! ఒక్కొక కార్తెలోనూ సూర్యుడు సుమారుగా పదమూడున్నర రోజులు ఉంటాడు, ఇలా ఇరవైఏడు కార్తెలలోనూ, అన్ని కార్తెలలోనూ వర్షం పడదు. వర్షం పడే కార్తెలను చెబుతారు, పంచాంగ కర్తలు. ఇలా వర్షం పడే కార్తెలు పద్ధెనిమిది, మొదటి కార్తె భరణితో ప్రారంభమై చివరి కార్తె మూలతో ముగుస్తుంది, వర్షించే కార్తెలకాలం. ఇది సుమారుగా ఏప్రిల్ ఇరవై ఎనిమిది మొదలు డిసెంబరు ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది. వర్షించే కార్తెలు పద్ధెనిమిది, పూర్వాషాఢ కార్తెనుంచి అశ్విని కార్తెదాకా వర్షం పడదంటారు, వీటిని నిర్జల కార్తెలనీ అంటారు.

భరణితో ప్రారంభమైన వర్ష కార్తెలలో మఘ కార్తె తొమ్మిదవది, అనగా వర్షించే పద్ధెనిమిది కార్తెలలోనూ మధ్యది. ఏ మొలకైనా పునర్వసు కార్తెలో పుడితే ఏపుగా పెరుగుతుంది, అదేగనక మఘ కార్తెలో పుడితే అప్పటికి వర్షాలు జోరుగా ఉండడంతో ఇవక ఎక్కువై ఛస్తుంది, అదే ఆ తరవాతి కార్తె పుబ్బలో, అంటే వర్షాలు ఎక్కువగా ఉన్నపుడు పుట్టి అప్పుడే పోవడాన్ని, మఖలో పుట్టి పుబ్బలో మాడిపోవడమంటేనూ, మధ్యలో వచ్చి మధ్యలో పోవడమంటేనూ సంగతిదీ……

మన పూర్వులు మాటాడే మాటలలో ప్రకృతికి సంబంధించిన ఇటువంటి విషయాలు కూడా సంక్షిప్తం చెప్పడం అలవాటు…

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మఖలో పుట్టి…..

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s