శర్మ కాలక్షేపంకబుర్లు-కల్లుపొర

కల్లుపొర                        

కల్లుపొర అంటే కల్లు కాలమని అర్ధం. ప్రకృతిలో కొన్ని చెట్లనుంచి స్రవించే పానీయాలనే కల్లు అంటారు, ఇది మత్తు కలగజేస్తుంది. ఇలా మత్తు కలగజేసేవి, తాటికల్లు, ఈతకల్లు, విప్ప(ఇప్పవాడుకలో మాట)కల్లు, జీలుగుకల్లు. ఈ చెట్లుకూడా సంవత్సరం పొడుగునా ఈ కల్లును స్రవించవు, ఇలా కల్లును స్రవించే కాలమిదే, అదే వసంతం. ఈ కల్లులలో ముఖ్యమైనది తాటికల్లు.ఈ కల్లు కాలం మొదలయి ఒక వారమయింది.

కల్లు మానండోయ్ బాబూ కళ్ళు తెరవండోయ్! అన్నారు పెద్దలు. ఏమోగాని కళ్ళు తెరవటం లేదెవరూ! కల్లు కూడా ఈ రెండు నెలలే దొరుకుతుంది, ఆ తరవాత కృత్రిమంగా తయారు చేసిన మద్యాలు వాడుతున్నారు. నిజానికి వరి,గోధుమవంటి వానితోను ద్రాక్ష వగైరా పండ్ల రసాలతోనూ కూడా మద్యాలు తయారు చేయచ్చు, కాని అవి ఖరీదైనవైపోతాయి, ఆహార పదార్ధాలను మద్యానికి ఉపయోగించకూడదనే చట్టం కూడా ఉన్నట్టుంది.

తాటి కల్లు ఎలా గీస్తారు?

DSCN0007

ఈ కాలంలోనే తాటి చెట్టున  గెల వేస్తుంది, దీనినలాగే వదిలేస్తే కాయలొస్తాయనమాట. కాని వచ్చిన గెలని చెక్కుతారు కొద్దిగా, ఫోటోలో వదిలేసిన గెల ఉంది చూడండి, గుడ్డ ముక్కకి కుడివైపున, అలా చెక్కినదానికి కుండ కడతారు, ఆగెలని కుండలోపలికి పెట్టి. అలా గీసినగెల నుంచి బొట్లు బొట్లుగా కల్లు కారుతుంది, కుండలోకి చేరుతుంది. ఉదయం, సాయంత్రం కుండనుంచి కల్లు తీసుకుంటారు, చెట్టెక్కి. ఒకే చెట్టుకి నాలుగు కుండలు కూడా కడతారు ఒకే సారి. ఇలా తీసిన కల్లును వెంట వెంటనే ఉపయోగించేయాలి 🙂 లేకపోతే పులిసిపోతుంది.

DSCN0015

కల్లు గీయాలంటే చెట్టెక్కాలి. చెట్టెక్కాలంటే కాళ్ళకి బంధం వేసుకోవాలి, నడుముకి మోకు వేసుకోవాలి. నడుముకు వేసుకుని చెట్టు చుట్టూ ఉండే తాడుని మోకు అంటారు, ఇది బలమైన తాటిపీచుతో తయారు చేస్తారు. ఒక చివర తాడును వంచి కన్నంలా తయారు చేసి కట్టేస్తారు, దానిలో రెండవ చివర చెట్టు చుట్టూ తిప్పి తీసుకొచ్చి ఈ కన్నం లోంచి మెలిక వేసి ముడి లా వేస్తారు, జారిపోకుండా. ఇలా రెండు కాళ్ళకీ బంధం వేసుకుని మోకు చెట్టుకూ తన నడుముకూ తగిలించుకుని మోకు రెండు చేతులతో పట్టుకుని చెట్టు పైకి వేసి, కింద బంధంతో ఉన్న కాళ్ళను దగ్గరికి ముడుచుకుని లేచి నిలబడితారు, దానితో కొంత దూరం ఎక్కినట్టే, ఇలా చేస్తూ చెట్టు మొవ్వులోకి చేరతారు. అక్కడ పని చూసుకునేటపుడు కూడా మోకును ముడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. చెట్టు పై కెళ్ళేకా అక్కడ అవసరాన్ని బట్టి ఉపయోగించే కత్తులు నడుముకు తగిలించుకున్న తోలు పటకాలో పెట్టుకు వెళతారు. ఈ కత్తులను ఉపయోగించి మరలా వాటి స్థానం లో పెట్టేస్తారు. ఇక అక్కడ కుండలో చేరిన కల్లును కూడా పట్టుకెళ్ళిన కుండలో పోసుకుని మళ్ళీ కుండని చెట్టుకు కట్టేస్తారు. ఈ కుండ బదులు నేటి కాలం లో స్టీలు కేరేజి వాడుతున్నారు.

