శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదీ ఆత్మానందం

ఇదీ ఆత్మానందం 

మొన్న మిత్రులతో మాటల సందర్భంగా జరిగిన సంభాషణ.

లోకం చిత్రమైనది,లోకులు బహు చిత్రమైనవారు కనకే సుమా! మానవులంతా పొట్టకూటి కోసమే పాకులాడతారు ఎక్కువగా, ఎక్కడో కొద్ది మంది తప్పించి, వీరు, ఈ పొట్టకూటికి పాకులాడే సమయంలో ఏదో ఒక వృత్తి చేపడతారు. తప్పక నిపుణులూ అవుతారు, ఇది బతుకుపోరాటం కనక. అందెవేసిన చేతులే అవుతారు, దాని మూలంగా విత్తమూ బాగానే సంపాదిస్తారు. ఇది మొదటి దశ. ఇక రెండవ దశలో విత్తానికంటే మరోదానికి ప్రాముఖ్యం పెరుగుతుంది, అదే కీర్తి. దీనికి అవధి లేదు, విత్తానికీ లేదు. వద్దన్నా కీర్తి పెరుగుతూనూ ఉంటుంది, దానితోబాటు కొందరు అసహనపరులు వీరికి అపకీర్తి తేవాలనే ప్రయత్నమూ, తాపత్రయమూ పడుతుంటారు. వెలుగిచ్చే దీపం కిందనే చీకటీ ఉంటుంది. ఈ కీర్తి అనేది దాహం,తృష్ణ, ఎంతపేరొచ్చినా ఎన్ని సన్మానాలు చేయించుకున్నా, ఈ కండూతి తీరదు. నిజానికి ఇదొక గుర్తింపువ్యసనం, వ్యసనం అంటే దుఃఖమని అర్ధం. దీనినుంచి తప్పించుకోవడం అంత సులభమూ, సాధ్యమూ కాదు, తప్పించుకోగలిగినవారు మహానుభావులే! ఇలా తప్పించుకున్నవారు చివరిదైన స్థితికి చేరతారు, అదే తురీయావస్థ. అంటే చేసే పనిని ప్రేమిస్తారు, చేసే పనిలోనే తృప్తిని సాధిస్తారు. వీరు చేసే పనివల్ల లబ్ధి పొందినవారిని చూసి ఆత్మ తృప్తి, ఆత్మానందమూ పొందుతారు, అదీ తురీయావస్థ, వీరు ఆ పనిని సొమ్ముకోసమో,పేరుకోసమో కాక ఆ పని చేయడంలోనే ఆత్మానందాన్ని పొందుతారు, నిజంగా ఈ స్థితిని సాధించడం అన్నదే ఆత్మానందానికి ప్రతీక. ఏంటో! ఎంత చెప్పినా…ఎప్చ్….. కాలా 🙂 మరీ అంత కోప్పడితే ఎలా? ఒక ఉదాహరణ చెబుతా!

ఈ విషయం నా అభిమాన రచయిత శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిగారు తమ అనుభవాలు-జ్ఞాపకలూనూ లో చెప్పినది.

శ్రీద్వారం వేంకటస్వామి నాయుడు గారు గొప్ప సంగీత విద్వాంసులు. భారతదేశాన్ని ఫిడేలు వాయిద్యంతో ఉర్రూతలూపిన సంగీత చక్రవర్తి. కాలంతో దృష్టి మాంద్యం ప్రవేసించింది. కచేరీలు చేయడమూ తగ్గింది, వయసూ మీద పడింది. కాని రోజూ మూడు గంటల కాలం ఇంటిదగ్గర తీరుబడిగా కూచుని సభలోవాయించినట్టు ఫిడేలు వాయించేవారు, ఎవరు విన్నా,వినకపోయినా, కనీసం దారేపోయేవారు తల ఊచకపోయినా, చిత్రంకదా! ఎందుకిలా రోజూ వాయించేవారు? సొమ్ముకోసమా? ఆ అవస్థ ఎప్పుడో దాటేశారు, మరి ఇది సాధనా కాదే! వారే గురుస్థానంలో నిలకడగా ఉన్నవారూ, పేరు ప్రఖ్యాతుల కోసమా! అవెప్పుడో సంపాదించి ఉన్నావారూనూ!వారు ఫిడేలు వాయిస్తే అది గంధర్వగానమేననీ అందరూ చెప్పుకునేవారాకాలంలోనే. మరి ఎందుకు? ఇదీ అసలు ప్రశ్న, చిక్కు ప్రశ్న.

