శర్మ కాలక్షేపంకబుర్లు-కాటికి కాళ్ళు జాపడం.

కాటికి కాళ్ళు జాపడం.

ఎవరి కాళ్ళు వాళ్ళు కాటికేసి జాపి పడుకోరు, చచ్చేటపుడు, మరొకరు జాపుతారు 🙂

జీవి శరీరంలో ఉన్నంత సేపు శివం,చిలక ఎగిరిపోయిన తరవాత, అదే హంస మంత్రం ఆగిన తరవాత, ఇది శవం. జీవుడు శరీరంలోని తొమ్మిది రంధ్రాలలో ఒక దాని గుండా గుండా బయటికిపోయి అనంతంలో కలుస్తాడు. అవి శరీరంలో ఊర్ధ్వభాగంలో ఏడు అధోభాగంలో రెండు రంధ్రాలు. ఇవి కాక మరో రంధ్రమూ ఉంది, కాని అది మూసుకుపోయి ఉంటుంది, అదే బ్రహ్మ రంధ్రం. అదేమని అనుమానం కదూ! చిన్న పిల్లలని అనగా నెలల పిల్లల్ని చూడండి, పరిశీలించి. తలమీద మధ్యలో ఒక చిన్న గుంటలా ఉంటుంది. అక్కడ చెయ్యి వేసి చూడండి హృదయ స్పందన వినిపిస్తుంది. దీనినే ”మాడు” అనీ అంటారు, అదే బ్రహ్మ రంధ్రం. కొంతమంది పిల్లలలో ఆ హృదయ స్పందన బయటికే కనపడుతుంది కూడా, బ్రహ్మ రంధ్రం మీది చర్మం గుండెతో పాటుగా స్పందిస్తూ. ఇది వయసుతో పాటు గట్టిబడి మూసుకుపోతుంది. ఈ మార్గాన్ని ఛేదించుకుని ఊర్ధ్వంగా జీవుడు శరీరం వదలడమన్నది, చాలా అరుదు, ఎవరో మహానుభావులకుగాని సామాన్యులకు జరుగదు, వారే జ్ఞానులు. సామాన్యులందరికి శరీరాన్ని తగలబెట్టేటప్పుడు ఇది విచ్చుకుంటుంది, దానినే ’కపాల మోక్షం’ అంటారు. దారి తప్పేం కదూ!

ఇప్పుడంటే అందరిని చివరికాలమొస్తే హాస్పిటల్ లో పారేస్తున్నారు,ఒంటరిగా దిక్కులేని చావు చావమని గాని , పూర్వం బంధువులు, మిత్రులు అందరూ చూస్తుండగానే హంస లేచిపోయే సమయం వచ్చినపుడు, మంచం మీంచి భూమి మీదకి దింపేవారు. అలా దింపినవారిని దక్షణానికి అగ్రాలుండేలా వేసిన దర్భల మీద దక్షణంగా తల ఉంచి పడుకోబెట్టి, కొడుకులు తులసి తీర్థం పోసేవారు, ఇంకా ఏమైనా ఆశ ఉండి బతుకుతారేమోనని, తల దక్షణానికి పెట్టేరు కదా అందుచేత కాళ్ళు ఉత్తరానికే చాచుతారు.

