శర్మ కాలక్షేపంకబుర్లు-అధికారం

అధికారం

అధికారంతమునందు చూడవలెగదా ఆ అయ్య సౌభాగ్యముల్ అన్నారో కవిగారు. ఏంటిటా! డబ్బు, అందం, అధికారం, యవ్వనం ఇవ్వన్నీ గర్వాన్ని పెంచుతాయట. ఇవి ఉన్న సమయంలో ఆ వ్యక్తికి స్పృహ ఉండదంటారు. ఏ ఒక్కటి ఉన్నా చాలట, మరి అన్నీ కలిసి ఉంటే చెప్పేదేముందీ! అసలే కోతి, కల్లు తాగింది, ముల్లు గుచ్చుకుంది, దయ్యంపట్టిందన్నట్టు ఈ నాలుగూ చేరితే ఇంక చెప్పేదే లేదూ అన్నారు.

అధికారం ఎలా ఉంటుందీ! దాన్ని ప్రదర్శించడమెలా ఉంటుందీ అన్నదానికి ఒక చిన్న కత పాతదే లెండి…

ఒక ఉమ్మడి కుటుంబం కొడుకు కోడలు తో అత్తమామలూ కలసి ఉంటున్న కుటుంబం. కలిగిన కుటుంబం. అత్తగారిది పైచేయి, సహజమేకదా! ఆవిడే యజమానురాలూ, ఆ ఇంటికి. ఆమె భర్త, కొడుకు ఆవిడ మాటే చెల్లిస్తారు. ఇక ఎటొచ్చీ పై మనిషి కోడలొకతే! అత్తగారు చెరువుకి స్నానానికి, నీళ్ళకి వెళ్ళింది. భర్త,మావగారు బయటికి పనిమీద వెళ్ళేరు, కోడలొకతే ఇంట్లో ఉన్న సందర్భం. ఒక బిచ్చగాడొచ్చి యాచనకోసం అరుస్తున్నాడు, వీధి గుమ్మంలో. కోడలు లోపల పనిలో ఉండి “చెయ్యి ఖాళీ లేదు! పైకెళ్ళూ” అని అరుస్తున్న సమయం. అత్తగారు నీళ్ళ బిందెతో తిరిగొస్తున్న సమయం, బిచ్చగాడు పై ఇంటికి వెళుతున్న సమయం. అత్తగారు బిచ్చగాణ్ణి చూసి “ఏం వెళిపోతున్నావ”ని అడిగింది. దానికి బిచ్చగాడు “లోపల్నించి అమ్మ చెయ్యి ఖాళీ లేదు పై ఇంటికి వెళ్ళ”మంది, అందుకు ముందుకు వెళ్తున్నా అన్నాడు. దానికి అత్తగారు, “వెళిపోమంటే వెళిపోతావా? నా వెనక రా!” అంది. దానికి బిచ్చగాడు ‘ఒహో! ఈ తల్లి బిచ్చం వేస్తుంద’నుకుని వెనకనే వెళ్ళి నిలబడ్డాడు, గుమ్మంలో. బిచ్చమెయ్యమని ఒక సారి అరుస్తూ. అత్తగారు లోపలికెళిపోయింది, ఎంత సేపటికీ బిచ్చం తేదు, విసిగిపోయిన బిచ్చగాడు మళ్ళీ అరిచాడు బిచ్చంకోసం. తీరుబడిగా బయటికొచ్చిన అత్త “చెయ్యి ఖాళీ లేదని చెప్పి పైకి పొ”మ్మంది. “రమ్మన్నావు కదు తల్లీ! బిచ్చమేస్తావనుకుని ఇంత సేపు నీ గుమ్మం దగ్గర నిలబడ్డాను”, అని వాపోయాడు. దానికి అత్తగారు “ఈ ఇల్లు నాది, దీనికి అధికారిని నేను, అదెవతే పొమ్మనడానికి? పెట్టడానికైనా పొమ్మనడానికైనా అధికారం నాది. ఇప్పుడు నేను పొమ్మంటున్నాను, ఫో” అని చెప్పింది.

అదండీ అధికారం ఉన్నవారి సంగతి అలా ఉంటుంది.

అనుభవాలూ-జ్ఞాపకలూనూ

Click on the above link to down load.Courtesy:DLI

శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారి పుస్తకం. వారానికో పుస్తకం ఇద్దామనుకుంటున్నా! మీదైన గ్రంధాలయం కోసం.

ప్రకటనలు

4 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అధికారం

  1. <"అధికారంతమునందు చూడవలెగదా ఆ అయ్య సౌభాగ్యముల్ "
    ————–
    ఈ సూక్తి బోర్డుల మీద వ్రాయించి ఆ బోర్డుల్ని ప్రతి ఆఫీసులోను తగిలించుంచాలంటాను. 35 / 40 సంవత్సరాల తమ సర్వీస్ కాలంలో రోజూ ఈ బోర్డ్ చూస్తుంటే ఉద్యోగుల్లో కాస్తయినా గ్రహింపు వస్తుందని ఆశ.
    లలిత గారు చెప్పినట్లు శ్రీపాద వారి పుస్తకం అందజేస్తున్నందుకు ధన్యవాదాలు. దాదాపు 600 పేజ్‌లున్న పుస్తకాన్ని ఓపికగా స్కాన్ చేసిన మహానుభావుడికి కూడా ధన్యవాదాలు.

    • మిత్రులు నరసింహారావుగారు,
      మనవాళ్ళందరికి తోలు మందం మాటలకీ బోర్డ్ లకీ పనులు కావు, కొడితేనే దిక్కు లేదు. మనవాళ్ళు ఎన్ని శతాబ్దాలయినా మారరుగాక మారరు
      బ్లాగుల్లో ఇదే ఆఖరు కామెంట్ కు జవాబు.

      ధన్యవాదాలు.

  2. మీ బ్లాగ్ కి ఆహ్వానించినందుకు ధన్యవాదాలండీ! శ్రీపాద వారి పుస్తకానికి మరిన్ని ధన్యవాదాలు 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s