శర్మ కాలక్షేపంకబుర్లు-మీసం గొరిగించి….

మీసం గొరిగించి….

”మీసం గొరిగించి వేషం లేదు అన్నట్టు” అనేది ఒక తెనుగునానుడి, అందరికి తెలిసినదే. ఒక చిన్న కత చెప్పుకుందాం. ఒక ఔత్సాహిక సమాజం వారో నాటిక వేస్తున్నారు. నాటకాలలో స్త్రీ పాత్రలు కూడా మగవారే వేయడం రివాజుగానూ ఉండే కాలం. అప్పుడప్పుడే స్త్రీ పాత్రలను స్త్రీలు ధరించడం మొదలైన రోజులు. ఇలా స్త్రీ పాత్రలను పురుషులు ధరించి పేరుగాంచినవారెందరో ఉండేవారు, తెనుగునాట, శ్రీ స్థానం నరసింహారావుగారొకరనుకుంటా, అటువంటివారు.

ఒక సమాజం వారు స్త్రీ పాత్ర ఉన్న ఒక నాటకం వేస్తూ రిహార్సల్ చేయడం మొదలెట్టేరు. అందులో స్త్రీ పాత్రను ఒక నటి ధరిస్తోంది. కాని ఈ స్త్రీ పాత్ర నటించాలనే కోరిక ఉన్న ఒకతను రిహార్సల్స్ కి వచ్చి కూచుని నటి తాలూకు సంభాషణల దగ్గరనుంచి, హావభావాలదాకా పూర్తిగా ఆపోశన పట్టేశాడు. నాటక సమాజంవారికి ఈ సంగతి తెలుసు, అవసరమైతే ఉపయోగపడతాడు అనుకుని ఊరుకున్నారు. నాటకం వేసేరోజొచ్చింది. నటి జాడ లేదు, రాలేదు, ఎదురుచూసి విసిగిపోయారు, నాటకం వేయడం కుదరదేమో ననే భయమూ పడ్డారు, అంతలో ఒకరు గుర్తుచేశారు, మరోనటుడు సిద్ధంగా ఉన్నది. దానితో వారిలో ధైర్యం వచ్చింది, ఇతనికి వేషధారణ చేయాలని అనుకున్నారు, మొదటి అడ్డంకిగా మీసాలు కనపడ్డాయి. మంగలిని పిలిచి గడ్డం మీసం నున్నగా గొరిగించి చీరకట్టేశారు. నటుడు అచ్చంగా స్త్రీ లాగానే నడుస్తుంటే చూసిన వాళ్ళు అమ్మయ్య బతికిపోయామనుకున్నారు. అదిగో అంతలో దిగిందా అసలు నటి. ఇప్పుడేం చేయాలి? సమస్య వచ్చింది. నాటక సమాజం వారు దూరదృష్టితో ఆలోచించి నటిచేతనే నటింపజేశారు. పాపం! నటుడు వేషం కోసం మీసం తీయించుకున్నాడు తప్పించి,వేషం వేయడం కుదరలేదు 🙂 అదిగో అప్పటినుంచి మీసం గొరిగించి వేషం లేదన్నట్టు అనే నానుడి ప్రజలలో మిగిలిపోయి, ఉపమానం స్థాయికి చేరిపోయింది. 🙂

మరోలా చెప్పుకోవాలంటే పిల్లనిస్తామని ఉత్సాహంగా వచ్చినవారు, ఆ తరవాత అబ్బాయి జాతకం అమ్మాయి జాతకం కుదరలెదని చెప్పినట్టు 🙂 అలా చెప్పడం ఎందుకో అర్ధమైందనుకుంటా 🙂

ఇది నేటి రాష్ట్రానికి వర్తిస్తుందనుకుంటా. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి విడదీశారు, ఇప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వడం కుదరదంటున్నారు.

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మీసం గొరిగించి….

 1. ధన్యవాదాలు శర్మ గారూ !
  అప్రతిహతం గా సాగుతున్న మీ ‘ టపా యజ్ఞం ‘ లో టపాలు చూస్తున్నాను , బాగుంటున్నాయి !
  ఒక్కో టపాకూ స్పందన ఇద్దామనుకుని , సమయానుకూలం కాక ఆలస్యం చేశాను ! క్షంతవ్యుడిని !
  అభినందనలు మీకు ! _/\_

  • సుధాకర్ జీ,
   మీతో మెయిల్లో మాటాడాలని చాలా కాలంగా అనుకుంటూ, అలా జరిగిపోయింది.
   బ్లాగులో టపాలు వేయడం, కామెంట్లు చూడడం తప్పించి, మరెవరిని పెద్దగా పట్టించుకోలేకపోయాను. నా పరిస్థితి అలా ఉంది మరి 😦
   ఉన్న కాస్త సమయం సద్వినియోగం చేసుకోవాలని…
   ధన్యవాదాలు

 2. మీసము వేషము బోయెను !
  మోసము ! ఆంధ్ర ! తెలగాణ ! మోజులు తీరెన్ !
  వేషము మార్చెను సెంటరు !
  కాసుల దేవిడి గదోయి కార్యము గాకన్ !

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s