శర్మ కాలక్షేపంకబుర్లు-తోడు మాగాయి.

తోడు మాగాయి.

Photo0001

 

ఈ సంవత్సరం మామిడి కాయే లేదు, అక్కడక్కడా కాసిన కొద్దికాయలూ మొన్న తుఫాను గాలికి రాలిపోయాయి. మామిడి కాయలతో రకరకాల ఊరగాయలు పెడతారుగాని తేలిగ్గా అయేదీ,సంవత్సరం నిలవుండేదీ, చాలా మందికి తెలియనిదీ ఈ తోడు మాగాయి.

పుల్లగా ఉన్న మామిడి కాయలు తీసుకోండి, 6 కాయలకే చెబుతున్నా. ఇది రాలుకాయి ఐనా ఫర్వాలేదు. కాయని తురిమెయ్యండి. అందులో సరిపడా ఉప్పు వేసి కొద్దిగా పసుపు పిసరేసి ఉంచండి. కాసేపటికి ఊట వచ్చేస్తుంది. కొంచం వెడల్పుగా ఉన్న పళ్ళెంలో తురిమిన గుజ్జు, ఊట పల్చగా సద్ది ఊటతో సహా ఎండబెట్టండి, కొంచం తడిగా ఉండి ముద్దలా అయిపోతుంది సాయంత్రానికి, అలా కాకపోతే మర్నాడూ పెట్టండి, ఎండలో. మరునాడు ఈ ముద్దకి సరిపడిన కారం,ఉప్పెంత పోశారో కారమూ అంతే , 3 చిన్న చంచాల వేయించిన ఆవాలు  పొడి చేసుకోండి, అలాగే 3 చెంచాల మెంతులూ వేయించి పొడి చేసుకోండి. కారం, ఆవపొడి, మెంతిపొడి ముద్దలో కలిపెయ్యండి. ఉప్పు ముద్దలో వేశారు గనక ఇప్పుడక్కరలేదు. సరిపోకపోతే అంతా పూర్తయిన తరవాత రుచి చూసి కలుపుకోండి. నూనె వేడి చేయండి, నూనెలో ఇంగువ ముక్కెయ్యండి, ఈ నూనెను మాగాయి ముద్దలో వేసి కలిపి మూత పెట్టండి. నిలవచేయండి. సంవత్సరం నిలవ ఉంటుంది, తేలికగానూ అవుతుంది.

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-తోడు మాగాయి.

 1. ఇంకొక “ఊరించే” నోరూరించే పోస్ట్ 🙂

  ఇది చదవగానే ….

  మాగాయే మహా పచ్చడి – పెరుగేస్తే మహత్తరి

  …అన్న వేటూరి గారి పాట / పద్యం గుర్తుకొచ్చింది.

  ~లలిత

  • లలిత జీ,
   ఇది తేలికగాను,తొందరగాను తయారు చేసుకోవచ్చు, సంవత్సరమూ నిలవ ఉంటుంది, అందుకు చెప్పేను.
   ధన్యవాదాలు.

 2. బాగుందండీ మీ మాగాయి ‘టెక్కు’ 🙂

  మాగాయి తొక్కు జేయుట
  బాగా జెప్పిరి జిలేబి బ్లాగున తెలియన్ !
  ఈ గురునికి తెలియని వం
  టే గలదా!వీరి చెంగటే నేర్వవలెన్ !

  చీర్స్
  జిలేబి

  • Zilebi గారు,
   >>>ఈ గురునికి తెలియని వం
   టే గలదా!>>>>
   ములగచెట్టు ఎక్కిచ్చేస్తున్నారు 🙂
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s