శర్మ కాలక్షేపంకబుర్లు-అప్పన్నా తనా మనా

అప్పన్నా తనా మనా

అప్పన్నా తనా మనా, మారోరి బైరన్నా
మారోరి  బైరన్నా,మంచోడు బైరన్నా
అప్పన్నా! అప్పన్నా!!అప్పన్నా!!!

ఈపాట బిచ్చగాళ్ళూ,తాగుబోతులూ,బైరాగులూ గంజాయి దమ్ముతో పాడుకునే కాలక్షేపం పాట అని అనిపించేది. అలా పాడుకునే పాటగా పల్లెలలో బాగా పరిచయమే. దీనిని పాట కచేరీలలో పాడేవారట, నేను వినలేదుగాని, లొల్లాయి పదంగా విన్నదే! ఈ పాట ఇంతేనా దీనికి అర్ధం ఉందా? కర్లపాలెం హనుమంతరావు గారి బ్లాగులో టపా చదివేదాకా నాకూ అలాగే అనిపించింది.శ్రీ బాలంత్రపు రజనీకాంతరావుగారు చెప్పినమాటా చెప్పేరు. 

http://karlapalem-hanumantha-rao.blogspot.in/2016/09/blog-post_17.html

పెద్దవారు చెప్పినమాట కాదనడం కాదుగాని నాకిలా అనిపించింది. అసలు పాట ఇదీ

अपना तन्  मना, मर् और् भी रहना

मर् और् भी रहना,मन् छोड् भी रहना

(అప్పన్నా తనా మనా) అపనా తన్  మనా, (మారోరి బైరన్నా) మర్ ఔర్ భీ రెహనా
(మారోరి బైరన్నా)మర్ ఔర్ భీ రహనా,(మంచోడు బైరన్నా)మన్ ఛోడ్ భీ రెహనా

గ్రామీణులు పాడుకునే పాటా అసలు పాటా పక్కపక్కనే ఇచ్చాను చూడండి. దీని అర్ధం ఏమీ అని కదా అనుమానం.అపనా తన మనా అంటే నీ తనువు నిషిద్ధం అనగా తనువు అశాశ్వతం. మర్ ఔర్ భీ రెహనా చనిపోయిన తరవాత కూడా ఉండాలి, అనగా కీర్తి శరీరమే నిలుస్తుంది, శరీరం పోతుంది.చనిపోయిన తరవాత నిలిచేది పేరే అనేది నొక్కి చెప్పడానికే రెండవసారి కూడా మర్ ఔర్ భీ రెహనా అన్నమాట. మన్ ఛోడ్ భి రెహనా మనస్సు వదిలేసి ఉండాలి అంటే కోరిక వదులుకుని ఉండాలి అని అర్ధం. ఇది సూఫీ గీతమో, మరొకటో తెలియదుగాని నాకీ కింది పద్యం గుర్తొచ్చింది.

 కారే రాజులు? రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిం బొందరే?
వారేరీ సిరి మూటగట్టుకుని బోవంజాలిరే భూమిపై
బేరైనంగలదే? శిబి ప్రముఖులుం బ్రీతిన్ యశఃకాములై
యీరే కోర్కులు?వారలన్ మఱచిరే? ఇక్కాలమున్? భార్గవా

మహరాజులు, సామ్రాజ్యాలూ లేవా? ఆ రాజ్యాలేలిన మహరాజులు మీసాలు తిప్పి మేమే మొనగాళ్ళమనలేదా? ఏరీ వాళ్ళెక్కడా? ఇక్కడనుంచి సిరి ఏమైనా మూట కట్టుకుపోయారా? వాళ్ళ పేరైనా తలుచుకునేవాడున్నాడా ఈ కాలంలో,శిబిలాటి మహా దాతలూ చెల్లిపోయారు, కాని కీర్తి శరీరాలతో ఉండిపోయారు కదా! నేటికీ వారి గురించి చెప్పుకుంటున్నారు కదా! అని అడిగాడు బలిచక్రవర్తి తన గురువు శుక్రాచార్యుని. ఈ పద్యం అర్ధమూ పై లొల్లయిపదంలాటి దాని అర్ధమూ ఒకలా అనిపించలేదా?

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-అప్పన్నా తనా మనా

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s