శర్మ కాలక్షేపంకబుర్లు-అత్తగారి కొంగు

అత్తగారి కొంగు

“అత్తగారి కొంగు తొలిగిందని చెప్పినా తప్పే,చెప్పకపోయినా తప్పే” ఇదొక సామెత. ఇష్టం లేనివారే పని చేసిన తప్పే అన్న మాటకి ఈ సామెత చెబుతారు. దీనికి తోడుగా ”ఒల్లని ఆలి ఒత్తుకుంటే గుచ్చుకుందన్నాడట”. అంటే, పెళ్ళామంటే ఇష్టం లేదు. ఆ సంగతి పాపమా ఇల్లాలికి తెలియదు. భర్తను కౌగలించుకుందిట, దానికా మగడు (…) గుచ్చుకుంటున్నాయన్నాడట. భార్య కౌగలించుకుంటే (…) గుచ్చుకున్నాయన్న మగాడున్నాడా? ఇది ఇష్టం లేనిమాట కాకపోతే 🙂 అత్తగారి కొంగు సంగతేంటంటారా? చిత్తగించండి.

ఒక అత్తగారికి కోడలంటే పడదు, కోడలే పని చేసిన తప్పు పడుతూనే ఉండేది. పాపం కోడలికి అత్తకి దగ్గరగా చేరాలని, అత్త చేత ‘మంచి’ అనిపించుకోవాలనీ కోరిక. అందుకోసం, సమయం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇటువంటి సందర్భంలో ఒక రోజు, అత్త పక్కింటి అమ్మలక్కలతో సభ తీర్చి, లోకాభిరామాయణం విడేసింది. ఈ సందర్భంలో అత్త చేతులు తిప్పుకుంటూ మాటాడుతోంటే, అత్తగారి కొంగు స్థానభ్రంశం చెంది, వక్ష సంపద బయటపడి చూడ్డానికి బాగోలేదు. ఇది చూసిన కోడలు అత్తకి సైగ చేసింది, పదే పదే కొంగు సద్దుకోమని. ఐనా అత్త గమనించకపోతే, తనే ఏదో పని మీద వెళుతున్నట్టు లేచి, ఆత్త కొంగు సరిచేసి వెళిపోయింది. సభ చాలించి లోపలికొచ్చిన తరవాత, అత్త కోడల్ని దొరక బుచ్చుకుంది. “ఏమే నీకు మరో పనేం లేదా? నా కొంగు తొలిగిందో లేదో చూస్తూ కూచోడమేనా నీ పని” అని సతాయించింది. దీనికి కోడలు “అయ్యో! అసహ్యంగా వక్ష సంపద బయటపడి, అత్తకి అవమానం జరుగుతుందేమో ననుకున్నా! ఎరక్కపోయి కొంగు సద్దేను, అత్తకి దగ్గరౌదామనున్నా, బుద్దొచ్చింది ఇంకెప్పుడూ ఏమీ చెయ్యను” అనుకుని తీర్మానించుకుంది.

కొన్ని రొజుల తరవాత అత్త మళ్ళీ లోకాభిరామాయణం విడేసింది, ఇరుగుపొరుగు అమ్మలక్కలతో. మామూలుగానే ఆవేశంతో మాటాడుతోంటే కొంగు తొలగిపోయింది, ఐనా అత్త చూసుకోలేదు. మగవాళ్ళు కూడా వస్తూపోతూ ఉండటంతో ఈ సారి పరిస్థితి మరీ అన్యాయంగా అనిపించినా కోడలు కదలలెదు, కనీసం సైగ కూడా చెయ్యలేదు. దీనితో అమ్మలక్కలలో ఒకామె ”వదినా! మరీ ఆవేశపడుతున్నవుగాని కొంగు సద్దుకో, బాగోలేదు” అని సలహా ఇచ్చింది. అప్పుడు తొలగిన కొంగును చూసుకుని అత్త సిగ్గు పడింది, కొంగు సద్దుకుంది. లోకాభిరామాయణం తరవాత లోపలికొచ్చిన అత్త కోడల్ని మళ్ళీ దొరకబుచ్చుకుని సతాయించిందిలా ”ఎమే! నా కొంగు తొలిగి అదెవతో చెప్పేదాకా దిక్కులేకపోయింది, ఎంత అవమానం జరిగింది, నీకేంపోయేకాలమొచ్చిందే! మొన్న ఇలా కొంగు తొలిగితే సద్దేవుకదా!! ఇప్పుడేమయిందీ” అని. దీంతో కోడలికి మతే పోయింది. ”మొన్న కొంగు సద్దితే అలా తిట్టింది, నీకు నా కొంగు మీదా వక్ష సంపదమీదేనా దృష్టి, అంటూ ఇప్పుడేమో నన్నే పట్టించుకోవు, అవమానం జరిగిందీ” అని సతాయిస్తోందనుకుంది. అత్త కదా ఏమీ అనలేదు, సమాధానం చెప్పి గొడవ పెంచుకోడం ఇష్టం లేక ఊరుకుంది. ఇలా ఈ సామెత ”అత్త గారి కొంగు తొలిగిందని చెప్పినా తప్పే,చెప్పకపోయినా తప్పే”నని స్థిరపడిపోయింది. అందుకే మరో సామెత చెబుతారు ”అరిసెల పాకం పదునూ,అత్త పదునూ కనుక్కోడం కష్టమే!”

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అత్తగారి కొంగు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s