శర్మ కాలక్షేపంకబుర్లు-బొడ్డుతాడు (Stem Cell)

బొడ్డుతాడు

శిశువు పుట్టగానే తల్లినుంచి ఉన్న అంబలికల్ కార్డ్ Umbalical chord లేదా placenta ప్లసెంటా అనే మావి, బొడ్డు తాడును కత్తిరిస్తారు. ఆ తరవాత ఈ తాడును శిశువు బొడ్డు దగ్గర రెండంగుళాలు ముక్క ఉండేటట్టు కత్తిరించి బొడ్డు ముడేస్తారు. శిశువు ఇప్పటివరకు ఆహారం బొడ్డుతాడు ద్వారా తల్లినుంచి తీసుకున్నది ఇప్పుడు నోటిద్వారా తీసుకోవడం ప్రారంభిస్తుంది.

ఇలా బొడ్డుతాడును కత్తిరించడం బొడ్డు ముడేయడం, ముడేసిన బొడ్డు మీద కొద్దిగా నూనెచుక్క వేయడం,కొద్దిగా పసుపు రాయడం,నూనె అంటిన పల్చటి బట్టను బొడ్డుపై కప్పడం, చాలా కాలంగా, మనదేశంలో జరుగుతున్నదే! ఇలా బొడ్డు దగ్గర ముడేసి ఉంచిన ముక్క కాలంతో ఎండిపోయేది, నెలలోపు ఇలా ఎండిపోయిన బొడ్డును గిల్లి జాగ్రత్త పెట్టేవారు,బంగారంకాని వెండితో కాని చేసిన తాయత్తులో. నెల పురుడు వెళ్ళిన తరవాత ఈ తాయత్తును బిడ్డ మొలలో మొలతాడులో గుచ్చి బిడ్డకి కట్టేవారు.

దీనిని బొడ్డు తాయత్తు అనేవారు. దీనిని మరెక్కడో నిలవ చేస్తే అవసరానికి కనపడకపోవచ్చనే ఉద్దేశంతోనే బొడ్డు తాయత్తుగా బిడ్డ దగ్గరే నిలవ చేసేవారనిపిస్తుంది. మొగపిల్లలకి ఆడపిల్లలకీ కట్టేవారు, కాని ఆడపిల్లలకి కట్టిన బొడ్డు తాయత్తును, రజస్వలైన తరవాత తీసేసేవారు. నాకూ ఇలా బొడ్డు తాయత్తు కట్టేరు, అది కాస్తా గోదారమ్మ పట్టుకుపోయింది. అమ్మని అడిగా అసలీ ‘బొడ్డు తాయత్తు ఎందుకూ?’ అని. అమ్మ చెప్పిన మాట ‘నీకేదైనా పెద్ద అనారోగ్యం అనగా సామన్య మందులకు లొంగని అనారోగ్యం చేస్తే ఈ బొడ్డు తాయత్తును ఉపయోగించి మందు తయారుచేసి ఇస్తారు, ఆ అనారోగ్యం తగ్గుతుందీ’ అని. మొలతాడు కట్టుకునే ఆచారం దీనినుంచే మొదలయిందేమో తెలియదు.

ఎండిపోయిన బొడ్డును తొలగించడం బొడ్డు గిల్లడం అంటారు, అప్పుడు నొప్పి పెడితే, ఏడ్చిన బిడ్డను జోలపాడతారు, అదే ”బొడ్డు గిల్లి జోలపాడటం” కాస్తా ”ముడ్డిగిల్లి జోల పాడటం అయిందేమో! 🙂 అసలు ఇలా బొడ్డును జాగ్రత్త చేయడమనే అలవాటు మరే దేశానా లేనట్టే ఉంది.

నేటి కాలంలో ఈ బొడ్డుతాడు ఉపయోగాలగురించి, మూలకణ చికిత్స కోసం ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కొన్ని పరిశోధనలలో కొన్ని రోగాలకి చికిత్సా జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఐతే ఈ బొడ్డుతాడును నిలవ చేసేందుకు ప్రత్యేక పరిస్థితులు ఉండాల్సివస్తున్నట్టుగా తెలుస్తోంది, ఇది సామాన్యులకు చేరువగా లేదు. నాటి కాలంలో ఎండిన బొడ్డునుంచి మూలకణాలు సేకరించేవారా? ఏమో! తెలీదు. బిడ్డ బొడ్డు దగ్గరుండే బొడ్డుతాడులో ఎక్కువ అవసరమైన మూలకణాలుంటున్నాయంటున్నారు, ఇదే భాగాన్ని మనవారు నిలవ చేసేవారు. చాలా విద్యలు మరుగున పడిపోయినట్టే ఈ విద్యా మరపుకొచ్చింది.ఆడపిల్లలు రజస్వలైన తరవాత ఈ బొడ్డు తాడును ఎందుకు విసర్జించేవారో, రజస్వలకి ఈ బొడ్డుతాడుకూ సంబంధం ఏమో కూడా తెలుసుకుంటే మంచిదే!

