శర్మ కాలక్షేపంకబుర్లు-ఊహాగానం.

ఊహాగానం.

ఊహ అంటేనే నిఘంటుకారులు రకరకాల అర్ధాలిచ్చారు. ఊహాగానం అంటే లేనిదాన్ని ఊహించుకోడంగా చెబుతారు కూడా. ఊహ కి గానానికి అసలు మేనమామపోలిక సంబంధం కూడా లేదు 🙂 మరీ ఊహాగానం మాటెలా పుట్టిందబ్బా!

వేదాన్ని నాలుగు విభాగాలుగా చేసినవారు వ్యాసులు, అందుకే వారిని వేద వ్యాసుడు అని కూడా అంటారు. ఋగ్వేదము,యజుర్వేదము,సామవేదము, అధర్వణవేదమని వేదాలకి పేర్లు.యజుర్వేదం మళ్ళీ రెండు శాఖలు శుక్ల యజుర్వేదం,కృష్ణ యజుర్వేదం. మన దేశంలో శుక్లయజుర్వేదం ఉత్తరాదిని, కృష్ణ యజుర్వేదం దక్షణాదిని ఎక్కువ. ఇక సామవేదం చాలా చిన్నది. పరమాత్మ వేదాలలో సామవేదం ’నేనే’ అని చెప్పేరు కూడా. వేదాన్ని పారాయణ చేయడాన్ని వేదగానం చేయడమంటారు, కాని ఈ సామవేదం పూర్తిగా సంగీతపరమైనదే! ఈ వేదాన్ని పారాయణ చేసేటపుడు తరచుగా ఔ, హౌ, వా, హా  అనే అక్షరాలు తరచుగా చివరగా వినపడుతుంటాయి. ఈ వేదం లో ’గ్రామగేయం’ (గ్రామంలో గానం చేయదగినది) రెండవది ’అరణ్యగేయం’ ( అరణ్యంలో గానం చేయదగినది). వీటి రెండిటిని కలిపి ’గాన సంహిత’ అంటారు. గ్రామగేయం, అరణ్యగేయాలు రెండు రకాలు. అవి ’ప్రకృతి’, ’ఊహ’. ప్రకృతికి సంబంధించిన ఊహ నే ’ఊహగానం’ అంటారు. అలాగే అరణ్యగేయానికి సంబంధించిన ఊహ ను ’రహస్యగానం’ అంటారు.
ప్రకృతిలో ఏడు గానాలున్నాయి. ఊహ ఏడు తంత్రాలతో కూడినదని స్వరానుక్రమణిక చెబుతోంది.

ఇలా వేదానికి సంబంధించిన ఈ మాట ప్రజల నోటిలో ఊహాగానంగా మారిపోయింది.

5 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఊహాగానం.

 1. అరణ్యంలో ఊహను రహస్యముగా రాగాల తేలించి
  జనారణ్యంలో ప్రకృతిని దానికి గానముగా జోడించి
  ఊహింపగలేని ఊహాగానమిది అంటూ గుట్టు విప్పి
  అలవోకగ మీరే చెప్పగలరు, పట్టుగా వేదాలను కూడగట్టి …

  __/\__ …

 2. నమస్కారం గురువు గారు! మీరు నిత్యం మాకందిస్తున్న జ్ఞాన నిధి అపారమయినది. ఇలాగే ఇంకా ఎన్నెన్నో విశేషాలకోసం ఎదురు చూస్తుంటాము. ధన్యవాదాలు.

 3. “ఊహా” గానం బాగుందండీ కష్టే ఫలే వారు !

  ఊహా గానము జేసిరి వేదము ఊపిరి మీరగ పారులు పాడన్
  ఆహా మాచన జెప్పెను జూడర ఆ దరువు నిత్య సత్యము జూడన్
  ఓహో తెలిసెను వేదము మేటిర ఓపిక గూడగ సామము పాడన్
  ఔహా అనునవి వాడుక ఊహా ఔరా ఆయెను గదరా జూడన్

  చీర్స్
  జిలేబి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s