శర్మ కాలక్షేపంకబుర్లు-కోహం?

కోహం?

పెద్ద విషయాలన్నీ చిన్నగానే మొదలవుతాయనీ, మూలాలు చిన్నవిగానే ఉంటాయనీ అనుకోడానికి మన మనసు ఒప్పుకోదు! అటువంటిదే ఈ కోహం కూడా అని నా అభిప్రాయం.

ప్రశ్న:కోహం?
(నేనెవరు?)
జవాబు:అహం బ్రహ్మస్మి
(నేను భగవంతుడిని.)
ప్ర:అదేమి? ఏకమేవా అద్వితీయం బ్రహ్మ కదా?
(అనగా భగవంతుడొకడే రెండవవాడు లేడు కదా?).
నేను భగవంతుడు, నీవు భగవంతుడు, కనపడుతున్న ప్రతి జీవి భగవంతుని రూపమేనా?
ఇది నిజమైతే భగవంతుడొకడే ఎలా అవుతాడు?

ఉదాహరణ చెబుతా!

ప్ర:ఆకాశం లో సూర్యులెంతమంది?
జ:సూర్యుడొకడే!
ప్ర:భూమి మీద కుండలోని నీటిలో కనపడేవాడెవడు?
జ:సూర్యుని ప్రతిబంబం.
ప్ర:కుండపగిలి అనేక ముక్కలై ఆ ముక్కలలో కనుపిస్తున్నవాడెవడు?
జ:అకాశంలో ఉన్న ఒకే సూర్యుడు.
ప్ర:ఈ కుండపెంకులలో కనపడే ప్రతి బింబాలన్నీ?
జ:సూర్యుని అనేక ప్రతిబింబాలు.
ఆ సూర్యుని ప్రతిబింబాలు ఎలా అనేకంగా కనపడుతున్నాయో, భగవంతుడు కూడా జీవులలో ప్రతిబింబంగా ఉన్నాడు, కనపడుతున్నాడు.

ప్ర:మరి ఇప్పుడు నేనెవరు?
జ:అహం బ్రహ్మస్మి.
నేను దేవుడను.” నేనే దేవుడను కాదు సుమా!” ”దేవుడొక్కడే అది నేనే” ఇది హిరణ్యకశిపుని వాదన సుమా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s