మీకీపాటికి ఒక అనుమానం వచ్చే ఉంటుంది, ఉత్తరాన్నే వల్లకాడుంటుందా అని. నిజమే వల్లకాడు ఇదివరలో ఊరికి ఉత్తరానే ఉండేది. అనుమానమా! ఐతే ఈ తత్త్వం వినండి. “ఊరికి ఉత్తరాన సమాధిపురములో కట్టె ఇల్లున్నదే చిలకా!” మరో అనుమానమొచ్చేసింది మీకు దక్షణానికే తలెందు పెట్టాలి అని కదా! దక్షిణం యముని దిక్కు అందుకు అటు తల ఉండేలా పడుకోబెడతారు. ఇక ఉత్తరాన్నే కాడెందుకుంటుందని కదా! మన దేశంలో గాలి ఎక్కువ కాలం దక్షణం నుంచి ఉత్తరానికి వీస్తుంది, అదే యముని దిక్కైన దక్షణాన్ని కాడు ఉంటే ఆ పొగ ఊరి మీదకొచ్చి బతికున్నవారు బాధ పడగూడదని ఈ ఏర్పాటు చేసేరు. ఇప్పుడు ఏ దిక్కులోనైనా కాడు ఏర్పాటు చేయచ్చు, ఎందుకంటే కొన్ని ఊళ్ళలో ఈ శ్మశానాలు కూడా పెద్దలు ఆక్రమించుకున్నారు గనుక, శ్మశానాలు లేవు గనక. కొన్ని ఊళ్ళలో శ్మశానాలూ లేవు, ఉన్నవి కబ్జా అయిపోవడం మూలంగా, పొరుగూరు శ్మశానాలు వాడుకుంటున్నారు..

ఒకప్పుడు ఇలా శ్మశానానికి సాగనంపడానికి కూడా వాయిద్యాలు పెట్టేవారు, ఇప్పుడతే మూడు రోజులుంచి, ఏం ఎందుకని మూడు రోజులుంచుతున్నారని కదా! కొడుకులు కోడళ్ళు అంతా అమెరికాలో ఉంటే వాళ్ళు రావడానికే సమయం పడుతోంది కదా! ఆ తరవాత కోతి చస్తే గోడవతల పారేసినట్టు పట్టుకుపోతున్నారు.

ఇలా శ్మశానాలు లేక శవాల్ని తగలపెట్టడం కూడా కష్టమవుతుంటే రాజమహేంద్రవరంలో కైలాసధామం అని ఒక చక్కని ఏర్పాటు చేశారు. ఈ కైలాసధామానికి శవాన్ని చేర్చడం కి కూడా ఏర్పాట్లున్నాయి, వేన్లు తిరుగుతుంటాయి.రాజమహేంద్రవరం చుట్టు పక్కల ముఫై కిలో మీటర్ల దాకా వేన్లు వస్తాయి. ఒకాయన నాకంటే పెద్దవాడొక సారి మాటల సందర్భంగా చెప్పేడు. అప్పుడు 2500 కట్టేను, అని, ఇప్పుడెంతో తెలీదనుకోండి. చాలా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేశారని విన్నాను.మూడు  సార్లు ఉపయోగించుకున్నాం కూడా తెలిసినవారికి అవసరపడితే… దీని ఉపయోగించుకోవాలనుకునేవారు ముందుగా సొమ్ము చెల్లించవచ్చు లేదా అప్పటికప్పుడూ ఉపయోగించుకోవచ్చు. వారికి ఫోన్ చేస్తే చాలు వేన్ పంపుతారు. మిగిలిన ఏర్పాట్లన్నీ అక్కడే అమరి ఉంటాయి. నేటి రోజుల్లో కాటికి కాళ్ళు చాపి పెద్దవాళ్ళని పంపెయ్యడం కూడా సమస్యే అయిపోయింది. ఇదీ కాటికి కాళ్ళు చాపడం కత.

మన కాళ్ళు కాటికి మరొకరు చాపుతారు.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కాటికి కాళ్ళు జాపడం.

 1. @ వెంకట రాజారావు . లక్కాకుల

  విడవకెవరిని మళ్ళి
  గడుసు పద్యాలల్లి
  మ/ఒడిసి పెట్టును లొల్లి
  తడిపి చీర్సుల జల్లి

  🙂

 2. చదూతూంటే మరీ భయమేస్తోందండీ 🙂

  అయినా స్పందిం “చండీ” అన్నారు కాబట్టి 🙂

  కాటికి కాళ్ళను జాపిన
  నోటికి బువ్వ నెవరుయిడు నోయని జెప్పెన్
  సూటిగ వజ్జల ! మాచన
  ధాటిగ తెలుపును విషయము ధారయు తోడన్

  చీర్స్ 🙂
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s