శర్మ కాలక్షేపంకబుర్లు-చావో!, రేవో!!

చావో!, రేవో!!

చావో,రేవో;తాడో,పేడో అనే మాటలు వాడుతుంటాం కాని వాటి సంగతే పట్టించుకోం. ఏంటివీ?

నీటిలో పడినవారికి ఉన్న దారులు రెండే! ములిగి చావడం, లేదూ ఈత తెలిసుంటే బయటకి అనగా రేవుకి ఈదుకురావడం, లేదా ఈత తెలిసినవారు బయటికి తీసుకొచ్చి రేవులో పడెయ్యడం. అందుకే బతుకుని రేవో అన్నారు. ఇది బతుకు. చావో, రేవో అంటే చావో, బతుకో అని అర్ధం.

ఇక తాడో,పేడో అంటే స్త్రీకి తాడు అంటే, పుస్తెలతాడు మంగళ సూత్రం, పేడు అంటే చెక్కపేళ్ళు అనగా కట్టెలు. నాటిరోజుల్లో మంగళ సూత్రం తాడు కట్టిస్తావా? పేడు అంటే చితి ఎక్కిస్తావా? అంటే బతికిస్తావా చంపేస్తావా? అని అడగడం.

 

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-చావో!, రేవో!!

 1. శర్మ గారు, మీ కష్టేఫలి బ్లాగులో (వర్డ్‌ప్రెస్) వ్యాఖ్యలకి ఆస్కారం లేదా? ఆ బ్లాగులో ఇవాళ మీరు పునర్ముద్రించిన టపా “ఏడవవలసిన సమయాలు” లో పేర్కొన్న పద్యం –

  మన సారధి,మనసచివుడు,మనవియ్యము,మనసఖుండు,మనబాంధవుడున్
  మనవిభుడు,గురువు,దేవర మనలనుదిగనాడి చనియె, మనుజాధీశా!

  ఉదాత్తమమైన పద్యం. అర్జునుడు ఆవార్తని, తన బాధని ఏకకాలంలో వ్యక్తపరిచిన తీరు అమోఘం. తొలి ప్రధాని నెహ్రు గారు 1964 మే నెలలో చనిపోయినప్పుడు ఇదే పద్యంతో ఓ ప్రముఖ వార్తాపత్రిక (ఆంధ్రపత్రికా??!!) ఆ వార్తని ప్రచురించింది. ఆ రోజుల్లో జర్నలిజం ఆ స్ధాయిలో ఉండేది.

  • పోతనగారి పద్యం, అమృతపు గుళిక కదండీ
   జరిగిపోయిన పెళ్ళికి బాజాలెందుకని ఆ బ్లాగులో కామెంట్లు తీసేశానండి
   నాటి పత్రికా విలువలు వేరు కదా!
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s