DSCN0008

తాడి చెట్లలో కూడా మగ,ఆడ తేడా ఉంది 🙂  మగ చెట్టును పోతు చెట్టు అంటారు. పోతుతాడి కల్లు బాగుంటుందిష, ఎలా ఉంటుందో తెలీదు, తాగీ ఓపికున్న రోజుల్లో కూడా తాగలేదు 🙂 ఆడ తాడి ఎక్కువ కల్లు, పోతుతాడి తక్కువ కల్లూ ఇస్తాయట. ఇక ఈ తాటికల్లును మరగబెట్టి బెల్లం కూడా తయారు చేస్తారు, ఇది ఔషధం. దీనినే పాత బెల్లం అని అంటుంటారు. బాలెంతకు పాత బెల్లం పెట్టడం, కాయంలో పాత బెల్లం వాడటం మనకి అలవాటే, ఇప్పుడు పెట్టటం లేదుగాని.కల్లు తక్కువ మోతాదులో పరిమితంగా తీసుకుంటే మంచిది, మంచి ఆకలి పుట్టిస్తుంది. ఇక ఈత కల్లు చర్మ రోగాలకు మందు, కుష్ఠు వ్యాధిని కూడా నయం చేయగలదంటారు.

”తాటి చిగురు” దీనిని తయారు చేస్తారు, తెల్లటి పొడుగుపాటి సీసాలలో పోసి జీలుగుబెండు బిరాడాలెట్టి మట్టిలో కప్పెడతారు. ఎంతకాలం నిలవ ఉంటే అంత బాగుంటుందిట. కలిగినవారు తయారు చేయించుకుని పాతికేళ్ళ కితం సరుకు కూడా వాడుతుంటారంటారు.

images

తిప్పతీగ

దేవతలు సోమపానం చేస్తారట. ఈ సోమలతను దంచి రసం తీసే విధానం కూడా వేదం లో వర్ణించబడింది, ఈ సోమ రసాన్ని ఉన్ని బట్టలో వడకడతారనీ చెప్పింది వేదం. సోమరసం ఆరోగ్యానికి మంచిది అన్నారు కదా మరి ఈ సోమలత ఏదీ అన్న ప్రశ్న, దానికై వెతుకులాట జరుగుతూనే ఉంది. ఇప్పటికి ఉన్న అభిప్రాయాల ద్వారా తెలిసేది, తిప్పతీగ కాని, కాడజెముడు కాని సోమలత అయి ఉండచ్చు అని అనుమానాలున్నాయి. తిప్పతీగను సంస్కృతంలో అమృత అంటారు. తిప్పతీగను దంచి తీసిన రసం నిలవబెడితే కిందకి మడ్డిలా తేరుతుంది, దీనిని తిప్పసత్తు అంటారు. ఇది బలానికి మందుగా వాడతారట. ఇక కాడజెముడు ఆహారనాళము, అన్నకోశ వ్యాధులన్నిటికీ మంచి మందు.

DSCN0002

కాడజెముడు

 

 

ప్రకటనలు

14 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కల్లుపొర

  • nmraobandi గారు,
   పాతబెల్లం, కల్లు బెల్లం, తాటి బెల్లానికి పేర్లు.కొంచం గట్టిగా ఉంటుంది, ఉప్పగానూ ఉంటుంది, కొద్ది వాసనా ఉంటుంది. ఆరోగ్యానికి మంచి మందు. రోజూ రాత్రి పాలలో వేసుకు తాగితే ధాతు పుష్టి చేస్తుంది. బాలెంతకు మంచిది, ఇది వరకు కాయంలో వాడేవారు. ఆధునికులం కదండీ అన్నీ మానేశాం వాడకం, ప్రకృతికి దూరంగా బతుకుతున్నాం 🙂
   ధన్యవాదాలు.

 1. మడిసన్నోడికి కూసంత కలాపోసనుండాల
  తడిసి మోపిడైనా కల్లు తాగుతుండాల
  నడిసినంతసేపూను నాట్యమాడాల
  పడుతు పడుతూ లేచి ఇంటికెల్లాల

  • వెంకట రాజారావు . లక్కాకుల గారు,
   సుర తాగడం మూలంగానే సురలయ్యారట కదండీ! పాపం కల్లు చెట్టేం చెబుతుందండి 🙂
   ధన్యవాదాలు.

 2. బాగుందండీ వసంతపు ఆచనములు !

  గలగల గెల గెల వదలక
  కలకల మునకలు తెలియగ కలమున బట్టెన్
  యిల నెల వసంత మాచన
  ము లాచరించన్ హవిస్సు ముంతను గొనెనే !

  చీర్స్
  జిలేబి

  • జిలేబిగారు,
   గవళ్ళ గంగమ్మగారి హస్తోదకం,వసంతపు ఆచమనం చేయాలనే ఉంది, కుండకూడా గుమ్మంలోనే ఉంది, కాని తి డతారేమో అందరూ అని ….. 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s