శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధ చంద్ర ప్రయోగం.

అర్ధ చంద్ర ప్రయోగం.

అర్ధ చంద్రుడంటే సగం చంద్రుడనికదూ! సగంచంద్రుని ప్రయోగమేంటి బాబూ! అసలిటువంటి మాటలిపుడు వాడటం లేదు కదూ!! అందుకే అదేంటో తెలుసుకుందాం!!! కుడిచెయ్యి ఎత్తండి,ఎత్తేరా గుప్పిటముయ్యండి, బొటనవేలు పైకి ఉండేలాగానూ! ఆ( ఇప్పుడు నెమ్మదిగా గుప్పిటవిప్పండి…చాలు,చాలు ఇప్పుడు బొటనవేలునుంచి చూపుడు వేలు చేసే ఆకారమెలా ఉంది? అర్ధ చంద్రునిలా ఉందికదూ! ఇప్పుడీ చేతిని ఇలాగే ఎవరి మెడమీదనైనా ప్రయోగిస్తే దాన్నేమంటారు? అర్ధ చంద్రప్రయోగం అనికదా. అంటే ఏంటిటా? అర్ధ చంద్రప్రయోగం అంటే మెడపట్టి గెంటెయ్యడం!!! ఆ( అదా! ఆశ్చర్యపోయారా!! అవాక్కయ్యారా!!!

చంద్రహాసం.

చంద్రహాసమంటే చంద్రుని నవ్వు కదా! కాదు, మరేంటీ అని అనుమానం. చంద్రహాసం అంటే చాలా పదునైన కత్తి అని అర్ధం. మరీ అర్ధం ఎందుకొచ్చిందో తెలీదు. చంద్రహాసుడు అంటే పదునైనకత్తిలాటి కుర్రాడు అని అర్ధం 🙂 చంద్రహాసిని అని పేరు లేదు మరెందుకో తెలీదు గాని హాసిని,సుహాసిని,పేర్లయితే ఉన్నాయి కాని చంద్రహాసిని మాత్రం లేదు 🙂 . కత్తిలాటి అమ్మాయికి పేరులేదా! లేకేం వాడకంలో లేదంతే! అది జాణ, తెలివైన,అందమైన అమ్మాయిని జాణ అనేవారు.

నలభైయవ సంవత్సరం.

నలభయ్యో సంవత్సరం వచ్చిందీ అంటారు. అంటే పరాభవం జరిగిందీ అని. పరాభవానికి నలభయ్యో సంవత్సరానికి సంబంధం ఏంటీ? తెనుగు సంవత్సరాలు ప్రభవనుంచి మొదలయి అక్షయతో ముగుస్తాయి కదా! వరసగా లెక్కెట్టుకుంటూ వెళ్ళండి సంవత్సరాలు, ఆ( ఆగండి నలభై దగ్గరకొచ్చేటప్పటికి ఏ పేరొచ్చిందీ! పరాభవ కదా! అదీ సంగతి. నలభయ్యో సంవత్సరమంటే జీవితంలో సగానికి పైన జరిగిపోయినట్టు లెక్కా! ఇకనుంచి జీవితంలో ప్రతి నిత్యమూ చూసేవి పరాభవాలే అని…

తారతమ్యాలు.

తారతమ్యాలేంటీ? తారతమ్యాలు.  లేవుటయ్యా? అంటే తేడా లేదుటయ్యా అని, అలగే తారత్మ్యాలు చూడకుండా పని చేస్తున్నాం కదా అంటే తేడా చూడకుండా పని చేస్తున్నామని అంటాం. మరీ తారతమ్యాలేంటీ? ఇవి తారతమ్యాలు. కాదు ‘తరము’ ‘తమము’ లు. అంటే కష్టము,కష్టతరము, కష్టతమము, ఇలా ఈ మాటలలో మొదటివానిని తీసేసి వాడుకలో తారతమ్యాలుగా వాడేస్తుంటాం…

In English as more and most used before the adjectives as difficult, more difficult,most difficult. The degrees of comparison Comparative and Superlative.

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అర్ధ చంద్ర ప్రయోగం.

 1. “చంద్రహాసం అంటే చాలా పదునైన కత్తి అని అర్ధం. మరీ అర్ధం ఎందుకొచ్చిందో తెలీదు”- మరదే. తెలీనప్పుడు ఎందుకు ప్రస్తావించినట్టు.?

  • స్వామి వారు ఈ మధ్య గరిక పాటి ని వడబోసి నట్టున్నారు 🙂 బాగుందండీ మీ టపా ! (comparative/superlative 🙂

   కష్టే ఫలే !

   అరసున్నయందము తెలిసి
   అరుదుగన నిటుల వివరణ అర్థము జెప్పెన్
   అరువది ఆపై పది మే
   ర రమ్య వాసంతములపు రాజు నితడనన్

   చంద్రుని అర్ధము అర్ధపు
   చంద్రుని యోగము జిలేబి చక్కగ తెలిపెన్
   సంద్రము మాచన జ్ఞానము
   ఇంద్రుడు కష్టే ఫలమును ఇచ్చట బెట్టెన్

   నలుబది పరాభ వమునచు
   విలువల నెల్లను తెలిపెను విదురుడు నిచటన్
   చిలువల వోలెన వోటమి
   పలుపలు విధముల జిలేబి పరిణితి నేర్పున్

   తరతమ ములుకా లగతిన
   తిరగలి లోచిక్కినవిర ! తీరుగ యనె భా
   స్కర ! తారతమ్య మయ్యెను
   సరళపు భాషన తెలుగున చక్కగ నిటులన్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s