శర్మ కాలక్షేపంకబుర్లు-దోసావకాయ

దోసావకాయ

ఆవకాయ,గోoగూర,కొరివికారం అంటే తెలియనివాడు తెనుగువాడేకాదు. ఆవకాయని సంవత్సరానికి ఒకసారే పెట్టుకుంటాం. కథ,కార్యం కనక జరిగితే వందలమంది కనీసం పది పూటలు భోజనాలు చేసేవారు. మరి ఇంతమందికి భోజనాల్లోకి ఆవకాయంటే ఎలా? అందుకే దోసావకాయ. సామాన్య అవసరాలకి కూడా మామిడి దొరక్కపోతే ప్రత్యామ్నాయం దోసకాయే.

Photo0003

దోసకాయ రెండు రకాలు, నక్కదోసకాయ లేక గుంటూరు దోసకాయ, ఇది చిన్నదిగా పసుపుపచ్చగా పైన నల్లటి గీతలుంటాయి. కాయ కొద్దిగా పులుపుంటుంది. రెండవది పందిరిదోసకాయ లేక లంక దోసకాయ. ఇది పొడుగ్గా ఉంటుంది, పండిన కాయ పగులుతుంది కూడా.

DSCN4459

ఇది నదీ పరీవాహక ప్రాంతాల్లో దొరుకుతుంది. వేసవి మాత్రమే దొరుకుతుంది. దోసకాయ ఏదైనా చలవ చేస్తుంది, దీని మరో మంచి గుణం కడుపును ఖాళీ చేస్తుంది, అందుకే దోసతిన్న కడుపు అంటారు, మంచి విరేచనకారి, సంచి దులిపినట్టు కడుపు ఖాళీ చేస్తుంది. 🙂

నక్కదోసకాయని తీసుకుని తరుక్కుని మధ్యలో ఉండే గింజలు వగైరా శుభ్రంగా తీసెయ్యండి. చిన్న ముక్కలుగా తరుక్కోండి. తగిన ఉప్పు,కారం, ఆవ సమానపాళ్ళలో కలిపిన గుండలో నూని పోసి ముక్కలు గుచ్చెత్తెయ్యండి. జాడిలో ముందుగా నూనెపోసి గుచ్చెత్తినవాటిని , నూనెపోసి కలపండి, నిలవచేయండి, ఇది నెల పైగా ఉంటుంది. మరోమాట ఇందులో నిమ్మ రసం పిండుతారు గాని అంతకుమించి మంచిది రుచి కలిగించేది, చింతపండు, చిన్న ముద్దలా ఊరగాయలో వెయ్యండి. నెలరోజులపైన నిలవుంటుంది.

గూడు మారిన కొత్తరికం.

శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారి పుస్తకం.Click on and down load

ప్రకటనలు

12 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దోసావకాయ

 1. నా వెంటపడీ‌ వేధిస్తున్నారండీ. సులభంగానే గమనించవచ్చును ఆ విషయాన్ని. ఇబ్బందిపెట్టేవాళ్ళూ, ఇబ్బందులు పడే వాళ్ళూ, నిర్లిప్తంగా చోద్యం చూసేవాళ్ళూ అనే విధంగా విడిపోయినట్లుంది తెలుగు బ్లాగులలోకం.

  • syamaliyamగారు,
   మీకు చెప్పగలంతవాడిని కాదుగాని,
   ఆత్మ బుద్ధి సుఖంచైవ

   చెప్పడం అనవసరం చేసేయడమే

   ధన్యవాదాలు.

 2. దోసావకాయ టైటిల్ , ఆ ఫోటో చూడగానే దోసావకాయ తిన్నంత అనుభూతి కలిగి చదవటం మొదలు పెట్టాను సార్, తీరా చదివాక మారు వడ్డింపు కి ఎదురు చూస్తున్నా. 😊 _/\_

 3. ఫంక్షన్స్‌లో దోసావకాయ ప్రశస్తి చెప్పేదేముంది!
  దోస ఉపయోగం మరొకటి కూడ ఉందండి. ఎండబెట్టిన దోసకాయ గింజలతో అన్నంలో కలుపుకు తినటానికి పొడి తయారుచేసుకుంటారు. నువ్వులపొడి తయారుచేసుకునే విధానమే దీనికిన్నూ అని అంటారు. వేడి అన్నంలో కలుపుకుని (తినేవాళ్ళు నెయ్యి కూడా వేసుకుని) తింటే అద్భుతః 🙂. నెల్లూరు సైడ్ చాలా పాప్యులర్; నెల్లూరు పట్టణంలో మెయిన్ బజారులో ఎండబెట్టిన దోసగింజలు అమ్మే దుకాణాలు ఉన్నాయి(ట).

  • మిత్రులు నరసింహారావుగారు,

   కోపం ముంచుకొచ్చింది 🙂 సాధారణంగా సంయమనం కోల్పోను, అలా జరిగిందంతే!

