శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటో ఈ మాయా?

ఏమిటో ఈ మాయా?

‘పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్’ పంచభూతాలు తిరగేసి చెప్పేరు. మొదటగా పుట్టినది ఆకాశంట, దేనినుంచి పుట్టిందీ మహత్తునించి. మహత్తెక్కడనుంచి పుట్టిందీ? మహత్తుకి చావు పుట్టుకలు లేవు, అది పుట్టలేదు,చావూ లేదు. అదేంటీ? ఓహో! అంత తేలిగ్గా తెలిసిపోతే అది మహత్తెందుకవుతుందీ? ప్రతీది అరటి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు తెలిసిపోతే నీవు చేసేదేంటి బాబూ! ఈ మహత్తును నీ మటుకు నీవే కనుగోవాలి, మరెవరూ దీన్ని నీకు దర్శించలేరు…

ఆకాశం ఉన్నట్టు కనపడుతుందిగాని లేదు, ఎంత దూరం వెళ్ళినా ఇంకా ఎక్కడో ఉన్నట్టు కనపడుతుంది. అది శూన్యప్రదేశం. శూన్యప్రదేశం పుట్టిందిట, లేనిది పుట్టడమేంటో 🙂 లేనిది ఉన్నట్టు కనపడుతూ ఉంటుంది, దీనినుంచి మరో భూతం పుట్టిందిట, ఏంటీ లేనిదానినుంచి ఉన్నది పుట్టిందిట. అదెలా? ఈ పుట్టినది వాయువు, వాయువు ఉన్నట్టు తెలుస్తోంది. లేని ఆకాశం ఉన్నట్టు కనపడుతోంది, ఉన్న వాయువు లేనట్టు కనపట్టం లేదు. లేనిదానినుంచి పుట్టినది ఉన్నదని తెలిసినా కనపడదా? లేనిదేమో ఉన్నట్టు కనపడుతుంటుందా? ఏమి ఈ మాయ! అదే అద్వైతం లేక ఉన్నట్టున్నదీ, ఉండి లేనట్టున్నదీగా ఉన్నదీ కలిస్తే సంపూర్ణం అదే అద్వైతం, ఏదో గందరగోళం.  మీకేమైనా తెలిసిందా? 🙂

ఉండి, లేనట్టుగా ఉన్నదానినుంచి మరోటి పుట్టిందిట అదే నిప్పు, ఆ( ఇది ఉన్నట్టు కనపడుతోంది. దీనికి మూడు గుణాలుట, అదే శబ్ద,స్పర్శ, రూపాలు. ఐతే మొదటివాటికి గుణాలు లేవా? లేకేం! ఆకాశానికి శబ్దం, వాయువుకి రెండు గుణాలు శబ్దం, స్పర్శ. ఈ మూడో భూతానికి మానవ శరీరంలో ఇంద్రియం కన్ను, ఆకాశానికికున్న గుణం శబ్దంకి మానవ శరీరంలో ఇంద్రియం చెవి, అలాగే వాయువుకు స్పర్శేంద్రియం చర్మం. ఇక్కడనుంచి భూతాలు కనపడుతుంటాయి. తరవాత నాలుగో భూతం ఆపస్ అంటే నీరు, దీనికి నాలుగు గుణాలు శబ్ద,స్పర్శ,రూపాలు. ఈ భూతం కనపడుతుంది శరీరంలో ఇంద్రియం నోరు, అంటే రసనేంద్రియం దీనినే రసజ్ఞా అంటారు, అంటే రసమును గ్రహించేది, నాలుక. ఇక చివరిదైన భూతం పృధివి అంటే భూమి, దీనికి ఐదు గుణాలు శబ్ద,స్పర్శ,రూప, రస,గంధాలు. ఇది కనపడుతూనే ఉంటుంది. లేనిదానినుంచి ఉన్నది పుట్టి, లేనట్టున్నదానినుంచి ఉన్నవి ఒకదాని నుంచి మరొకటి పుట్టిందిట. నేటి సయిన్సూ ఇదే చెబుతోందిట. మరి ఇదేం మాయా! లేనిదానినుంచి ఉన్నదెలా పుడుతుందండీ! మరో చిత్రం ఈ చివరి భూతమైన భూమినుంచి మనుషులు పుట్టేరట. ఓర్ని! ఇంత తిరకాసా! అంటే మనం ఎక్కడనుంచి పుట్టామండీ? శూన్యాన్నుంచా? మళ్ళీ ఎక్కడికిపోతున్నాం శూన్యంలోకే?

పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్పూర్ణ ముదచ్యతే
పూర్ణస్యపూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే

అన్నమాచార్యులేమన్నారు, పుట్టుటయు నిజము,పోవుటయు నిజము, నట్టనడిమిది నాటకమూ అన్నారు కదా? ఈ పుట్టుకా చావూ కనపడుతున్నాయి కనక. పుట్టిన మానవజాతికి ఐదు జ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలూ. జ్ఞానేంద్రియాలు చెవి,చర్మం,కన్ను, నోరు, ముక్కు. కర్మేంద్రియాలు కాళ్ళు,చేతులు, మలద్వారం, నోరు, మూత్ర ద్వారం. జ్ఞాన కర్మేంద్రియాలలో నాలుగోది చూడండి, అదే నోరు, అంటే నోటిలోని రసజ్ఞా అంటే నాలుక రెండు పనులు చేస్తోంది, రుచిని గ్రహించడం,మాటాడటం. మరే ఇతర ఇంద్రియమూ ఇలా రెండు పనులు చేయటం లేదు.

ఇలా రెండు పనులు చేస్తున్న ఈ ఇంద్రియాన్ని ఎంత జాగరతతో వాడుకోవాలి?మనం మరొకరిని తిట్టచ్చు, కాని మరొకరు మనను ఏమీ అనకూడదు. ఇదిగదా మానవ ప్రవృత్తి. భారతం ధర్మం అంటే ఏం చెప్పిందీ? ఇతరులు నీకేం చేస్తే అప్రియమో, అవి నీవు ఇతరులకు చేయకపోవడమే పరమ ధర్మం అంది! అదా సంగతీ! మరైతే దీన్ని ఎలా అనుసరించాలిటా? మనోవాక్కాయకర్మలని ఏకోన్ముఖం చేసిట….అయ్యో! ఇందులో కూడా వాక్కు అనగా నోరొచ్చిందండీ! ఒక మాట చెప్పి నలుగుర్ని ఒక చోట పోగుపరచి మంచి చేయగలగడమే సర్వే జనాః సుఖినోభవంతు, ఇదే నోటితో చెడ్డ మాట మాటాడితే వీపుకి దెబ్బలు తప్పవు 🙂 అందుకే నోరా వీపుకి దెబ్బలు తేకే అన్నారు.

 ప్రియమైనవే వినాలని,ప్రియమైనవే చూడాలని ఇంద్రియాలనుకుంటాయి. ప్రియమైనవే తినాలనీ నాలుక అనుకున్నపుడు, ప్రియమైనవే మాటాడాలని నాలుకెందుకనుకోదూ? ఏంటో అంతా మాయ కదా ! 

ప్రకటనలు

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఏమిటో ఈ మాయా?

  1. శర్మ గారు నమస్కారం,

    మీరు పెట్టిన పోతన గారి భాగవతం చదువుతున్నాను. దానిలో మీరు చెప్పిన విశేషాలే చెప్పారు. నేను ఈ టపా లో రాసింది చదివాను కానీ మీ అంత లోతుగా ఆలోచించలేకపోయాను. మీరు చాల చక్కగా చెప్పారు.
    నిజమే ఎంత మాయ మరియు విచిత్రం కాకపోతే?
    లోకాలన్నీ కలిపి భగవంతుడే అయ్యాక మళ్ళి ఏంటో ఇన్ని రకాలు. ఏమి చిత్రం

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s