శర్మ కాలక్షేపంకబుర్లు-భుంజానో న బహు బ్రూయాత్

భుంజానో న బహు బ్రూయాత్

శ్లో. భుంజానో న బహు బ్రూయాత్ , న నిందేదపి కంచన
జుగుప్సిత కథాం నైవ శృణుయాదపి నా వదేత్. 

గీ. భోజనము  చేయునప్పుడు మూగ వగుము. 
పరుల నింపఁ బోకుము. పరమ రోత 
కొలుపు మాటలు వినకుము పలుకఁ బోకు. 
శాంత మతివౌచు భుజియింప సత్ఫలమిడు.

భావము. భోజన సమయంలో అతిగా మాట్లాడకూడదు. ఎవరిని గూర్చియు నిందచేయరాదు. రోత కలిగించే విషయాలను వినకూడదు. ప్రస్తావించకూడదు.

Courtesy: http://andhraamrutham.blogspot.com/

భోజనం చేసేటపుడు తక్కువగా మాటాడు, జుగుప్సాకరమైన మాటలు మాటాడకు వినకు,ఎవరిని నిందించకు అన్నారు పెద్దలు. కారణం ఉందా? అని విచారిస్తే బలమైన కారణమే ఉంది అదేమో చూదాం.

భోజనం చేయునపుడు ఇష్టంగా తినాలి, అపుడే జీర్ణరసాలు కడుపులో తయారవుతాయి, కోపం, జుగుప్స వంటి మాటలు మాట్డాటం మూలంగా కూడా కొన్ని చెడ్డ పరిణామాలుంటయంటారు. అధునిక వైద్యశాస్త్రం కూడా ఈ మాట చెబుతోందన్నారు.

ఇవే కాక మరో ముఖ్యమైన కారణం. మానవ శరీర నిర్మాణం లో గొంతులో అన్నవాహిక మొదలు, ఊపిరితిత్తులకు గాలిని తీసుకుపోయే నాళము పక్క పక్కనే ఉంటాయి. ఈ ఊపిరి తిత్తులకు గాలిని తీసుకుపోయే నాళం మీద ఒక అనిఛ్ఛాకండరం ఉంటుంది, పల్చనిది, దాని పేరు ’ఎపిగ్లాటిస్’. ఇది గాలి పీల్చుకునేటపుడు, వదిలేటపుడు తెరుచుకుని, మనం ఆహారం మింగే సమయంలో ఊపిరితిత్తులకు గాలి వెళ్ళే మార్గాని మూసి ఉంచి ఆహారం ఆహారనాళం లో కే వెళ్ళేలా చేసి, ఆహారం మింగిన వెంటనే తెరుచుకుంటుంది. అంటే ఆహారం చిన్న తునక కూడా ఊపిరి తిత్తులలోకి వెళ్ళకుండా అడ్డుపడుతుందనమాట. ఈ ప్రక్రియ మనకు తెలియకనే జరిగిపోతూ ఉంటుంది. మనం మాటాడేటపుడు ఊపిరి తిత్తులలోగాలి స్వరపేటిక గుండా బయటికి వస్తూ నాలుక చేసే విన్యాసాలకు అనుగుణంగా మాటలు పలికిస్తుంది, అవి తియ్యగానూ ఉండచ్చు, కటువుగానూ ఉండచ్చు 🙂
 epiglottis-location

    ఎపిగ్లాటిస్ దానికి  ఇచ్చే సంకేతాలని బట్టి అది పనిచేస్తుంటుంది. భోజనం చేసిటపుడు ఎపిగ్లాటిస్ చాలా జాగరూకతతో ఉంటుంది. ఆహారం మింగుతూ, ఉన్నపుడు మూసుకుంటుంది. మాటాడేటపుడు తెరుచుకుంటుంది. ఆహారం తింటూ మాటాడితే ఆ ఎపిగ్లాటిస్ ఏక కాలంలో తెరుచుకోవాలో మూసుకోవాలో తెలియక తికమకపడిపోతుంది. అప్పుడు తిన్న ఆహారం లో చిన్న తునకైనా ఊపిరి తిత్తులలోకెళితే చెప్పేదే లేదు. దీనినే పొలమారడం అంటారు. ఒక్కొకపుడు చాలా ప్రమాదం కూడా జరుగుతుంది దీని మూలంగా. ఊపిరి తిత్తులు గాలిని తప్పించి మరిదేనినీ సహించవు, పొరపాటుగా ఒక ఆహారపు తునకైనా ఊపిరి తిత్తులలో జొరబడబోతే పెద్ద గొడవ చేసి బయటికి గెంటేస్తాయి 🙂 అప్పుడే మనం చాలా అవస్థ పడిపోతాం కదా!

