శర్మ కాలక్షేపంకబుర్లు-కరకజ్జం.

కరకజ్జం.

పల్లెలలో తీర్థాలలో నేటికి బాగా అమ్ముడు బోయేవి జీళ్ళు, కరకజ్జం, పంచదార చిలకలే. జీళ్ళు మనం చేసుకోడం తేలికైన పనేంగాదు, జీళ్ళు చేసుకోడానికి పాకం పట్టడం తెలియాలి, ఆపై ఓపిగ్గా మేకుకేసి లాగాలి, బాగా సాగుతుంది, అందుకే జీళ్ళ పాకంలాగా అంటారు 🙂 ఇక పంచదార చిలకలూ అంతే మనం తయారు చేసుకోలేం. ఇక కరకజ్జం దీన్ని బెల్లం కొమ్ములు అనికూడా అంటారు, ఇంట్లో తయారు చేసుకోవచ్చు అదెలాగంటే,,,,

శనగ పిండి తీసుకుని దానిలో పదోవంతు బియ్యపుపిండిగాని మొక్కజొన్న పిండిగాని కలపాలి, నీటితో తడిపి ముద్ద చేసుకోవాలి, అదెలా ఉండాలంటే జంతికిలగొట్టంలో పెట్టి నొక్కితే బయటికి వచ్చేటంతగా, ఒక అంగుళం సైజులో ముక్కలుగా చేసుకోవాలి.

జంతికలు తయారు చేసుకోడానికి ఉపకరణం ఉంటుంది, దాన్నే జంతికిల గొట్టం అంటాం, ఈ గొట్టం రెండు భాగాలు సోలలా ఇనుముతో తయారు చేసిన రెండు భాగాలు, ఒక దానిలో ఒకటి ఇమిడిపోతుంది, భార్యా భర్తలలా. పెద్దదానికి మట్టులో ఖాళీ ఉంటుంది, అందులో కావలసిన సైజులో, ఆకృతిలో పిండి బయటకు వచ్చేందుకు చిల్లులున్న బిళ్ళలుంటాయి, అలా లావుగా గుండ్రంగా గాని నలుపలకలుగా గాని పిండి దారంలా బయటకి వచ్చేటట్టు ఉన్న బిళ్ళనే కరకజ్జం బిళ్ళ అనీ అంటారు, మొత్తానికి ఆ ఉపకరణం పేరు మాత్రం జంతికిల గొట్టం 🙂

పిండిని గొట్టంలో వేసుకుని కాగుతున్న నూనెలో తిన్నగా వేసేయచ్చుగాని అలా ముక్కలుగా వేయడానికి సమయం పడుతుంది గనక వేపులో తేడా వస్తుంది, అందుకు గొట్టం లో పిండి వేసి ఒక పీట మీద పిండిని సన్నగా పొడుగ్గా వేసుకుని,దానిని అంగుళం సైజు ముక్కలుగా కోసుకుని అన్నిటినీ ఒకసారి నూనెలో వేయించి, బంగారం రంగుకి వచ్చేకా తీసుకోవాలి. బెల్లాన్ని పాకం పట్టుకు ఉంచుకోవాలి, ఇది ముదురు పాకంగా ఉండాలి, బెల్లంతో చేసిన కొమ్ములే బాగుంటాయి, పంచదారతో సాధారణంగా చేయరు. అందులో ఈ ముక్కలు వేసుకుని బాగా కలపాలి, లేకపోతే అన్ని ముక్కలకీ బెల్లం సమానంగా పట్టదు. బాగా కలిపి అన్ని ముక్కలకీ బెల్లం బాగా పట్టిందనుకున్న తరవాత దానిని అలా వదిలేస్తే బెల్లం ముక్కలకి అంటుకుపోయి, ఆరిపోతుంది. వీటిని నిలవ చేసుకోవచ్చు. బహుశః ఇప్పుడు నాగరికులెవరూ ఇటువంటివి తినటం లేదేమో!!!

The Monk Who Sold His Ferrari_Robin S. Sharma

ప్రకటనలు

7 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కరకజ్జం.

 1. కరకజ్జం చిన్నప్పుడే తిన్నాను. బెల్లం కొమ్ములు అనే వాళ్ళం. మా అమ్మగారు చేశేవారు అప్పుడప్పుడు. మా శ్రీమతి ప్రయత్నం చేసింది కానీ సరిగా కుదరటం లేదు అని మానేసింది. తిని నలభై ఏళ్లు దాటి పోయింది. మరిచేపోయాను, గుర్తు చేసినందుకు ధన్యవాదాలు……..దహా.

  • మిత్రులు బులుసు సుబ్రహ్మణ్యంగారు,
   ఈ పిండివంట నేటివారికి మోటుగా ఉంటుందండి. బెల్లం కొమ్ములు అనేవాళ్ళం, తీర్ధాలలో కూడా అమ్మేవారు, దీన్నే మంచం మిఠాయి అని కూడా అంటారని గుర్తు. ఇది తినాలంటే ఇప్పుడు పళ్ళు కూడా సహకరించవేమోనండి.

   ధన్యవాదాలు.

 2. బాగుందండి. అసలు మీ బ్లాగులో మీరిప్పటిదాకా చెప్పిన వంటకాల పోస్టుల్ని మాత్రం వేరేగా pdf చేస్తే వంటరానివాళ్ళు / వచ్చినవాళ్ళు కూడా మీకు కృతజ్ఞులై ఉంటారుగా 🙂. ఆలోచించండి.
  అవును జీళ్ళపాకం లాగా సాగుతోందనే వారు. ఇప్పుడు ఆ మాటని బ్లాగుల్లో కొన్ని చర్చలకి అన్వయించ వచ్చేమో 😀.
  మీరన్నట్లు ఇప్పుడు “నాగరీకులెవరూ” కరకజ్జం / బెల్లం కొమ్ములు తింటారని, పేరయినా వినుంటారనీ నేనూ అనుకోను. అసలు మిఠాయి కొట్లల్లో దొరుకుతోందంటారా?
  “కాశీ మిఠాయి” అని మరో పాతకాలపు స్వీట్ ఉండేది. అదెలా చేస్తారో నాకు లీలామాత్రంగా కూడా గుర్తు రావడంలేదు (బెల్లం కొమ్ముల్నే పంచదారతో చేస్తే కాశీ మిఠాయి అవుతుందా? లేకపోతే రెండింటికీ పోలికే లేదా 🤔 ?). మీకు తెలిసేఉంటుంది. ఇక్కడ చెప్పగలరు.

  • విన్నకోట నరసింహారావుగారు,
   ఇలా పి.డి.ఎఫ్ చేయమని ఇదివరకెవరో అడిగారు, చేయలేకపోయా!

   ఇప్పటికి పల్లెలలో తీర్ధాలకి జీళ్ళు తాజాగా చేస్తూ ఒక గుంజకి పెద్ద మేకుకొట్టి దానికేసి ఈ జీళ్ళ బెల్లం లాగుతూనే ఉంటారు, అదెంత కాలానికీ పూర్తిగాదు. నిజమైన చర్చలు అలాగే ఉంటాయేమో మరి.

   చిత్రంగా నిన్న ఈనాడు పేపర్లో కరకజ్జం గురించి రాశారు, నాగరీకులు ఇటువంటివి తినరేమో! కొన్నైనా మాలాటి వాళ్ళకి వదిలెయ్యాలికదండీ!

   కాశీ మిఠాయి గురించి నాకూ తెలీదు, ఇల్లాలినడగాలి.

   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s