శర్మ కాలక్షేపంకబుర్లు-వేదం లో నెలల పేర్లు.

వేదం లో నెలల పేర్లు.

ఇప్పుడు మనం తెనుగు నెలల పేర్లని చైత్రం మొదలుగా ఫాల్గుణం దాకా చెప్పుకుంటున్నాం. కాని ఒకప్పుడు వేదం లో చెప్పిన నెలల పేర్లు ఇలా ఉన్నాయి,చిత్తగించండి.

చైత్ర–వైశాఖం–మధు–మాధవ మాసాలు- వసంత ఋతువు.
జ్యేష్టం–ఆషాఢం–శుక్రం–శుచి మాసాలు-గ్రీష్మ ఋతువు.
శ్రావణం–భాద్రపదాలు–నభం–నభస్యం-వర్ష ఋతువు.
ఆశ్వయుజం–కార్తీకం మాసాలు–ఇషం–ఊర్జం-శరదృతువు.
మార్గశిరం–పుష్య మాసాలు–సహం–సహస్యం–హేమంత ఋతువు.
మాఘం–ఫల్గుణ మాసాలు–తపం–తపస్యం–శిశిర ఋతువు.

వేదంలో చెప్పబడిన నెలల పేర్లు, ఆ నెలలలో ప్రకృతి మార్పులనే సూచిస్తున్నాయి, నెలల పేరు కూడా దానికి తగినట్టుగానే ఉంటుంది.

మధు,మాధవ మాసాలు వసంతం, పువ్వులు పూస్తాయి, చెట్లు చిగుర్చుతాయి, తేనె బాగా దొరికే కాలం.

శుక్రం,శుచి మాసాలు గ్రీష్మ ఋతువు వెలుగు ఎక్కువగా ఉండేకాలం.

నభం,నభస్యం వర్ష ఋతువు, అనగా మేఘం,వర్షం సూచన చేస్తున్నాయి నెలల పేర్లు.

ఇషం,ఊర్జం శరత్ ఋతువు బలం సూచిస్తున్నాయి.

సహం,సహస్యం హేమంత ఋతువు, చలి సహించక తప్పదని సూచిస్తున్నట్టే ఉంది.

తపం,తపస్యం శిశిర ఋతువు, ఈ ఋతువులో చెట్లు ఆకులన్నీ రాల్చేసి కొత్త చిగురు కోసం తపిస్తున్నట్టు ఉంటాయి.

ఇక ఇప్పుడు మనం చెప్పుకుంటున్న తెనుగు నెలల పేర్లు ఎలా వచ్చాయి?

చిత్తా నక్షత్రంతో కూడిన పున్నమి కలిగిన మాసం, చైత్రమాసం .
విశాఖ నక్షత్రం తో కూడిన పున్నమి కలిగినమాసం వైశాఖం.
జ్యేష్ట నక్షత్రంతో కూడిన పున్నమి కలమాసం జ్యేష్ట మాసం.
పూర్వాషాఢ, ఉత్తరాషఢ నక్షత్రాలతో కూడిన పున్నమి కల మాసం ఆషాఢ మాసం.
శ్రవణం నక్షత్రంతో కూడిన పున్నమి కలిగే మాసం శ్రావణమాసం.
పూర్వాభాద్ర,ఉత్తరాభాద్ర నక్షత్రాలు కలిగి ఉండే పున్నమి కలమాసం భాద్రపద మాసం.
అశ్వనీ నక్షత్రం తో కూడి ఉండే పున్నమిగల మాసం ఆశ్వయుజ మాసం.
కృత్తికా నక్షత్రంతో కలిగి ఉండే పున్నమి కలమాసం కార్తీక మాసం.
మృగశీర్షా నక్షత్రంతో కూడి ఉండే పున్నమిగల మాసం మార్గశీర్ష మాసం.
పుష్యమీ నక్షత్రంతో కూడిన పున్నమి కలిగే మాసం పుష్య మాసం.
మఘ నక్షత్రంతో కూడి కలిగే పున్నమి కలమాసం మాఘమాసం,
 ఉత్తర  నక్షత్రంతో కూడి ఉండే పున్నమి కలమాసం ఫాల్గుణ మాసం.

ఇదీ నెలల పేర్ల సంగతి.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-వేదం లో నెలల పేర్లు.

  1. చుట్టున ఉన్నటి ప్రకృతిని
    పట్టుగ జూసెనుర వేద పారుడు జూడన్
    చట్టన తోచెను నతనికి
    గట్టిగ ఋతువులకు పేర్లు గప్పున బెట్టెన్ 🙂

    జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s