శర్మ కాలక్షేపంకబుర్లు-కుక్క మొరిగితే….

కష్టేఫలి

కుక్క మొరిగితే….

”కుక్క మొరిగితే జంగం పరపతిపోయిందా?” ఇదొక నానుడి. ఈ మధ్య దీనిని ”కుక్క కూస్తే జగం పరపతిపోయిందా” అని వాడుతున్నారు, ప్రాసకోసమనుకుంటా :). కుక్క మొరగడమేంటి? జంగం పరపతి పోవడమేంటో.. 🙂

జంగమదేవర ఆహార్యం విలక్షణంగానే ఉంటుంది. పంచెకట్టు, పైనొక కండువా, ముఖాన, ఒంటినీ విభూతి రేఖలు, చేతిలో ఒక శంఖం, కాళ్ళకి ముందు వెనక కట్టుకున్న గంటలతో నడుస్తుంటే చూడవలసిందే, వీరు బిక్షాటన చేసేవారు. పల్లెలలో ఇది ఒకప్పటి మాట.

కుక్క విశ్వాసంగల గ్రామ జంతువు. పాతకాలంలో కుక్కలు దొంగల్ని చూసి మాత్రమే మొరిగేవి, నేటి కాలం సంగతి నాకు తెలియదనుకోండి.

ఒక జంగమ దేవర ఒక గ్రామానికి బిక్షకై వచ్చేరు, రోజూ అదే ఊళ్ళోకాక, రోజుకో ఊరిలో బిక్షాటన చేయడం రివాజు.. ఆ ఊరిలోకి రాగానే ఒక గ్రామ సింహం వెనక పడి అరవడం మొదలెట్టింది. ఒక ఇంటి ముందు నిలబడి శంఖం పూరించారు. ఇంటి ఇల్లాలు భిక్ష తెస్తుండగా గ్రామ సింహం జంగమ దేవరని చూస్తూ అరుస్తూనే ఉంది. జంగమ దేవర కుక్కని విదిలించలేదుగాని, భిక్ష తెచ్చిన ఇల్లాలు జంగమదేవరకి బిక్ష వేసి కుక్కని అదిలించింది, ఛీ,ఛీ అని. జంగమ దేవర మరొక ఇంటికి తరలిపోయారు. కుక్క వెంబడించింది, మొరుగుతూ, ఛీ,ఛీ అని అదిలించినా కూడా. ఇలా మొరుగుతూ కుక్క కూడా రావడం జంగమ దేవరకి కొద్దిగా ఇబ్బందిగానే ఉంది, తనను చూసిన వారు దొంగనుకుంటారేమోనని…

అసలు టపాను చూడండి 177 more words

One thought on “శర్మ కాలక్షేపంకబుర్లు-కుక్క మొరిగితే….

  1. కుక్క మొరిగితే జంగం
    పక్కన నేమిర నతనికి పరపతి బోవున్ ?
    కుక్కకు చక్కని చుక్కయు
    పిక్కలదుర దెబ్బ వేయ బిత్తరు బోయెన్ 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s