శర్మ కాలక్షేపంకబుర్లు-House arrest

House arrest

”ఏయ్! మిమ్మల్నే ఆగండి!!ఎక్కడికి పొద్దుటే బయల్దేరేరు?నడవండి కోర్ట్ కి’ అన్నారు.

మమ్మల్ని భాస్కరుడి గారి కోర్ట్ లో ప్రవేశపెట్టేరు.

నేను ఉదయమే ఆరుగంటలకే వస్తానని తెలుసుకదా!!! మరేం?” అని గద్దించారు, న్యాయాధిపతి భాస్కరుడు.

”అయ్యా! తప్పదు కదు బాబూ అందుకు బయటకొచ్చాం” అని విన్నవించుకున్నాం.

”ఠాట్! అదే కుదరదు, పొండిలోపలికి, మిమ్మల్ని అరస్ట్ చేస్తున్నా! House arrest ఇంటిలోనే ఉండాలి. అదీ ఏ.సి రూం కే పరిమితం కావాలి, బయటికొచ్చేరో జాగరత నా సంగతి తెలుసుగా”, గుడ్లురిమాడు.

”చిత్తం బాబయ్యా! ఎంత కాలం” అని నసిగాం..

”నీకు మూడు పాతికలు దాటేయి కదా! ముసలమ్మకి డెభ్భై దాటేయి కదా!! అందుచేత మీకు ఈ గృహ నిర్బంధం జూన్ నెల పదిహేను వరకు విధించడమైనది” అని వెళిపోయారు.

అమ్మా!అయ్యా!! గృహ ని ర్బంధం లో ఉన్నాం 🙂

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-House arrest

 1. వడదెబ్బ ఏమోకాని జిలేబి వ్రాసే పిచ్చి పిచ్చి పద్యాల దెబ్బకి కళ్ళు బైర్లు కమ్ముతాయి.

  • చి. YVR ,
   గృహ నిరబంధం మాకైతే బాగుంది సుమా 🙂 ఇఅతరుల కోసమైనా ఈ నిర్బంధం సడలించకపోతే అమ్మో బతకడం కష్టం 🙂
   ధన్యవాదాలు.

 2. కష్టే ఫలే వారు !

  టేక్ కేర్! సమయము భాస్కరునిది !

  కుదురుగ నొకరికొకరు నిటు పరిమితముగ గదియే గుడిగా కూర్చుని నీకున్నూ మరిమాకూ
  యిది సరస సమయమనుచు గడుపుదము విను !రమణీ !నిజమే ఈ రవి సాయిత్తే మనదోయీ !
  విధిగను వినుదము నతని పలుకులను !మనలకు మేలుయనన్ వీరుడు గావించే నిది సువ్వీ !
  గదిన మనము కులుకు చిలుకలవలె పరవశముగా నిటు యీ కాలము ఓంకారంబని రాగా
  ల ధునిగ కలకలముల గనగ సరసపు పలుకులన్ మురిపాలాటల వేళాయే జవరాలా !

  చీర్స్
  జిలేబి

   • కానీ ఎక్కువ కాలం మనశ్శాంతి లబిస్తుందనే గ్యారంటీ ఏం
    లేదు గురువు గారూ. మీరెక్కడున్నా సరే జిలేబీ గారి ప(వి)ద్యా
    బాణాలను కాచుకోవడం మీకు వడ దెబ్బను మించిన ముప్పే …
    ఆ బాణాలు ఎటునుంచి వచ్చి తగులుతాయో…
    జస్ట్ ఒక్క్కసారి ‘నిను వీడని నీడను నేనే’ పాటను గుర్తు తెచ్చుకోండి.
    ‘బ్లాగు మారినా (జిలేబీ) ఉనికి మారునా???’…
    మీ పరిస్తితి…అంతే గురూజీ…
    🙂

   • nmraobandi గారు,
    ఇంతేనా! ఏదీ గతినాకు రంగా !! ఏదీగతినాకూ!!!
    కడవలే కణ్ణా!!!మురుహా! మురుహా!! మురుహా!!! పాహిమాం!పాహిమాం!! రక్ష! రక్ష!! 🙂
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s