శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు విరిగెనేని

మనసు విరిగెనేని

ఇనుము విఱిగెనేని ఇనుమారు ముమ్మారు
కాచి యతుకవచ్చు గ్రమముగాను
మనసు విరిగెనేని మరియంట నేర్చునా
విశ్వదాభిరామ వినురవేమ.

ఇనుము విరిగితే రెండు మూడుసార్లైనా కాల్చి అతకచ్చు. మనసు విరిగితే అతకరాదురా! అన్నారు తాత గారు.

ఇది జీవిత సత్యం. ఇనుము విరిగితే మళ్ళీ అతకచ్చు, అదైనా రెండు, మూడుసార్లే, ఆపైన అదీ అతుక్కోదు. మనసైతే ఒక్కసారి విరిగితే అతకదన్నాడు తాత, అసలు విరక్కుండానే చూసుకోవాలి, . అదెలాగో చూదాం.

మానవ సంబంధాలన్నీ సున్నితమైనవే. కొన్ని వేళల పొరపాట్లు జరుతాయి, అటువంటపుడు మనస్ఫూర్తిగా క్షమాపణ చెబితే అవతలి వారు తప్పక మన్నిస్తారు, మన్నించాలి కూడా. అదే సంస్కృతి కి పట్టుకొమ్మా. కాదు నా మనసు విరిగిపోయిందనటమూ తప్పే. పొరబాటయిందని క్షమాపణ అడగ కుండానే చెబుతున్నపుడు కాదన కూడదు. అడిగిన తరవాత క్షమాపణ చెప్పడం అలా చెప్పించుకున్నవారి అహం చల్లర్చుకోడమే తప్పించి అసలువారిలో మార్పు రానట్టే, పరిస్థితులకి లొంగి క్షమాపణ చెప్పచ్చు. అందుకు సాధారణం గానే తప్పులు జరగకుండానే చూసుకోవాలి, తెలిసి, తెలియక జరిగితే మన్స్ఫూర్తిగానే క్షమాపణ అడగాలి అప్పుడే మానవ సంబంధాలు బాగుంటాయి. మానవ సత్సంబంధాలు పెంచుకోడం కష్టం.

మేధావులైనవారు మానవ సత్సంబంధాల్ను పెంచేలా ఉండాలి కాని వారి డాక్టరేట్లు మానవులను విఛ్ఛినం చెయ్యడానికి, అందరిని వర్గాలుగా, గుంపులుగా,కులాలతో,మతాలతో విడతియ్యడానికే ఉపయోగపడుతున్నాయి, ఇది చాలా విచారకరం.చదువుకున్నవారిలో ఉన్నంత కుల,మత కంగాళీ చదువుకోనివారిలో లేదు. వారికి సఖ్యతగా బతకడమే మంచిదన్న జీవిత రహస్యం తెలుసు, కాని ఈ చదువుకున్నవారే వారిని పాడు చేసేస్తున్నారు. ఇద్దర్ని ఏకాభి ప్రాయానికి తీసుకురావడం కష్టం, దానికి ఈ మేధావులు తమ శక్తి వినియోగిస్తే మంచిది తప్పించి, అందరి మధ్య కొట్లాటలు పెంచి చలిమంటలు కాచుకోవడం క్షమించరాని నేరం. వీరికి మనసెలా ఒప్పుతుందో తెలియదు. మనుషుల్ని విభజించి పాలించే ఈ తెల్లవాడి నీతిని నరనరానా జీర్ణించుకున్నది ఈ మేధావులే సుమా! మనసులు కలపండి, విదతీయడం కాదు.

మానవ సంబంధాలలో అతి ముఖ్యమైనది భార్యా/భర్తల బంధం. ఇదెలా ఉండాలి? సాలె గూటి దారంలా ఉండాలి. అదేంటి సాలె గూటిదారం ఉఫ్ అంటే తెగిపోదా? పొరపాటు. సాలెగూడు దారం బాగా సున్నితంగా కనపడుతుంది కాని బలంగా వీచే గాలి కూడా దాన్ని తెంపలేదు, అంత గట్టిగా ఉంటుంది, కాని అదే దారం వర్షం వస్తే మాత్రం పుటుక్కున తెగిపోతుంది. ఇప్పుడు తెలిసిందా? భార్యా/భర్తల బంధం సాలెగూటి దారమంత సున్నితంగానూ అంత బలంగానూ ఉండాలి, కాని వర్షం లాటి మూడో వారిని మధ్యకి రానివ్వకూడదు, వస్తే ఇంతే సంగతులూ….

భార్యా భర్తల మధ్య దాపరికాలు కూడదు, తప్పు జరిగితే సమయం చూసి మనసు విప్పి చెప్పేసుకోవాలి. చెప్పిన వెంటనే రెండో వారు తెయ్యిమని లేచి కోపపడకూడదు. సుతిమెత్తగా హత్తుకున్నట్టు ఇలాగైతే ఎలాగోయ్ సంసారం అంటూ సలహా ఇస్తున్నట్టు మెత్తగా మందలించాలి, అప్పుడు ఆ బంధం సాలెదారమంత మెత్తగానూ అంత బలంగానూ ఉంటుంది. మరి కొంత నూతనంగానూ. ఇది నిర్వహించడం భార్యా భర్తలకొక కళ. ఇది తెలిసిన సంసారం ఏమి హాయిలే హలా 🙂 ….. భార్యా భర్తల మధ్య ఏ పొరపాటయినా సద్దుబాతవుతుంది కాని మూడో మనిషి మధ్య చేరితే ఆ సంబంధం విరగడమే కాని అతకడం ఉండదు తస్మాత్ జాగ్రత…..

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-మనసు విరిగెనేని

  1. సమయం చిక్కకపోవడం వలన మీ టపాలు చదవడం ఆలస్యం అవుతోంది. చాలా బాగా చెప్పారు మానవ సంబంధాల గురించి. చదువుకున్న ఈ మేధావులు నలుగురితోనూ సఖ్యం గా ఉండే వారిని విభజన చేస్తున్నారు. మీరు చెప్పినట్లు సంస్కారం లేని చదువు, చదివినా చదవకపోయినా ఒకటే !!

    • చంద్రిక గారు,
      బాగా చదువుకున్నవారిలోనే మనుషుల్ని దూరం చేసే ఆలోచన బాగా ఉందండి! ఇద్దర్ని సఖ్యంగా ఉంచడానికి పెద్ద ప్రయత్నం కావాలి, అదే ఎడమొహం పెడమొహానికి….
      ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s