ఇక చిన్న పిల్లలు ప్రతివస్తువును నోటిలో పెట్టుకుంటారు. కొంత వయసుపిల్లలు కూడా చాక్లెట్లు వంటివి తింటూ మాటాడుతుంటారు. అదీగాక చిన్నపిల్లలు గోళీలులాటివి నోట్లో పెట్టుకుని ఆడుతుంటారు. పొరపాటున అదిగనక ఎపిగ్లాటిస్ పైన కనక ఉండిపోతే ఊపిరి అందక సకాలంలో ఏమిజరిగినదీ పెద్దలు తెలుసుకోలేక బిడ్డ చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక చిన్న పిల్లలకి వేసే మందు బిళ్ళలు కూడా పెద్దవిగా ఉంటున్నాయి, ఒక్కొకపుడు. ఇలా పెద్దవైన మందు బిళ్ళలు మింగించాల్సి వస్తే వాటిని పొడిచేసి తేనెతో నాకిస్తే మంచిది. ఇలా పెద్ద మందుబిళ్ళలు మింగించబోయినపుడు ప్రాణాలు పోగొట్టుకున్న పిల్లల సందర్భాలూ పేపర్లో చూస్తున్నాం ఈ మధ్య. అందుకు భోజనం చేసేటపుడు ఎక్కువగా మాటాడవద్దన్నారు, నములుతూ, మింగుతూ అసలు మాటాడ కూడదు. తస్మాత్ జాగ్రత.

ఈ సందర్భంగా ఒక జరిగిన సంఘటన.

ఇది చాలా కాలం కితం జరిగినది. ఆయనొక ప్రఖ్యాతి వహించిన శస్త్ర చికిత్సా వైద్యుడు,వారికి ఒకడే కొడుకు చిన్నవాడు ఐదేళ్ళలోపువాడు. ఇంటిదగ్గర ఆడుకుంటున్నాడు, బయట పెరటిలో. తల్లిలోపల పని చేసుకుంటున్నది. ఎందుకో బయటికొచ్చి చూస్తే కొడుకు కింద పడిఉండడాన్ని గమనించిన తల్లి వెంటనే కొడుకుని ఎత్తుకుని లోపలికి తీసుకుపోయి భర్తకి ఫోన్ చేసింది, కొడుకు పరిస్థితి వివరిస్తూ, క్షణాలలో కుర్రాడు కనుమూశాడు, తండ్రి హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చేటప్పటికి, మిగిలిందేమీ లేకపోయింది. ఏమి జరిగిందని తెలుసుకోడానికి ప్రయత్నం చేస్తే గోళీ ఎపిగ్లాటిస్ ని మూసేసిందని తెలిసి లబోదిబో మనడమే మిగిలింది. అందుకు భోజనం చేసేటపుడు మితంగా మాటాడటం, పెద్దలు పిన్నలు అలవాటు చేసుకోవలసిందే. లంచవర్ డిస్కషన్స్ అంత మంచివకావేమో 🙂

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-భుంజానో న బహు బ్రూయాత్

 1. కష్టే ఫలే వారు !

  ఇవ్వాళ పరహిత వైద్య వజ్జల వారి క్లాసన్న మాట ! మీకు సాయిన్సు గూడా బాగా అచ్చివచ్చిన విద్య లా ఉన్నదే !

  బాగుంది టపా !

  ఔరా ! విదురుడు మాచన !
  వీరు సయిన్సు గురు కూడ! వినవలె నిచటన్
  మీరు సమన్వయ సమయపు
  తీరుగ మాటల పలుకన తియ్యగ నుండున్

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s