శర్మ కాలక్షేపంకబుర్లు-కఱ్ఱపెండలం అప్పడాలు

కఱ్ఱపెండలం అప్పడాలు

Photo0009

పెండలం , కఱ్ఱపెండలం వేరు వేరు, ఇవి రెండూ ఒకటి కాదు. కఱ్ఱపెండలాన్ని అంగ్రేజిలో సేగో అంటారు. పెండలం కూర వండుకుంటారు, దీనినే పెండలం ఉప్మా కూర అంటారు, వేయించుకుంటారు కూడా.

పెండలాన్ని ముక్కలుగా తరుక్కుని ఉడకబెట్టండి, నీటిలో వేసి. ఉడికిన పెండలం ముక్కలికి కొద్దిగా పసుపు చేర్చండి. చేత్తో చిదిమేయండి, పొడిలా అయిపోతుంది. ఈ పొడికి, తగిన ఉప్పు, పోపు చేర్చండి, అదే పెండలం ఉప్మా కూర ,దీనిలో నిమ్మకాయ పిండుకోవచ్చు.. పుళిహోర కూర కూడా చేసుకోవచ్చు. పుళిహోర పోపు వేయించండి, దానిలో చింత పండు పులుసు చిక్కగా తీసిఉంచుకున్నది, వేగుతున్న పోపులో వేసి ఉడకనివ్వండి. ఆ తరవాత ఈ పెండలం పొడిని ఉడుకుతున్న పోపు, చింతపండు పులుసులో కలపండి. పెండలం పుళిహోరకూర తయార్.

Photo0008

ఇక కఱ్ఱపెండలం అనే దుంపని సగ్గు బియ్యం తయారీకి,సేమ్యా, మరి ఇతర వాటికి ఉపయోగిస్తారు. ఈ దుంపని కాల్చుకుని ఊరకనే తినచ్చు కూడా, బాగుంటుంది. ఇవే కాకుండా, కఱ్ఱపెండలం తో అప్పడాలు తయారు చేసుకుంటారు.

Photo0010

కాల్చిన కఱ్ఱపెండలం దుంపల్ని అమ్ముతారు, సంతలో. మా పల్లెలలో బాగా దొరుకుతుంది. దీనిని తెచ్చుకుని పైన ఉన్న తొక్క తీసేస్తే తెల్లగా దుంప కనపడుతుంది. ఆ దుంపని రోటిలో వేసి పచ్చడి బండతో మెత్తగా దంచాలి. ముద్దలా తయారవుతుంది.జిగురు మూలంగా మిక్సీలో కుదరదు, అందుకు గచ్చు శుభ్రంగా కడిగి గచ్చు మీద వేసి దంచండి,మెత్తగా. (మీకు రోళ్ళు,రోకళ్ళు,రుబ్బురోళ్ళు, పచ్చడి బండలు ఉండవుగా) మధ్యలో పీచు కొద్దిగా వస్తుంది తీసేయండి. ఇప్పుడు దీనిలో చిటికెడు పసుపు, తగిన ఉప్పు, కారం తగినంత, పచ్చి మిరపపళ్ళు బాగానే ఉంటాయి,కొద్దిగా జీలకఱ్ఱ చేర్చండి, చేత్తో కలపండి, మరోసారి దంచండి,(ఇష్టమైతే ఇంగువ కొద్ది నీళ్ళలో కలిపి ముద్దకి చేర్చేయండి) కలవలేదనుకుంటే. అవసరమైతే, కొద్దిగా నీరు చిలకరించండి, అప్పుడే కొద్దిగా తినే సోడా కలపండి. మెత్తటి ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని వత్తు పిండి కొద్దిగా చేర్చుకుని,అవసరమైతే, అప్పడం లా వత్తేయండి. ఎండలో ఆరనివ్వండి. వీటిని నిలవ చేసుకోవచ్చు, స్టీల్ డబ్బాలో గాలి తగలకుండా జాగ్రత్త చేయండి.

ఈ అప్పడాలని నిప్పులపై కాల్చుకోవచ్చు, లేదా గేశ్ స్టవ్ మీద కాల్చుకోవచ్చు,లేదా నూనెలో వేయించండి. ఇవి మన మామూలు అప్పడాలలా పొంగవు, గుర్తుంచుకోండి. కాల్చుకున్న అప్పడాలకు కొద్దిగా నూనె చుక్క రాయండి. ఫలహారంగా తినడానికి బాగుంటాయి. అన్నం లో దేనితో నైనా నంజుడికీ బాగానే ఉంటాయి

13 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కఱ్ఱపెండలం అప్పడాలు

  • మణిశర్మ అరిపిరాల గారు,
   పెండలం చేసుకోరు,రుచిగా ఉండదనేమో! లేదా చేసుకోడానికి చిప్ గా రావడానికి తగిన జిగురుండనో తెలియదు. పెండలం రుచుగా ఉండదు.చిలకడ దుంపతో చేసుకోవచ్చు.
   ధన్యవాదాలు.

