శర్మ కాలక్షేపంకబుర్లు-శకునం చెప్పే బల్లి….

శకునం చెప్పే బల్లి….
ఊరు అందరికి శకునం చెప్పే బల్లి కుడితె తొట్లో పడి చచ్చిందని నానుడి.

బల్లి పలుకు అని ఒక శాస్త్రం చెప్పడం అలవాటుంది. ఏదేని కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు బల్లి పలికితే దానికి ఫలితం చెబుతారు. బల్లి పలుకుతుందా? బల్లి శబ్దం చేస్తుంది మనం వినం, వినేంతగా మన శ్రవణేంద్రియం ఎందుకు పని చెయ్యటం లేదో చెప్పలేను. ఇలా బల్లి ఫలితాలు చెప్పేదే, అనగా భవిష్యత్తు చెప్పేదే… కాని దీనికీ ఆకలుంటుందిగా…. ఇది పురుగుల్నే తింటుంది. పురుగులెక్కడ దొరుకుతాయి? గోడ్లమీదుండే బల్లికి? తక్కువే… అందుకుగాను ఇది పశువులకి పెట్టే కుడితి తొట్టి దగ్గరకి చేరుతుంది. కుడితి తొట్టి తెలీదు కదూ! చెబుతా!! రెండడుగుల వ్యాసంతో అడుగున్నరలోతుతో ఒక తొట్టెను తయారు చేస్తారు. ఇది అడుగున తక్కువ వ్యాసంతోనూ అపైకి వచ్చే కొద్దీ ఎక్కువ వ్యాసంతోనూ ఉంటుంది. దీనిని కఱ్ఱతో చేస్తారు. ఇందులో గంజి,మినపపొట్టు, చిట్టు, నూకలు, బియ్యం కడిగిన నీళ్ళూ దీన్ని ’కడుగు’ అంటారు, ఇలా మానవులు బలవర్ధకమైనవన్నీ కుడితి తొట్టిలో పోసి మిగిలినది తింటుంటారు. పశువు ఈ కుడితిని తాగుతుంటుంది. ఇక్కడికి ఈగలు బాగా చేరతాయి. మరి ఈ ఈగల్ని తిని ఆకలి తీర్చుకోడానికి బల్లి ఇక్కడికి చేరుతుంది. బల్లి ఎంతటి నున్ననైన ప్రదేశం లో నైనా చురుగ్గా సాగగలదు, పరుగూ పెట్టగలదు. కాని ఈగల్ని తినాలనే తొందరలో జారి కుడితితొట్టిలో పడిపోయింది. దరిచేరే మార్గం లేదు, ఈతా రాదు…ఏమయింది, కుడితిలో పడి…….. అందరికి శకునం చెప్పేదే అయినా తన జాతకం కుడితిలో పడిచచ్చేది బల్లికి తెలియలేదు… అందుకే ఊరందరికి శకునం చెప్పే బల్లి కుడితితొట్టిలో పడిచచ్చిందని నానుడీ….

=====================================================

Maha Bharatham Vol 9 Drona Parva

Maha Bharatham Vol 10 Karna Parvam

Maha Bharatham Vol 11 Shalya Sowptika Stri Parvam

Maha Bharatham Vol 12 Santi Parvam P-1

Maha Bharatham Vol 13 Santi Parvam P-2

Maha Bharatham Vol 14 Anushasanika Parvam

Maha Bharatham Vol 15 Aswamedha Asramavasa Mousala Mahaprasthanika Parvam

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-శకునం చెప్పే బల్లి….

 1. పుల్లెల శ్రీ రామ చంద్రులు గారి వాల్మికి రామాయనము(తాత్పర్యాలతో) ఉంటే మా తో పంచుకోగలరు

  ధన్యవాదములు

 2. ఈ సామెత విన్నాను కానీ అర్ధం ఇప్పుడే తెలిసింది తాత గారూ. ఈ మహాభారతం పుస్తకం ఎక్కడ దొరుకుతుందండి ?

  • చి.స్వాతి,

   భారతం పుస్తకాలు తిరుమల కొండమీద గుడి ఎదురుగా మెట్ల మీదున్న షాప్ లో దొరుకుతాయి.
   ధన్యవాదాలు.

 3. < "…… ఇలా మానవులు బలవర్ధకమైనవన్నీ కుడితి తొట్టిలో పోసి మిగిలినది తింటుంటారు."
  ——————-
  హ హ్హ హ హ్హ శర్మ గారూ, మనుష్యుల తిళ్ళ గురించి ఒక్క మాటలో భలే చెప్పారు 😀😀. అలాగే మంచి పాట కూడా గుర్తు చేశారు. మీ ఆరోగ్యం కుదుటపడిందని తలుస్తాను.

  • విన్నకోట నరసింహారావు గారు,
   అప్పుడు కుడితోలో పోసేవారండి, ఇప్పుడు చెత్తలో పోస్తున్నారండి.
   ఆరోగ్యం బండి నడుస్తోందండి.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s