శర్మ కాలక్షేపంకబుర్లు-జ్యోతిషం.

జ్యోతిషం.

కాలం మూడంచెలు, భూత,భవిష్య, వర్తమానాలు. జరిగిపోయినది భూతం, దాని గురించిన వేదన, ఆలోచన నిష్ప్రయోజనం. ఒక సారి దానిని మననం చేసుకుని తప్పు జరిగితే సరి దిద్దుకోడం అవసరం. ఇక భవిష్యత్తు ఎం జరగబోతున్నది, ఇది కుతూహలం. అన్ని దేశాల వారికి, అన్ని జాతుల వారికి భవిషత్తు మీద ఉండే కుతూహలమే జ్యోతిషానికి ఆధారమైంది. ఇది నిజమని కొందరు, కాదని కొందరు అంటూనే ఉంటారు, ఎడ తెగని చర్చలూ చేస్తుంటారు. ఐతే వర్తమానం లో సమీప భవిష్యత్తులో జరగబోయేదానిని చెప్పడమే ’ప్రశ్న’ చెప్పడమంటారు. ఇది సద్యోఫలితాన్నే కనుపింప జేస్తుంటుంది. ఇటువంటి ఒక సంఘటన జరిగినది శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ’అనుభవాలూ-జ్ఞాపకాలూ నూ’ నుంచి, నా మాటలలో, వారు చెప్పిన సంఘటన, మీకోసం.

అది బూరాడపేట సర్వం సహాఅగ్రహారం,శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి బంధువులకు విజయనగర ప్రభువులు ఇచ్చినది. కథాకాలం నాటి ప్రభువు, నాటి దివాన్ బోధతో అగ్రహారాన్ని చిన్నచూపు చూడటమే కాక పన్నుకూడా విధించిన సమయం. సర్వంసహా అగ్రహారమంటే ఆఊరి భూములకు ప్రభువు పన్ను విధించకూడదు, ఆ అగ్రహారంలో ఏరకమైన రాజకీయ సంచలనం ఉండకూడదు, భూములన్నీ అగ్రహారీకుల స్వంతమై ఉంటాయి. ప్రభువు మాత్రం అగ్రహారం యొక్క రక్షణ బాధ్యత వహిస్తాడు.

సంస్థానం అగ్రహారం పన్ను చెల్లించకపోతే నడవలేని స్థితిలోనూ లేదు, అగ్రహారీకులు పన్ను చెల్లించలేని స్థితిలోనూ లేరు. ఇది దివాన్ బోధ మూలంగా మహరాజుకి కలిగిన పంతం తప్పించి, స్వయంగా మాటాడితే తెగని సమస్యాకాదు, కాని పంతాలే ముఖ్యమైపోయాయి. మనం ప్రభువులం, పన్ను వేస్తే అగ్రహారీకులు చెల్లించననటమా ఇదీ ప్రభువుల ఆలోచన. సర్వం సహా అగ్రహారం ఇచ్చిన ప్రభువు కక్కిన కూటికి ఆశించడమేమనీ, పాత తరాల సంప్రదాయం నిలబెట్టనక్కరలేదా అన్నదీ అగ్రహారీకుల భావం. సంస్థానాలు స్వయం ప్రతిపత్తికోల్పోయి తాము కూడా ఆంగ్లేయ కోర్టు లలో వ్యాజ్యాలు నడుపుతున్న కాలం. చివరికి ఈ సమస్య కూడా ఆంగ్లేయుల కోర్ట్ కి చేరింది.