   నా ప్రైవేట్ బ్లాగులోకి జొరబడ్డానికి ప్రయత్నాలు జరిగాయి. బ్లాగులో ఏముంటుంది? ఎత్తుకుపోడానికి. 🙂 నా ఫేస్ బుక్ అక్కౌంట్లోకి కూడా జొరబడ్డానికి ప్రయత్నం జరిగిందని ఉదయమే ఫేస్ కబురు చెప్పింది 🙂

   ఆలోచిస్తే అనిపించింది, ఇద్దరు మాత్రమే వెంటపడతారు,ఒకరు అభిమానిస్తున్నవారు, రెండవవారు ద్వేషిస్తున్నవారు, మరి వీరెవరో 🙂

   దోస గింజల కథ పెద్దదే, లేపన శక్తి తగ్గుతుందని దోసగింజలు తినడానికి భయపడతారు 🙂

   సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పుస్తకం నుంచి దిగుమతి చేసుకున్నది. చాలా పుస్తాకాలున్నాయి. వీలుబట్టి….
   ధన్యవాదాలు.

 4. మీ బ్లాగులో ప్రవేశించడానికి నాకు కూడా ఆహ్వానం పంపించినందుకు ధన్యవాదాలు శర్మ గారు (ఆహ్వానపు ఇ-మెయిల్ చూడటం ఆలస్యమయింది). ఎప్పటిలాగే మీ బ్లాగుపోస్టులతో అలరిస్తుంటారని ఆశిస్తాను. 🙏

  • మిత్రులు నరసింహారావుగారు,

   నాకూడా రాకురోయ్ అంటే నన్నెత్తుకోరోయ్ అని ఏడ్చినట్టు అని ఒక నానుడి చెబుతారు. ప్రైవేట్ బ్లాగ్ చేస్తే పైమాటగా, ఇప్పటికే నా బ్లాగులోకి వచ్చిన ముఫ్ఫై ఐదు మందిలో ఒకరో, నన్నెత్తుకోమని వెనకబడుతున్నవారో దొంగపేరుతోనో చొరబడ్డారని ఇదిగో సాక్ష్యం. ఎందుకు నా వెనకపడుతున్నారిలా?

   ప్రైవేట్ భాయ్ సబ్ ప్రైవేట్
   ఓవరు యాక్షను జిలేబి ఊసుల జూడన్
   మావిన కాయకు కారము
   లావగు ఆ ఆవకాయ లన్నియెవరివీ ?

   జిలేబి
   ఇప్పటికే కొన్ని ప్రోగ్రాం చేసిన టపాలున్నాయి, అవి ప్రచురింపబడతాయి. ఇక ముందు బ్లాగులోకే రాను గాక రాను, రాను,రాను.

   నా ఆహ్వానం మన్నించి వచ్చిన వారందరి దగ్గర మన్నింపు కోరుతున్నా!
   ధన్యవాదాలు.

   • కొందరు దొంగపేర్లతో ఎందుకు వెనుకబడుతున్నారూ అంటే వారి స్వభావం అటువంటిది కనుక, స్వభావో దురతిక్రమణీయః అన్నారు కదా. ఎందరు పోలీసులున్నా దొంగలు అందరూ పరారౌతున్నారా చెప్పండి. ఏదో రకంగా వేషాలు వేస్తూనే ఉంటారు.

    మీరు అటువంటి వారిని గుర్తించి ప్రక్కకు నెట్టండి. వారిని విసర్జించటంలో మీ నిర్ణయాన్ని ఎవరూ ప్రశ్నించరు. ప్రశ్నించలేరు కూడా.

    మీరు నొచ్చుకుంటే మాకు గుచ్చుకుంటుంది. దయ ఉంచండి.యథాప్రకారం వ్రాస్తూనే ఉండండి. కలుపు మొక్కల్ని ఖండించి కృషీవలుడు పంటను కాపాడుకున్నట్లు మీరు కూడా మాకోసం కొంచెం శ్రమతీసుకొని చెడుని త్రోసివేసి మాకు మంచి మాటలు చెబుతూ ఉండండి.

    దయచేసి మీ సత్యాగ్రహం వదలి పెట్టండి మా మేలు కోసం.

   • శ్యామలీయం గారు మీ టపా చదివాను. బాగా చెప్పారు. కానీ చెవిటి వారి దగ్గర శంఖం ఊదుతున్నట్లే!! నిజమే చాలా కష్టం వేసింది కష్టేఫలి వారి గురించి మాటలు చదువుతుంటే. ఖండించిన కొద్దీ ఇంకా మాట్లాడతారండీ. అదే వినోదం ఇలాంటివి వారికి. అందుకే నచ్చనివి ఎవరైనా వ్రాస్తున్నా పెద్దగా ఖండించడం మానేసాను. మంచి చెప్తున్నా నచ్చట్లేదు కొందరికి. మెప్పుదల వస్తోంది అంటే వెను వెనకాలే అసూయ ఉండనే ఉంటుంది.

   • మిత్రులు శ్యామలీయంగారు,

    ఒక క్షణం కోపంలో సంయమనం కోల్పోయినమాట వాస్తవం, వీలున్నవరకు….

    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s