శర్మ కాలక్షేపంకబుర్లు-దేవిడీ మన్నా!

Bful waterfall

Courtesy: Owner

దేవిడీ మన్నా!

’దేవిడీ’, ’మన్నా’ అనేవి రెండు హిందీ మాటలు. దేవిడీ అంటే కోట అని మన్నా అంటే నిషేధమనీ అర్ధం. ఈ మన్నా కి దగ్గరగా ఉండే మాట ’మాన్ నా’ అనగా గౌరవించడం, మన్నించడం. కోట మన్నించడం, నిషేధించడమేంటనికదా అనుమానం. రాజుగారు నిషేధించడం, మన్నించడమని అర్ధం, అంటే కోటలోకి ప్రవేశం నిషేధం,’దేవిడీమాన్ నా అంటే ఆశ్రిత వర్గమైనా కోటలోకి ఆహ్వానం లేక రావక్కరలేదు, ఇది మర్యాద. ఈ దేవిడీ మన్నా గురించిన రసవత్తరమైన ఒక కథ ఉంది, నిజంగా జరిగినదే. దీని గురించి శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు రాసిన కథ ఒకసారి చదివానెక్కడో, మళ్ళీ దొరకలేదది, గుర్తుండిపోయింది. ఆ కథని నా మాటలలో మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా! కొంత నేను కల్పించి ఉండచ్చు కూడా.

అది విజయనగర సంస్థానం . సంస్థానంలో కవులు, కళాకారులు, గాయకులు,నటులు ఇలా లలితకళల లోనూ, సాహిత్యంలోనూ కాకలు తీరినవారు, ఉండేవారు. ప్రభువులు వీరిని సత్కరిస్తూ ఉండేవారు. కవులు,పండితులు, నటులు గాయకులు నిత్యమూ రాజ దర్బారుకు రావడం ఆనవాయితీ, అలాగే అందరూ వార్షికాలు (ఈ నాటి నెలజీతాలు) కోటలో తీసుకోవడమూ ఆనవాయితీ. శ్రీనడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి గారు,బహు గ్రంధ కర్తా మహామంత్ర శాస్త్రవేత్త కూడా. వీరెప్పుడూ దర్బారులో కనపడిన దాఖలా లేదు. కవి,పండిత,గాయక,నటులందరితోనూ దివాన్జీకి పరిచయమే! వీరికీ దివాన్జీ దగ్గర చనువే! ఏ కాలంలోనైనా, కొందరు అసూయాపరులుండడం సర్వ సహజం. దేవిడీకి రాకుండా ఉండడమేగాక వార్షికం కూడా శాస్త్రిగారికి ఇంటికి పంపడం కూడా అలవాటు, ఇది అసూయకు బలకరం. దీనితో కొంతమంది అసూయాపరులకు కడుపే మండిపోయింది. నెమ్మదిగా గుసగుసలు బయలుదేరాయి, ”ఏంటి ఈయనగొప్పా? దేవిడీకి రారు, ప్రభువు పల్లకీ పంపితేగాని, కనీసం పట్టణంలో కూడా పదచలనం చేయడియన, అంతెందుకు వార్షికానికి కూడా దేవిడికి రాడు, ఏంటొ అంత…” ఇలా అసూయాపరుల గుండెలలోని మాట నెమ్మదిగా దివాన్జీకి, దివాన్జీనుంచి మహరాజుకి చేరాయి. ”వీరి విద్వత్తు ఏమో ఎవరికి తెలియదు, మహా మంత్రవేత్త అని అంటారు, ప్రత్యక్ష నిదర్శనం లేదు, ఎలా? ఏం చేయాలీ, పరీక్ష పెట్టాలి వారి విద్వత్తేమిటో తెలుసుకోవాలి”, ఇది పైమాట, కాని ”ఈ పరీక్షలో ఆయన ఓడిపోవాలి, అవమానం పాలవాలి అన్నదే ఊహ”. పరీక్ష ఎలా పెట్టాలి, తెలియదు, అందులో ప్రవేశమే లేనివారు పరీక్ష ఎలా చేయగలరు? గుంజాటన పడి చివరికి శాస్త్రి గారికి కబురే పంపారు, మహరాజు దర్శనానికి దయచేయమని, తరవాత సంగతి మహరాజే చూసుకుంటారని. ఇది నిజంగానే అగౌరవపరచడం, మహరాజు దర్శనం ఇప్పించమన్నారని పల్లకీ పంపితే అది గౌరవానికి చిహ్నం, దర్శనానికి రమ్మనమంటే అది సేవక సంబంధం. ఇది కానుకోలేకపోయారు, అసూయాపరులు. కాని శాస్త్రిగారు తొట్రు పడలేదు. మర్నాడొస్తున్నామని తిరిగి కబురంపేరు శాస్త్రిగారు. మర్నాడు సభ తీరింది, అందరూ ఎదురు చూస్తున్నారు, శాస్త్రిగారు ఉదయమే అనుష్ఠానం ముగించుకుని పారాయణ, ఉపాసన పూర్తిచేసుకుని పట్టుపంచతో, మరో పట్టుపంచ పైపంచగా,ముఖాన విభూది రేఖలతో, నుదుట బొట్టుతో, కాళ్ళకు పాముకోళ్ళతో, చేత కమండలం ధరించి వీధిలోకొచ్చారు, అపర ఈశ్వరునిలా. వారిని చూచిన పౌరులు ఎక్కడివారక్కడే ఆగి దారిచ్చేశారు. పాముకోళ్ళు చేస్తున్న లయబద్ధమైన శబ్దంతో కోటలోకి ప్రవేశించారు, కక్ష్యలు దాటుతుంటే సైనికులు బారులు తీరి నిలబడ్డారు, నిశ్శబ్దంగా. రాజదర్బారు కోలాహలంగా ఉంది, పాముకోళ్ళ లయబద్ధమైన శబ్దం వినబడగానే నిశ్శబ్దమైపోయింది. మహరాజు ఆహ్వానం, శాస్త్రిగారి ప్రత్యుత్తరం ఐన తరవాత ‘తమ మంత్ర శాస్త్ర ప్రతిభ చూడాలనుకుంటున్నా’మని మనసులో మాట చెప్పేశారు, ప్రభువు, పరిక్ష ఎలాపెట్టాలో తెలియక. శాస్త్రిగారు ”బంగారంను కోడిగుడ్డులా లేదా గుండ్రని ముద్దలా చేయించి సభకు తెప్పించండి, రేపు ఉదయమే అనుష్టానం ఐన తరవాత ఇదే సమయానికి వస్తా”నని చెప్పి వెళ్ళిపోయారు. ”బంగారం ముద్ద గాల్లో తేలుస్తాడా? నీళ్ళలో తేలుస్తాడా?” ఇది అసూయాపరుల ప్రశ్న.

