శర్మ కాలక్షేపంకబుర్లు-మంచి మిత్రుడు

nature

Courtesy:Owner

మంచి మిత్రుడు

మిత్రుడు అంటే మన సుఖం, ఆనందం కోరేవాడూ కలిగించేవాడూ కూడా. జీవితంలో భగవంతుడిచ్చిన స్నేహితుడు/స్నేహితురాలు భార్య/భర్త మాత్రమే. వీరిని మించి మన మంచి అనునిత్యం కోరేవారెవరూ ఉండరు. మనకు కనపడకుండానే మనను,మన మనసును ప్రభావితం చేసి, జీవితంలో మంచి మార్గం చూపేదే పుస్తకం. అదే నమ్మకం సడలినవేళ ధైర్యాన్నిచ్చే స్నేహితుడు. ప్రతిజాతికి తమవైన గ్రంధాలు ఉంటూనే ఉంటాయి. ఏ జాతివారు వారివారి గ్రంధాలను బహు శ్రద్ధగా పారాయణ చేస్తారు, అది తప్పూ కాదు. మనవైన గ్రంధాలు, జాతిని ప్రభావితం చేసేవి మూడు, శ్రీరామాయణం, మహా భారతం, భాగవతం. చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం, కాని ఈ గ్రంధాలు చదవడానికి మనకు తీరుబాటుండదు, కారణం ఇందులో కథను చాలా సార్లు విని ఉండడం, సినిమాల్లో తీసిన అపభ్రంశాలే నిజమనుకోవడం, అదిన్నీ గాక వీటిమీద అనేక రకాలైన వివాదాలుండడంతో వీటిని చదవడమే వివాదం అన్న భావనకూ వచ్చినవారూ ఉన్నారు. వీటిలో ఏముందో చదవండి, పద్యమూ అర్ధమూ, శ్లోకమూ అర్ధమూ ఉన్న పుస్తకాలున్నాయి. కొన్ని కొన్ని ప్రక్షిప్తాలూ కనపడతాయి, వాటిని తరవాత చేర్చబడినవిగా గుర్తించలేనంత గొప్పగానూ కలసిపోతాయి. నేటి కాలానికి సరి పడనివి కనపడ్డాయనుకోకండి. అవి నాటి కాలానికి ధర్మాలు. మనకు తెలియనివన్నీ తప్పులనుకోకండి.

అన్ని పుస్తకాలూ కొనుక్కోలేం, కొనుక్కోడానికి వీలున్నా, దాచుకోడానికి చోటూ లేదు, నేటి కాలాన్ని బట్టి. కొన్ని కొనుక్కున్నా చాలావాటిని ఈ పుస్తకాలుగా సేకరించుకుని దాచుకుని చదువుకోడానికి వీలుగానే, నేనిస్తున్న గ్రంధాలు. ఈ పుస్తకాలు దొరవని పెడుతున్నారా అని అడగచ్చు. ఈ పుస్తకాలు దొరుకుతాయి, కాని వీటిని వెతకడంకోసం మీరు సమయం వెచ్చించక్కరలేకుండా, మీకు అందుబాటులో ఉంచాలనేదే నా తాపత్రయం, వద్దనుకుంటే మానేస్తా! శ్రీ రామక పాండురంగ శర్మగారు పుస్తకాలని డిజిటల్ లైబ్రరీ నుంచి సేకరించి వారి బ్లాగులో చాలా కాలంగా పెడుతున్నారు. లింక్ లు ఇస్తున్నారు. డిజిటల్ లైబ్రరీ పని చేయక, ఎప్పుడు పనిచేస్తుందో తెలియక ఇబ్బందులు పడకూడదని, పుస్తకాలు దిగుమతి చేసుకుని మళ్ళీ బ్లాగులో పెడుతున్నా.

కాలాన్ని ఎలాగైనా గడిపేయచ్చు, నాకైతే ఇలా గడపడం బాగుంటుందనిపించింది. కాలానికి మిత్రుడు, శత్రువు లేరు. మనదైన కాలాన్ని పొదుపుగా నలుగురికి ఉపయోగపడేలా గడపడమే నాకిష్టం.దేవుడిచ్చిన మిత్రులతోనూ పుస్తకంతోనూ గడపడమే ఇష్టం, కాదనుకుంటే మీ ఇష్టం.

ఇంత మంచి మిత్రుణ్ణి వదలుకోలేను.

sandhi vigraham

3 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మంచి మిత్రుడు

  1. సర్,
    శ్రీ రామకపండురంగా శర్మ గారి బ్లాగ్ లింక్ చెప్పగలరు. నేను ఆ బ్లాగ్ వెతికి విఫలుడ్ని అయ్యాను. దయచేసి వివరించగలరు.
    నమస్కారములతో
    అ.వ. రమణ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s