అన్ని విద్యలూ భారతదేశంలోనే ఉన్నాయనను. కాని చాలా విద్యలు భారతదేశంలో పుట్టి ఇతరదేశాలలో పెరిగాయి. మూలాలు ఇక్కడివే. భారత దేశంలో ఇలా మూలకణ చికిత్సా పరిశోధన బెంగళూరులో జరుగుతోందట, Centre for Stem Cell Research Benagaluru, శుభం, అక్కడ ఆ కేంద్రంలో తెనుగువారెవరైనా ఉంటే ఈ ఆలోచన కూడా ఆలోచించవలసిందిగా మనవి. మనదేశీయులే ఈ పరిశోధనలో మంచి ఫలితాలు సంపాదించాలని నా అభిమతం, మనవారే మన దేశం పేరు నిలబెడతారని…….అది నాజీవితకాలంలో చూడాలని…..

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బొడ్డుతాడు (Stem Cell)

 1. చాల బాగా చెప్పారు.
  భారతీయ జీవన విధానం లో ఇటువంటి సైన్సు కి సంబంధించిన నిగూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, వాటిలో చాల వాటిని మూఢనమ్మకాలు గ భావించి సరైన ప్రాచుర్యం కల్పించట్లెదు.

  • శివరామ ప్రసాద్ గారు,

   భారతీయులు ప్రకృతికి దగ్గరగా బతికేరు. సుమారు వేయి సంవత్సరాలుగా ఈ సంస్కృతి మీద దాడి జరుగుతోంది. చాలా విద్యలు మసకబారిపోయాయి. నేటికి అక్కడక్కడ కనపడుతున్నాయి. గత అరవైయేళ్ళ స్వతంత్ర దేశ ప్రభుత్వం వీటినేం పట్టించుకోలేదు. అంతెందుకు1857 ను సిపాయిల తిరుబాటనే చదుకుంటున్నారు పిల్లలు.
   ధన్యవాదాలు.

 2. పురాణాల్లో వున్న కొన్ని వైజ్ఞానిక విషయాల్ని exalted imaginations అనుకోడానికి అవకాశాలున్నాయి. కానీ బొడ్డుతాడు మాత్రం అస్సలు అలా అనిపించదు. ఆ కాలంవారికి కచ్చితంగా ఏదో తెలుసు అనిపించేలా, సైంటిఫిగ్గా ఋజువైన అంశం. మీ అమ్మగారు (_//\_) మీకిచ్చిన వివరణ కూడా ఎంత బావుందో. సాధారణంగా, “మా పెద్దవాళ్ళు చెప్పారు, మేం నమ్మాం, అంతే,” అని సరిపెట్టేసే అమ్మల్లాగా కాకుండా.

  • YVR’s అం’తరంగం’ గారు,
   బొడ్డు తాడు గురించి మనవారికి తెలుసుననే నా అభిప్రాయమూనూ! అమ్మ అలా చెప్పిందంటే ఎంతో కొంత తెలిసుండాలి కదా! అది నా దాకా రాలేదు, అవసరం కలగక. ఆడపిల్లల విషయంలో ఋతురక్తం తో కలికం వేసేవారనుకుంటా, ఆడాళ్ళు రహస్యంగా చేసేవారేదో!

   పాతరోజుల్లో అమ్మలు కూడా నేటివారికేం తీసిపోరు, ఇప్పుడంటున్న చదువు లేకపోవచ్చుగాని, వారికున్న తెలివి……
   ధన్యవాదాలు/

   • //పాతరోజుల్లో అమ్మలు…వారికున్న తెలివి…//
    నూరుశాతం అంగీకారం. ఎందుకనో అతిగోప్యత పాటించేవాళ్ళనుకుంటాను. అదో రకం ట్రేడ్ సీక్రెట్‌, unwritten non-proliferation. విదేశీయుల దండయాత్రలు జరుగుతున్న కాలంలో ఈ నాలెడ్జిని రహస్యంగా ఉంచే ప్రయత్నంలో మరుగున పడివుంటుంది.

   • YVR’s అం’తరంగం’ గారు,
    శ్లో. ఆయుర్విత్తం గృహచ్ఛిద్రం, మంత్రమౌషధసంగమౌ ,
    దానమానావమానాశ్చ, నవ గోప్యా మనీషిభిః.
    ఇది కూడా కారణం కావచ్చు, మీరు చెప్పిన కారణాలు ప్రముఖమైనవి.
    ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s