 1. నాకిష్టమైన దుంప, ఆ పై ఇష్టమైనవారు వండిపెట్టినదీను… పోయిన్నెల్లో కర్రపెండలం అంటే యేమిటి అన్న ప్రశ్నకు రాసిన వివరణ కలుపుతున్నాను…. సగ్గుబియ్యం ని Tapioca pearls అని అంటారు. కర్ర పెండలం అనేది ఒక దుంప. మా సీతంమామ్మ భలే వండేవారు చేమ దుంపల వేపుడు లానే. దీన్నే cassava root (also called Brazilian arrowroot, tapioca and yuca) అని అంటారు. The starch extracted from this root in its purest form is used as is or else processed to make different forms; one such is మన సగ్గు బియ్యం in spherical “pearls” shape. అందుకే ముత్యాలతో పోల్చి అవి వీటికి సరికావు అన్నది …పొతే, కేరళా లో ఈ దుంప చిప్స్ దొరుకుతాయి భలేగా ఉంటాయి, నాకు మెక్సికన్ స్టోర్స్ లో దొరికేవీ నచ్చుతాయి. I always wonder if this entered India along with Green Pepper Chili or South Americans took back to their country (perhaps 2000 years ago!)

  • మరువం ఉష గారు,
   ఈ దుంపల గురించి మంచి సమాచారమే ఇచ్చారు. మీకంత ఇష్టమైనదాన్ని గుర్తు చేశాననమాట. మాకిక్కడ బాగా దొరుకుతుందండి. మాకు బాగా ఇష్టం, చేమ కూడా. ఒకప్పుడు చేమని అధిక ధరతో కేజి ఏభయి రూపాయలకి తెచ్చేను, పదిహేనేళ్ళ కితం. ఆ తరవాత నేను చేమని గయలో వదిలేశా, నా ఇల్లాలు రామాఫలం వదిలేసింది. ఆమెకు అదంటే, నాకు చేమ అంటే బహు ఇష్టం. వదిలేసి పదిహేనేళ్ళ తరవాత కూడా దానిని మళ్ళీ తినలేదు.
   ఎక్కడినుంచి ఇక్కడి కొచ్చిందో గాని ఇది ఈ దేశంను పుట్టిల్లు చేసేసుకుంది, పచ్చి మిర్చిలాగా
   ధన్యవాదాలు

 2. కేరళాలో కూడా కఱ్ఱపెండలం (tapioca) విరివిగా వాడతారు. వారి భాష మలయాళంలో “కప్ప” అని దీనికి పేరు. ఉడకబెట్టి టిఫిన్‌గా తింటారు. చిప్స్ కూడా తయారుచేస్తారు; కాకపోతే ఆ చిప్స్ కాస్త గట్టిగా(నే) ఉంటాయి.

  కఱ్ఱపెండలంతో పచ్చడి కూడా చేస్తారని ఇప్పుడు జిలేబీ గారి పద్యం ద్వారా తెలుస్తోంది 🤔

  • విన్నకోట నరసింహారావుగారు,
   అప్పడాలూ గట్టిగానే ఉంటాయండి. తింటే బలే బాగుంటాయండి. పచ్చడి చేసుకుంటారని ఇప్పుడే తెలిసింది, చేయించాలి.
   ధన్యవాదాలు.

 3. మీరు చెప్పిన తయారీవిధానాలు ఉపయోగకరం.
  కేరళాలో కూడా కఱ్ఱపెండలం (ఇంగ్లీష్‌లో tapioca) విరివిగా వాడతారు. మలయాళంలో “కప్ప” అంటారు. ఉడకబెట్టి టిఫిన్‌లా తింటారు. ఇంకా చిప్స్ కూడా తయారుచేస్తారు; కాకపోతే ఆ చిప్స్ కాస్త గట్టిగా(నే) ఉంటాయి.

  • విన్నకోట నరసింహారావుగారు,
   మాకు కాల్చినది అమ్ముతారు. దీనిని దుంపగా ఫోటో లో చూపినట్టున్నదానిని తెచ్చుకుని ఊరకనే తినేస్తాం. తినడం మొదలు పెడితే ఆగలేం, అంత బాగుంటుంది. మాకు విరివిగా దొరుకుతుంది. మా దగ్గర సేగో ఫేక్టరీలూ ఉన్నాయి. చిప్స్ అప్పడాలు గట్టిగానే ఉంటాయి కాని రుచిగా ఉంటాయండి.
   ధన్యవాదాలు

 4. కర్ర పెండల తోడను కరకరయను
  జుర్రు కొనెడు పచ్చడిని నాజూకు నేర్వ
  బిర్రుమని తరిమితి నయ్య! బిక్క జచ్చె
  నయ్యరు కిచెను లోన గునగున వెడలె !

  చీర్స్
  జిలేబి

  • Zilebi గారు,
   పచ్చడి తెలీదు, ఇప్పుడు చేసుకుంటాం. పాపం అయ్యరుగారికెంత కష్టమొచ్చింది 🙂
   ధన్యవాదాలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s