దబ్బకాయ పొక్కింపు.
వేసవి దారుణంగానే ఉంది. టపారాయాలంటే తెల్లవారుగట్ల తప్పించి సమయం కుదరటం లేదు :)అప్పుడేనా కరంట్ ఉంటే సుమా, తేలిగ్గా తెమిలే టపా గురించి ఆలోచిస్తే….ఇలాగా 🙂
దబ్బకాయ అంటాం గాని అది దబ్బపండేనండి! నిజంగానే దబ్బపండులాగా పసుపు పచ్చగా ఉంటుంది. మనుషుల్లో అందమైనవాళ్ళని దబ్బపండుతో పోల్చడమూ అలవాటే మనకి 🙂 ఇది ఆరోగ్యానికి మంచిది. దబ్బకాయను నారదబ్బకాయ,పుల్ల దబ్బకాయ అనికూడా అంటుంటారు. ఈ దబ్బకాయ ఉపయోగం తక్కువ, కాని ఉపయోగిస్తే మంచిది. సాధారణం గా దీనిని ఊరగాయ పెడతారు, అది అందరికి తెలిసినదే, ఇక కాయలొచ్చినన్ని రోజులలోనూ పుళిహోరలోనూ ఇతర వంటకాలలోనూ ఉపయోగించుకోవచ్చు. ఈ దబ్బకాయ పొక్కింపుకూడా నిలవ ఉండేది కాదు, ఒకటి,రెండు నెలలు నిలవ ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలంటే…
దబ్బపండును చిన్న ముక్కలుగా కోసుకోవాలి, గింజలన్నిటినీ తీసెయ్యాలి, ఒక్కటే కదా ఉండిపోయిందనుకుంటే అదే రుచిని పాడుచేస్తుంది, చేదుతో. ఇలా తరుక్కున్న దబ్బకాయ ముక్కలకి తగిన పచ్చి మిర్చిని అలాగేకాని, ముక్కలు చేసికాని చేర్చండి. చిటికెడు పసుపు వేయండి. నీరు తగలనివ్వకండి. సన్నటి సెగను మరగనివ్వండి. ఇప్పుడు దీనిలో ఒక బెల్లం ముక్క వేయండి. దీనిని తీపిగా తినాలనుకుంటే బెల్లం ఎక్కువ వేయండి, లేకపోతే కొద్దిగా వేయండి, ఉడకనివ్వండి. పుల్లగా వాడుకునే దానికి బెల్లం చేరిస్తే మంచి రిచొస్తుంది. ఉడికిన తరవాత తగిన ఉప్పు, మెంతి కారం చేర్చండి. మెంతి కారంలో ఉప్పు వేసి ఉండకపోతే ఉప్పు సరి చూసుకోండి, ఉప్పు తక్కువైతే నిలవుండదు, ఎక్కువైతే బాగోదు. గాజు సీసాలో పెట్టండి. ప్లాస్టిక్ సీసాలలో నిలవ చేయద్దు. దీనిని అన్నంలో కలుపుకుని తినచ్చు, లేదా ఇడ్లీ, దిబ్బరొట్టి,మినపట్టు వగైరా అట్లతోనూ నంజుడికి పచ్చడిగా వాడుకోవచ్చు, బలే రుచిగా ఉంటుంది. ఇందులో వేసిన పచ్చి మిరపకాయ ముక్కలు పులుపుతో ఉడికినవి బలే రుచిగా ఉంటాయి. ఒక ఇడ్లీ తినేవాళ్ళు, నాలుగు తినడం ఖాయం, దబ్బకాయ ఆకలి పుట్టిస్తుంది, నోరు చేదుపోగొడుతుంది. ప్రయత్నించి చూడండి….
గురువుగారూ, హృదయపూర్వక
వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు …
nmraobandi గారు,
APEPDCL వారు ఈ సమయానికి కూడా మాపై కరుణ చూపలేదు. లో వోల్టేజ్ సమస్య మమ్మల్ని వదలలేదు, ఏ,సి పని చెయ్యదు. మేము కరంట్ దాని గురించి మాత్రమే వారినడుగుతాం. మిగిలినవన్నీ మాకు సోలార్ మీదే పని చేస్తాయి. మరి మా ఖర్మ దగ్గరగా నెలరోజులుగా కాల్చుకు తింటున్నారు, ఇది చిన్న మాట.
