శర్మ కాలక్షేపంకబుర్లు-ఉగ్గు

కష్టేఫలి

ఉగ్గు

”సాము గరిడిలు ఉగ్గుబాలతో నేర్చిన విద్యమాకు” అన్నారో కవివరులు. ఉగ్గు వేరు,పాలు వేరు. పుట్టినప్పటినుంచి అనే వాడుకలో వాడేమాటిది. నిజంగానే ఉగ్గు పుట్టినప్పటినుంచీ పెడతారు. మొన్ననొకరు ఉగ్గు గురించి చెప్పమన్నారు, మెయిల్లో చెప్పేను, వివరంగా టపా రాయమంటే, తప్పలేదు…

పుట్టిన వెంటనే బొడ్డుతాడు కోస్తుంది మంత్రసాని, అదిగో అక్కడితో తల్లినుంచి నేరుగా ఆహారం తీసుకునే సౌకర్యం తప్పుతుంది. స్నానం చేయించినతరవాత వెచ్చగా వుండేందుకు మెత్తటి పాతగుడ్డలు కప్పి, అమ్మమ్మ ఎత్తుకుని, వేలికి తేనె రాసుకుని నోట్లో పెడుతుంది, వేలు, చీకడం అలవాటు చేస్తుందలా. మానవులు పుడుతూనే ఏపనీ స్వయంగా చేసుకోలేరు, అన్నీ పరాధీనమే. జంతువులు పుట్టిన గంటలో లేచి నిలబడతాయి, తల్లి దగ్గర పాలెక్కడ దొరుకుతాయో వెతుక్కుని తాగుతాయి. మానవులకి పాలు తాగడం కూడా నేర్పాల్సిందే! తల్లి కూడా మొదటిసారిగా ప్రసవిస్తే పాలివ్వడం కూడా నేర్పాలి, లేకపోతే బిడ్డ ఉక్కిరి బిక్కిరైపోతుంది, పాలు తాగలేక. తేనె బలవర్ధక ఆహారం, ఆ తరవాత విరేచనకారి కూడా. అప్పటికి కడుపులో ఉన్నది బయటికిపోవాలంటే అదే మార్గం. తేనె తొందరగా శరీరానికి శక్తినిస్తుంది, అదీ సంగతి.  తీసుకునే ఆహారానికి ఎంత ప్రాముఖ్యం ఇస్తామో  మలవిసర్జనకీ అంతే ప్రాముఖ్యంఇవ్వాలి . రెండు కాని మూడో రోజునకాని తల్లికి పాలు పడతాయి. అంతతో బిడ్డకి కావలసిన ఆహారం తల్లిదగ్గరే దొరుకుతుంది. అప్పుడే పుట్టిన లేతపొట్టకి అనువుగా ఉండే ఆముదం పట్టేవారు విరేచనానికి, ఎంత? చిన్న చంచాడు. ఈ పట్టే ఆముదంలో తల్లిపాలు…

అసలు టపాను చూడండి 516 more words

ప్రకటనలు

One thought on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఉగ్గు

  1. కష్టే ఫలే వారు 🙂

    బాగుందండీ టపా !

    టపాలన్నీ షెడ్యూల్ చేసి ఆ పై రీబ్లాగు జేస్తున్నారా ?

    ఉగ్గు యన నేమి మాచన
    నిగ్గుగ తెలిపెన్ టపాగ నిదియే జూడన్
    చక్కెర వోలెన తేనెగ
    మక్కువ మీరగ జిలేబి మామ్మలు నేర్వన్

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s