శర్మ కాలక్షేపంకబుర్లు-సీతాన్వేషణ-మేనేజిమెంటు -3

సీతాన్వేషణ-మేనేజిమెంటు -3

వృద్ధ తాపసిని చూసి, హనుమ ఆమెకు చేతులెత్తి నమస్కారం చేసి ”తల్లీ నీవెవరు, ఈ భవనాలు, వనాలు,రత్నరాసులు, గుహ ఎవరివి తల్లీ” అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పేలోగానే ”అమ్మా మేమంతా అకలిదప్పులకు నలిగిపోయి ఉన్నాం, దాహం తీర్చుకోడానికి ఈ గుహలో ప్రవేశించాం,వీటినన్నిటిని చూసి దిగ్భ్రాంతి చెందాం, ఇవి రాక్షసమాయేమోనని సందేహించాం, ఐనా ఆకలి దప్పికలను తీర్చుకోడానికే ఇందులో ప్రవేశించాం, మా వివేకం దెబ్బతిన్నది” అని విన్నవించాడామెకు.

అంతట ఆమె ఆ గుహ నిర్మాణ వివరాలు చెప్పి ఇది హేమ అనే అప్సరస కి చెందినవి. నేను మేరుసావర్ణి కుమార్తె స్వయంప్రభను, ఈ గుహను కాపాడుతూ ఇందులో ఉంటున్నాని చెప్పి, మీరిలా వచ్చిన కారణమేంటి, ఈ అడవులు ఎందుకు గాలిస్తున్నారు? వివరాలన్నీ మీకు కావలసిన ఆహార పదార్ధాలు కడుపు నిండా తిన్న తరవాత చెప్పండి అని చెప్పింది.

కపిసేన తమకు కావలసిన ఆహరం తీసుకున్న తరవాత, హనుమ వినయంతో ఇలా చెప్పేడు.” శ్రీరాముడు దశరథమహారాజు పెద్ద కుమారుడు, తండ్రి ఆజ్ఞతో వనవాసానికొచ్చాడు, ఆయనతో భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు వచ్చారు. సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయాడు, సుగ్రీవుడు రామునికి మిత్రుడు,సుగ్రీవుడు మా రాజు, ఆయన ఆనతిపై దక్షణ దిక్కుగా, అంగదుని నాయకత్వంలో సీతను వెతకడానికొచ్చాము. ఈ దిక్కున అన్నిచోట్ల గాలించాము, సీత జాడ దొరకలేదు, ఆకలి దప్పులతో ఉండి నీటికోసం వెదకితే గుహ కనపడింది, ఇందులో నీరున్న జాడలు కనపడితే దీనిలో కొచ్చాము, మేము వచ్చిన పని ఇది” అని విన్నవించాడు. ”మా ఆకలి దప్పులను తీర్చిన మీకు మేము చేయగల ప్రత్యుపకారం చెప్పుతల్లీ” అని ప్రార్ధించాడు. దానికామె ”మీ మాటే నాకు చాలా అనందం కలిగించిందని” చెప్పింది.

దానికి హనుమ ”మేము సీతాదేవిని వెదకేందుకు సమయం విధించారు మా రాజు. ఆ సమయం ఈ గుహలోనే గడచిపోయింది. ఈ దుర్గమమైన బిలం నుంచి బయటపడే మార్గం చెప్పి రక్షించ”మని వేడుకున్నాడు. దానికామె దుర్గమమైన ”ఈ గుహనుండి బయట పడటం కష్టం”, అందరిని కనులు మూసుకోమని చెప్పి వారిని సముద్రపు ఒడ్డుకు చేర్చి వారినోదార్చి,ఆశీర్వదించి, తన గుహకు వెళిపోయింది.
ఇప్పుడు ఈ సంఘటనను విశ్లేషిద్దాం.

ఎంతటివారైనా అనగా అధికారం కలవారైనా,డబ్బు గలవారైనా అలవరచుకోవలసినది వినయం,మాట పొందిక, అందునా మరొకరి సాయం అర్ధించేటపుడు తప్పక అనుసరించవలసినది,చూడండి హనుమ చేతులెత్తి నమస్కారం చేశాడన్నారు, వాల్మీకి, ఏం? నమస్కారం చేశాడంటే చాలదా?మాటే కాదు ఆంగిక వినయం కూడా కనపడాలి..

కపిసేన తమకెంత ఆకలి దప్పిక ఉన్నా స్వయంప్రభ ఆకలి దప్పికలు తీర్చుకోమనేదాకా ఆగినట్లు మనం కూడా ఓర్పు వహించడం నేర్చుకోవాలి. గుహలోకి రాగానే కలబడి తినెయ్యచ్చు, ఆ తరవాత ఆమె ఏమీ అనదు కూడా, కాని మరొక చోటికి పోయినపుడు క్రమ శిక్షణ పాటించడం అవలంబించడం కావలసినదే.హనుమ మరోమాట కూడా చెప్పేరు, గుహలోకి అనుమతి లేక ప్రవేశించారు, మరొకరి ఇంటిలోకి వారి అనుమతిలేక లోపలకి పోవచ్చా? అందుకుగాను సవినయంగా మన్నింపుకోరాడు, ఇదీ వినయం ప్రకటించడమంటే, నేర్చుకోవలసినదేగా!

హనుమ మాట చాతుర్యం ఇక్కడనుంచి కనపడుతుంది, రామాయణంలో. సంక్షిప్తంగా రామకథ చెప్పినచోట చెప్పినట్టు చెప్పకుండా, ఎక్కడే విషయం ఎంతవరకు చెప్పాలో చెబుతూ ఉంటారు. దీనిని మరోసారి చూదాం.

ఈ సంఘటన మొత్తంలో హనుమ మాట్లాడేడు తప్పించి, అంగదుడు కలగజేసుకోలేదు, పెద్దవారితో వినయంగా మాటాడడాన్ని అలవరచుకున్నాడు, హనుమ మాట చూసి. హనుమ అంగదుని పూర్తిగా విస్మరించనూ లేదు, సందర్భోచితంగా ఉదహరించాడు కూడా, అంగదుని మనసు నొచ్చుకోకుండా.

గుహనుంచి బయటపడటం క్లిష్టంగా ఉంటుందని తెలిసి, స్వయంప్రభను అర్ధించి కార్యం గడపిన హనుమ వాక్చాతుర్యం అనుసరించవలసినది.

చివరి టపా రాయాలి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s