ఈ సందర్భంలో 55 వివాహ వార్షికోత్సవమే మరచిపోయాం. ఒకమొన్న రాత్రి మనవరాలు గుర్తు చేసింది. ఉదయానికి జిలేబిగారు బ్లాగ్ లో అభినందనలు తెలపడంతో…
మీ అభిమానానికి
మీ అభినందనకి
ధన్యవాదాలు.
ఆదర్శప్రాయమైన మీ దంపతులకు,
వివాహ దినోత్సవ శుభాకాంక్షలు.
అనామకంగారు,
మీ అభిమానానికి
మీ అభినందనకి
ధన్యవాదాలు.
ముచ్చటైన మిధునానికి పెళ్ళి రోజు శుభాకాంక్షలు..:)
చిరంజీవి,ధాత్రి
అమ్మాయ్ చాలా కాలమయింది కనపడి, ఎల్లరున్ కుశలమే 🙂
మీ అభిమానానికి
మీ అభినందనకి
ధన్యవాదాలు.
శర్మ గారూ!మీ దంపతులకు వివాహదిన వార్షికోత్సవ శుభాకాంక్షలు..:-)
sreedevi గారు,
మీ అభిమానానికి
మీ అభినందనకి
ధన్యవాదాలు.
Happy anniversary and mee puraana dampatulaki.
Krishna ji
మీ అభిమానానికి
మీ అభినందనకి
ధన్యవాదాలు.
శ్వాశకోశాలకి చెందిన ఏ వ్యాధి అయిన సరే దబ్బతో దెబ్బకి హతం శర్మ గారు.వో ముక్క దబ్బ తింటే గొంతులోని కాలుష్యం అంత మర్నాడు శేలష్మం తో బయటకి రావలసిందే మరి..వూపిరితిత్హులను శుభ్రం చేయడంలో దబ్బ పాత్ర అమోఘం,అద్వితీయమునూ..ముఖ్యంగా పోగారాయ్యుళ్ళు వారానికి రెండుసార్లు దబ్బ ని తినడం మంచిది..మిగిలిన వారు నెలకి వోక్కసారైన దీనిని రుచి చూడడం ఆరోగ్యప్రదం..
మీ దంపతులకు వివాహ మహోత్సవ శుభ కామనలు..
challa.jayadev Vara గారు,
శ్వాసకోశ వ్యాధులకు దబ్బకాయ మంచి మందని ఇప్పుడే తెలిసింది.
కరంట్ చిత్ర హింసలో 55 వ వివాహవార్షికోత్సవమే మరచాము.
మీ అభిమానానికి
మీ అభినందనకి
ధన్యవాదాలు.
శర్మ గారూ, మీ దంపతులిద్దరికీ వివాహదిన వార్షికోత్సవ శుభాకాంక్షలు.
(తేదీ జ్ఞాపకం జిలేబీ గారి సౌజన్యంతో)
విన్నకోట నరసింహారావుగారు,
APEPDCL వారు ఇప్పటికి కరుణించలేదు. వేడి పాపం పెరిగినట్టు పెరిగిపోతోంది రోజురోజుకీ. కరంట్ వారు మమ్మల్ని చిత్ర హింస పెడుతున్నారు. అందరికి చెప్పుకున్నాం. ఏ జరగలేదు, ఏమైనా మార్పొస్తుందనీ, మా కరంట్ బాగుపడుతుందనీ ఈ లో వోల్టేజ్ తొలగిపోతుందనీ ఆశ.
55 వివాహ వార్షికోత్సవ విషయమే మరచిపోయాం, కరంట్ గోలలో. మీ అభినందనకి
ధన్యవాదాలు.
దబ్బకాయ పొక్కింపు నోరూరించింది 🙂
~లలిత
లలిత జీ
దబ్బకాయ మంచిదండి, ఇప్పుడొస్తున్నాయి 🙂 వాడి చూడండి.
ధన్యవాదాలు.
పెళ్ళిరోజు శుభకామనలు – మీకు, అమ్మగారికి !
లలిత జీ
మీ అభిమానానికి,అభినందనకి,
ధన్యవాదాలు.