అగ్రహారికులు కోర్టుకి వచ్చారు, జడ్జి బెంచి మీద కొచ్చాడు, ప్లీడర్లంతా లేచి నిలబడ్డారు, జడ్జీ కూచున్నాడు, ప్లీడర్లు కూచున్నారు. కోర్ట్ లోకి అగ్రహారాధాధిపతి ప్రవేశించారు, వకీళ్ళంతా మళ్ళీ లేచి నిలబడ్డారు, ఏం మళ్ళీ లేచారని అడిగాడు ఆంగ్లేయ జడ్జీ, వారు పండితులు, జ్యోతిష నిధి, మాకు పూజ్యులు అన్నారు, అసంకల్పితంగా జడ్జీ కూడా లేచి నిలబడ్డాడు. వారు జ్యోతిష నిధి అనడంతో ఒక ప్రశ్న అడగవచ్చునా అన్నాడు, ఏదీ ప్రత్యక్ష ప్రమాణం తప్పించి నమ్మలేని ఆంగ్లేయుడు. అడగచ్చన్నారు వకీళ్ళు. నేను కోర్ట్ కి వచ్చే సమయానికి ఆవు ఈనుతో ఉంది, ఏ దూడని ఈని వుంటుందీ అడిగాడు. ప్రశ్న శాస్త్రిగారికి అనువదించబడింది, శాస్త్రిగారు గణితం వేసుకుని నోటితో చెప్పనని కాగితం మీద రాసిచ్చారు, ఆ చీటి బెంచ్ క్లార్క్ జడ్జీ సముఖానికి చేరిస్తే, టేబుల్ మీద పెట్టుకున్నాడు. బంట్రోతుని ఇంటికి పంపి వార్త తెలుసుకురమ్మన్నాడు. కోర్ట్ వ్యవహారం నడుస్తోంది, ఈలోగా బంట్రోతు వార్త తెచ్చి జడ్జికి చెప్పాడు. బెంచ్ క్లార్క్ చేత కాగితంలో రాసిన ఫలితం చదివించుకున్నాడు జడ్జీ, తుళ్ళిపడ్డాడు. అనుమానం పీడించింది, మనం మనిషిని ఇంటికి పంపినట్టే వకీళ్ళూ పంపి ఉండచ్చుగా ఇదీ ఆలోచన. అనుమాన నివృత్తికి మరొక ప్రశ్న అడగచ్చా అన్నాడు. ఓ! నిరభ్యంతరంగా అని చెప్పారు ఏకకంఠంతో ఈ సారి వకీళ్ళు. ఈ కోర్ట్ గదికి నాలుగు ద్వారాలున్నాయి. కోర్ట్ సమయం పూర్తయిన తరవాత ఏ ద్వారంలోంచి బయటకు వెడతానో చెప్పమన్నాడు. శాస్త్రిగారికీ ప్రశ్న తర్జుమా చేయబడటమూ ఆయన గణితం వేసుకుని జవాబు కాగితం మీద రాసిస్తే దానిని ఒక కవర్లో పెట్టి సీలేసి జడ్జీ చేతికిస్తే కోటు జేబులో పెట్టుకున్నాడు. కోర్ట్ సమయం అయిపోయింది జడ్జీ బెంచ్ దిగాడు వకీళ్ళ మధ్యకీ వచ్చాడు. ఇప్పుడు ఏ ద్వారం నుంచి బయటికి వెడతాడు, ఉత్సుకత పెరిగిందందరిలో, శాస్త్రిగారి జ్యోతిషం మీద నమ్మకమున్నా ఏదో తెలియని గుబులు, జడ్జి చూశాడు, చూశాడు, గబుక్కున ఒక కిటికీ నుంచి బయటికురికాడు, రండి అని అంటూ. బయటికెళ్ళిన తరవాత కోటులోని కవర్ తీసిచ్చాడు, బెంచ్ క్లార్క్ చదివాడు, ఒక కృత్రిమ ద్వారం గుండా బయటికురుకుతావని ఉంది అందులో, తుళ్ళి పడ్డాడు. ఇదీ భారతీయ విద్యల ప్రాభవం, ఆదరణలేక, అనుసరించేవారు లేక,పోషించేవారు లేక ఈ విద్యలు వెనకబట్టేయి లేదా స్వార్ధ పరుల చేతిలో చిక్కిపోయాయి. కేసేమయిందీ అప్రస్థుతం..

ప్రకటనలు

8 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-జ్యోతిషం.

 1. శర్మ గారు,
  ధన్యవాదాలు. మీ బ్లాగులో ప్రవేశానికి.
  బాగుంది. వారికి కోర్ట్ కేసు ఏమవుతుందో కూడా ముందే తెలిసి ఉంటుంది.

  • bondalapatiగారు,
   ప్రశ్న చెప్పినవారికి తమ కేస్ ఏమవుతుందో తెలియకపోయి ఉంటుందా? కాని శ్రీపాద వారు ఆ విషయాన్నైతే చెప్పలేదు, కేస్ ఏమయిందీ అన్నది అప్రస్థుతం అనే ముగించారీ ఘట్టాన్ని.
   ధన్యవాదాలు.

  • మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యంగారు,

   నాడు బ్లాగ్ మొదలు పెట్టిన రోజు మొదటి కామెంట్ మీదే! ఈ మధ్య కాలంలో చాలా ఒడిదుడుకులకు లోనయి మరలా ఇలా ప్రైవఏట్ బ్లాగ్ మొదలు పెడితే మొదటి కామెంట్ ఇచ్చి ప్రోత్సహించిన మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s