శర్మ కాలక్షేపంకబుర్లు-కజ్జికాయ,బొబ్బట్టు.

కజ్జికాయ,బొబ్బట్టు.

kajjikaya

కాయగాని కాయ కజ్జికాయ 🙂
ఇక పండగల సీజన్ ప్రారంభమవుతోంది, అన్నీ పిండివంటలే ఇక ముందు. ముఖ్యంగా తీపిలో ఎక్కవ మంది ఇష్టపడేవి ఈ కజ్జికాయ,బొబ్బట్టూ. వీటికి కొన్ని పోలికలూ ఉన్నాయి, తయారీలో.. చూదాం 🙂

కజ్జికాయకోసం మైదాపిండి తీసుకోవాలి, మంచినీళ్ళతో తడిపి ముద్దని బాగా మర్దించి, చేతికి నూనె రాసుకుని ముద్దకి పట్టించి, పల్చటి తడి గుడ్డని పిండి ముద్దమీద కప్పాలి. ఇక్కడిదాకా కజ్జికాయకి బొబ్బట్టుకి తేడా లేదు, ఇక పైనే…

కజ్జికాయకి నువుపప్పు, కోరిన బెల్లం తీసుకుని మెత్తగా దంచాలి, దీన్నే చిమ్మిలి అంటారు. ఈ చిమ్మిలి ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని, తయారు చేసి ఉంచిన మైదా పిండిలో చిన్న ముద్ద తీసుకుని, మైదా ముద్దను కజ్జికాయ బల్ల అనేది ఉంటుంది, దానిమీద కొద్దిగా నూనె రాసి ఈ మైదాముద్దను బల్లపై కొద్దిగా పల్చగా ఒత్తాలి. దాని మీద చిమ్మిలి ముద్దను పెట్టి మైదాను చిమ్మిలి పైకి మేగాలి కొద్దిగా. ఎసరు పెట్టిన నూనె కాగిన తరవాత దానిలోకి ఈ బల్లమీదున్న కజ్జికాయను నూనెలో పడేలా బల్లను ముడవాలి. బల్లమీదున్న పిండి ముద్ద కజ్జికాయ ఆకారం పొంది బల్ల చిల్లులోంచి మరుగుతున్న నూనెలో పడుతుంది. బంగారం రంగులో వేయించుకుని తీసుకుని పేపర్ మీద వేస్తే ఎక్కువున్న నూనెను పేపర్ పీల్చుకుంటుంది. వీటిని నిలవచేసుకోవచ్చు కూడా. మరో చిన్న సంగతి, ఈ కజ్జికాయలను వయసుకొచ్చే ఆడపిల్లలకు తప్పక పెడతారు, ఎందుకంటే ఆడపిల్లల గర్భాశయ ఆరోగ్యానికి చిమ్మిలి చాలా మంచిది కనక.. మరో సంగతి కూడా, సంక్రాంతికి తప్పని సరిగా చేసే పిండి వంట ఇది. కారణం శీతకాలంలో తప్పని సరిగా తినవలసినది చిమ్మిలి గనక.

కజ్జికాయను పోలి ఉండేదే సమోసా! ఇప్పుడు కజ్జికాయలో చిమ్మిలి బదులు ఏవేవో పెట్టి చేస్తున్నారు కూడా.

బొబ్బట్టు.

download

మైదా ముద్ద చేసుకోడం అనుకున్నాం కదూ! ఇప్పుడు శనగపప్పును నీళ్ళలో పోసి ఉడకబెట్టాలి. మెత్తగా ఉడికిన శనగపప్పును రుబ్బుకోవాలి అదే లెండి మిక్సీలో వేసుకోవాలి. కోరి ఉంచుకున్న బెల్లంను శనగపప్పుతో కలిపి మరోసారి మిక్సీలో ఒక తిప్పు తిప్పెయ్యండి. ఆ తరవాత శనగపప్పు,బెల్లం ముద్దలో ఏలకులపొడి వేసుకుంటే బాగుంటుంది. మైదా చిన్న ముద్ద తీసుకుని అరటాకు మీద నూనెరాసి మైదాముద్దను పల్చన వత్తండి. దానిమీద కొద్దిగా శనగపిండి,బెల్లం ముద్ద పెట్టి నెమ్మదిగా మైదాముద్దను బెల్లం మీదకు మేగండి. మొత్తం ముద్దను పలచనచేయండి, దీనిని బాగా వేడెక్కి ఉన్న తావారేకు అదే అట్లపెనం మీద కొద్దిగా నూనెరాసి దానిపై ఈ అరటాకు మీది బొబ్బట్టు జార్చాలి. దోరగా కాలిన తరవాత తిరగేసి కాల్చి తీసుకుని నిలువ చేసుకోవచ్చు.

బొబ్బట్టు,బూరి తినడం కూడా ఒక కళ 🙂 బూరి వేడిగా ఉండగా చిదిపి దానిలో నెయ్యి వేసుకుని తినాలి. చల్లారిన బూరి రుచి కాదు. బొబ్బట్టు చల్లారిన తరవాత తినాలి. చల్లారిన బొబ్బట్టు మీద వేడిగా పలచగా ఉన్న నెయ్యి వేయాలి బాగా అప్పుడు ముక్కలు చేసుకుతినాలి. ఏదైనా మితమే సమ్మతం.. 🙂

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కజ్జికాయ,బొబ్బట్టు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s