తెల్లవారింది రాజుగారి ఆజ్ఞ మీద బంగారపు ముద్ద కోడి గుడ్డు ఆకారంగా తయారు చేయబడి సిద్ధంగా ఉంది, మహరాజు ఎదుట, కొలువులో. ఈ వార్త పట్టణమంతా తెలియడంతో జనం బారులే తీరారు, ఏం జరుగుతుందో చూడాలని ఉత్సుకతతో. అనుష్ఠానం పూర్తి చేసుకుని శాస్త్రిగారు బయటకొచ్చారు, నిన్నటి ఆహార్యంతోనే. పౌరులు బారులుతీరి శాస్త్రిగారికి దారిచ్చారు. పాముకోళ్ళ టక టక శబ్దం వినిపించడంతో సభలో సూది పడితే వినిపించేటంత నిశ్శబ్దం ఆవరించింది. శాస్త్రిగారు ఎవరినీ కన్నెత్తి చూడలేదు, పన్నెత్తి పలకరించలేదు. తిన్నగా కోడి గుడ్డులా ఉన్న బంగారం ముద్ద దగ్గరకెళ్ళి ఏదో పఠించినదానికి గుర్తుగా పెదవులు కదిలించి కమండలంలో నీరు మంత్రించి బంగారపు కోడిగుడ్డు మీద ప్రోక్షించారు, అంతే అప్పటివరకు నిశ్శబ్దంగా ఉత్సుకతతో చూస్తున్న సభ్యుల గుండెలు జలదరించేలా టప్ మనేశబ్దంతో బంగారపు కోడి గుడ్డు రెండు ముక్కలయింది. అంతే శాస్త్రిగారు వెనుతిరిగి చూడక పాముకోళ్ళు టకటకలాడించుకుంటూ సభను విడిచి పెట్టేరు. అప్పుడుగాని సభ్యులు తేరుకోలేకపోయారు, ఒక్క సారిగా సభ కళవెళ పడిపోయింది, గొల్లుమంది. ”ఇదో గారడి విద్య” అన్నవారు, ”చాలుచాలు మనకి తెలియనివన్నీ గారడీ విద్యలేనా?” అని ఖండించినవారు, ఇలా సాగిపోతోంది చర్చ కొలువులో. దివాన్జీ, ప్రభువు తేరుకున్నారు జరిగిన సంఘటన నుంచి.

