శర్మ కాలక్షేపంకబుర్లు-సీతాన్వేషణ-మేనేజిమెంటు -2

https://kastephali.wordpress.com/             కష్టేఫలే (పునః ప్రచురణ)

సీతాన్వేషణ-మేనేజిమెంటు -2
అంగదుని నాయకత్వంలో దక్షిణంగా బయలు దేరిన కపిసేన అడవులు,కొండలు, గుహలు వెతుకుతూ ముందుకు సాగుతోంది. ఈలోగా ఒక రాక్షసుడు ఎదురయ్యాడు. వానరసేనను భక్షించడానికి తయారయ్యాడు. అంగదుడు ఒక్క చరుపు చరిచి వాణ్ణి కడతేర్చాడు. అలసట లెక్కచేయక, వెతుకుతున్నారు, సీత జాడ దొరకలేదు. ఇలా వెదుకుతూ పోగా ఒకచోటికి చేరారు, ఆకలి, దప్పిక మెండుగా ఉన్నాయందరికి. కనీసం మంచినీళ్ళు దొరికినా చాలనుకున్న సమయం, చుట్టుపక్కలెక్కడా నీటి జాడే లేదు.

వెతకగా ఒక గుహ కనపడింది, కటిక చీకటి, లోపలేమున్నది కనపడటం లేదు. ఈలోగా కొన్ని పక్షులు గుహ లోపలనుంచి బయటకొస్తూ కనపడ్డాయి. లోపలికి వెళ్ళాలా? వద్దా? అనే మీమాంసలో ఉండగా హనుమ చుట్టూ ఎక్కడా చెట్టూ చేమా లేకపోయినా ఈ గుహ ముఖద్వారం మూసేలా చెట్లున్నాయి కనక లోపల నీళ్ళు ఉండచ్చు, దానికి తోడు పక్షులు బయట కొస్తున్న వాటి మీద పుప్పొడి కనపడుతోంది, లోపల నీరున్నట్టి దాఖలా కనపడుతోంది, దానికి తోడు ఈ పక్షులు నీటి దగ్గరే ఎక్కువగా ఉండేవని కారణాలు చెబితే, అది రావణ నిర్మితమేమో, తమను అంతమొందించడానికి రావణుడు పన్నిన పన్నాగమేమో అనే భయం వదలి, వానరులు, ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని గుహలో ప్రవేసించారు. కన్నుపొడుచుకున్నా ఏమీ కనపడటం లేదు, కొద్ది సేపటికి చీకటికి కళ్ళు అలవాటు పడగా అలాగే లోపలికి నడివగా కొంత సేపటికి వెలుగు కనపడింది. పళ్ళతో వృక్షాలు, మరికొంత ముందుకుపోగా భవనాలు కనపడ్డాయి. వెతకగా ఒక వృద్ధ స్త్రీ కనపడింది.
ఇక్కడికి ఆపి విశ్లేషిద్దాం.

కొత్తగా నాయకుడైనవాడు తననుతాను నిరూపించుకోవలసి ఉంటుంది. అవకాశం కోసం ఎదురు చూడవలసీ ఉంటుంది. అంగదునికి రాక్షసుని రూపంలో అది కలిసొచ్చి, రాక్షసుని ఒక్క పెట్టుతో చంపి తననుతాను నిరూపించుకున్నాడు. ఆ తరవాత తనకు అనుభవం లేని విషయాలలో మిన్నకున్నాడు, హనుమ చేసినదానిని చూస్తూ ఉండిపోయాడు. ఇది యజమాని నేర్చుకోవలసినది, తనకు చేతకాని వాటిలో తలదూర్చకూడదు.
అందరూ అలసిఉన్న సమయం, ఆహారం లేదు, కనీసం నీరు లేదు, గుహలోనికి వెళ్ళాలా వద్దా? సంశయం. బయటుంటే చావు ఖాయం, లోపలికెళితే శత్రువో, మృత్యువో తెలీదు, కాని నీరుందన్న ఒకే ఒక్క సూచన. దానితో లోపలికెళ్ళడమే మేలని సైన్యాన్ని ఒప్పించి లోపలికి నడిచారు, హనుమ. ఇది సమిష్టి నిర్ణయం, హనుమ సూచనతో, అంగదుడు పాటించాడు. మొత్తం సైన్యం ఎదుర్కోబోయే మొదటి కష్టాన్ని ఎదుర్కోడానికి హనుమ మానసికంగా సిద్ధం చేసి లోనికి నడిచిన సందర్భం. బయట ఉంటే చావు తప్పదు, లోపలికెళితే చావు బతుకు చెరి సమానం, అంటే సగం బతికే అవకాశం. ఇటువంటి సంఘటనలు మనకు జీవితంలో ఎదురు పడతాయి. అప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉండాలి, బతికేందుకు సావకాశం, కష్టం నుంచి బయటపడే సావకాశం సగం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఇది మనమూ నిత్య యాజమాన్యం లో నేర్చుకోవలసినది, ఓడిపోయేదాకా పోరాడాలిసిందే !

కృషితో నాస్తి దుర్భిక్షం వెలుగు కనపడింది, ఫలాలతో చెట్లూ, నీరూ కనపడినా ఇది రావణ మాయ కావచ్చని ఒక్కరూ ముట్టుకోలేదు, ఇది భయం, జాగ్రత కూడా, ఎంత కపి ప్రవృత్తి ఉన్నా!కష్టం లో దిగజారిపోకూడదన్నదే దీని అర్ధం.

ఈ సంఘటన తరవాత అంశం తరవాత చూదాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s