లోకం మాట వేరు. లోకం అనుకునేదీ వేరే. ఇంకా పేరు ప్రఖ్యాతులకోసమే చేస్తున్నట్టు అనుకుంటుంది. సాధకావస్థ దాటినవారికి, పేరు ప్రఖ్యాతులార్జించినవారికి చివరి మెట్టు ఆత్మానంద సాధన, దీన్ని సామాన్యులు అర్ధం చేసుకోడం కష్టం. నాయుడుగారు సాధనలో ఆ స్థితికి చేరారు, మహానుభావులయ్యారు. ఈ స్థితిలో ఒకరి నచ్చుకోలు, మరొకరి మెచ్చుకోలు, ఆర్ధికమైన అవసరాలూ ఉండవు, ఆ పని పైనే లక్ష్యం, ఆ పని చేయడంలోనే ఆత్మానందం, ఆ పని చేయలేక ఉండలేని అవస్థ, అదే తపస్సు, అదేఆత్మానందం.ఇదిగో ఇలా ఆత్మానంద స్థితికి చేరుకోడానికి ప్రయత్నమైనా చేదాం…

ప్రకటనలు

10 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఇదీ ఆత్మానందం

 1. స్పందించండి అన్నారు కాబట్టి అంటున్నా !

  జయహో ! మాచన ! భాస్కరు
  డ!యొజ్జ ! దీక్షగొని పారుడై నడయాడూ !
  నయగారి, యంబ జగదం
  బ యండ మెండగు జిలేబి భవ్యము గానన్ !

  జిలేబి

  • Zilebi గారు,
   మనమేదో చేసేం అనుకుంటాం గాని ఏదీ మన చేతులలో,చేతలలో లేదండి, భగవన్నిర్ణయం ఎలా ఉంటే అలా జరగాల్సిందే! బుద్ధి కర్మానుసారిణి.
   ధన్యవాదాలు.

  • విన్నకోట నరసింహారావుగారు,
   తానొకటి తలిస్తే,దైవమఒకటి తలచిందని సామెత! ఒక సంఘటన జరిగింది మొన్న ౭ వ తేదీని,చెబుతా 🙂
   ధన్యవాదాలు.

  • చిరంజీవి sirimallelu,
   నిజానికి ఉత్సాహం నిండుకుంది, నిన్న మధ్యాహనం వరకూ, ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు? కొద్దికాలం విశ్రాంతి ప్రకటించా కదా! 🙂 మరిప్పుడు కుదరదని తెలిసిపోయింది. 🙂
   ధన్యవాదాలు.

 2. గురువు గారు, తురీయావస్థకి భలే వివరణ ఇచ్చారు. ఇది తరచు శ్రీచాగంటి వారి ప్రవచనాల్లో వినటమే కానీ పూర్తిగా పట్టుకోలేకపోయా. దీనికి ఆత్మానందానికి ఇంత దగ్గర సంబంధం ఉండటం బావుంది. ఏమిటో అంత మాయ. తెలిసినట్టే ఉంటుంది మళ్ళీ ఇంకోసారి చూస్తే తెలియనట్టుంటుంది.

  • ramuduj జీ,
   ప్రతి దానిలోనూ చివరి దశను తురీయావస్థ అనచ్చు. ఇది సాధకులకు తెలిసిన విషయం. సాధకుడు ఈ తురీయావస్థలో పొందే ఆనందమే ఆత్మానందం. తాను చేసే పనిని చేయక ఉండలేని అవస్థ, దీనిని సాధించడం చాలా కష్టం, అది ఏ పనైనాగాని.
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s