ఇప్పుడు చర్చ ప్రారంభమయింది అసూయపరులలో, ఏం చేయాలి? ఏదో చేయబోతే ఏదో అయిందే! అమ్మో ఆయనకి కోపమొస్తే ఇలాగే మంత్రజలం జల్లి అందరిని ముక్కలుచేస్తాడా? ఇది మహారాజుకే ప్రమాదం, భయం పాదుకొల్పేరు, దివాన్జీ మనసులో. అది నెమ్మదిగా పెరిగి పెద్దదయింది,నెమ్మదిగా ప్రభువుకూ చేరేశారు. ఇక్కడ జరుగుతున్న కుట్ర గురించి శాస్త్రిగారి అభిమానులు ఆయనకు వార్త తెలియ జేస్తూనే ఉన్నారు. చిత్రమైన చిక్కు సమస్యలో చిక్కుకున్నారు, దివాన్జీ, అసూయాపరులూ, మహరాజుతో మరీ చెబితే మంగళహారతే ఇవ్వవచ్చు,చెప్పిన వాళ్ళకి, చేసిన వెధవ పనికి. శాస్త్రిగారిని సభలో అవమాన పరచి న్యూనత పరుద్దామనుకున్నవారికి దొరికినదొకటే మార్గం పొగడడం, అది చేసి ప్రభువు చేత సత్కార కార్యక్రమం చేసి, పల్లకీలో ఊరేగించి, శాస్త్రిగారిని సన్మానింపజేసి, మహరాజుచేత, ’దేవిడీ మాన్ నా’ పత్రం ఇప్పించేసేరు, అంటే ప్రభువు పల్లకీ పంపించి ఆహ్వానం పంపేదాకా శాస్త్రిగారు రాజ సభకి రానక్కరలేదు, ఇదో గౌరవం, ఒక రకంగా, మరోరకంగా దేవిడీ మన్నా!

అసూయా ద్వేషాలకెవరూ అతీతులుకారు, నాడూ, నేడూ కూడా. చదువుకున్నవారిలో ఇవి వెర్రితలలే వేస్తున్నట్టున్నాయి.నేటి కాలంలో మన బ్లాగులలోనే ఇవి నగ్నంగా నాట్యమే చేస్తున్నట్టున్నాయి, కనీసం దాచుకోను కూడా దాచుకో లేకపోతున్నారు, తీరికగా ఆలోచిస్తే నవ్వే వస్తోంది, వీరి ప్రవర్తన.

Maha Bharatham Vol 1 Adi Parvam P-1Maha Bharatham Vol 2 Adi Parvam P-2Maha Bharatham Vol 3 Sabha ParvamMaha Bharatham Vol 4 Aranya Parvam P-1Maha Bharatham Vol 5 Aranya Parvam P-2Maha Bharatham Vol 6 Virata ParvamMaha Bharatham Vol 7 Udyoga ParvamMaha Bharatham Vol 8 Bheshma Parvam

మహాభారతం అనగానే మరో ప్రచురణ అనుకుంటాం, అలాకాదు.

తిరుపతి తిరుమల దేవస్థానం వారు ప్రచురించిన ఆంధ్రమహాభారతం. కవిత్రయంది, విశేశమే ఉన్న ప్రచురణ. ప్రతి పర్వంలో పాత్రలూ వాటి విశ్లేషణా, మొత్తం భార్త కథా విధానం, మొత్తం అన్ని వివారాలూ చర్చ చేసిన గ్రంధం. చదివి తెలుసుకోవలసిన విషయాలెన్నో 

Total 15 books and 8 are uploaded remaining will be given later

 

 

 

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-దేవిడీ మన్నా!

  1. పుల్లెల శ్రీ రామ చంద్రులు గారి వాల్మికి రామాయనము(తాత్పర్యాలతో) ఉంటే మా తో పంచుకోగలరు

    ధన్యవాదములు

  2. గురువుగారూ… భారతం లింకులు పని చేయడం లేదు… సవరించగలరు.

    (కొన్నాళ్ళ క్రితం ఇలాగే అడిగితే, సవరించాక డౌన్‌లోడ్ చేసుకున్నారా అంటూ విచారించారు… కానీ నేను జవాబివ్వలేదు. క్షమించాలి. ఈ భారతం వరకూ ఇచ్చినవన్నీ దింపుకున్నాను)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s