శర్మ కాలక్షేపంకబుర్లు-బొగ్గు బస్సు

 

paluku-teniyaluబొగ్గు బస్సు

బొగ్గు బస్సెక్కేరా ఎప్పుడేనా?
బొగ్గు బస్సునే చూడలేదు ఎక్కడం… 🙂 బలేవారే అంటారా! ఈ ఫోటో లో ఉన్నదే బొగ్గు బస్సు. ఈ ఫోటో ని నేను పలుకుతేనియలు బ్లాగ్ నుంచి పట్టుకొచ్చా! వారెక్కడినుంచి తెచ్చేరో తెలీదు 🙂

నేను పుట్టిన తరవాత నాన్నగారు వ్యాపారం చేద్దామని మకాం గోకవరం మార్చేశారట. నాకు ఊహ తెలిసిందో మఱ్ఱిచెట్టుకింద పాకలో :). అక్కడ మేము దాదాపుగా పదిహేనెకరాల స్థలంలో, కలప అడితీ, దాని మధ్యలో ఉన్న మఱ్ఱిచెట్టుకిందున్న పెద్ద పాకలో ఉండేవాళ్ళం. కొద్ది దూరంలో ఒక పెద్ద పాక నాన్నగారి ఆఫీసు. ఈ స్థలం గోకవరం రాజమంద్రి రోడ్ లో గోకవరం ఊరికి కొద్ది దూరంగా ఉన్న రహదారి బంగళా ఎదురుగా ఉండేది. ఊళ్ళో కెళితే సెంటర్ లో పెద్ద రావిచెట్టు దానికింద నాటికాలానికి చాలా పెద్దదైన హోటల్ (ఓనర్ గంగయ్య అని గుర్తు, ఎఱ్ఱగా కుదేసిన గుమ్మడికాయలా ఉండేవాడు) దాని ఎదురుగా పోస్టాఫీసు. దగ్గరగా పదో ఏట ఆ వూరునుంచి వచ్చేసినా మళ్ళీ వెళ్ళలేదుగాని, నలభై ఏళ్ళ తరవాత ఉద్యోగ రీత్యా వెళ్ళేను, మిత్రుడు ఏదో బాగు చేసి పెట్టాలంటే. నిజానికి నేనక్కడకెళ్ళింది వాడికి ఉపకారం చేయడానికంటే, ఆ ఊరు,ఆ రావి చెట్టు, పోస్టాఫీసు, సంతపాకలు,రహదారి బంగళా చూడాలనేది నా గాఢమైన కోరిక. రావిచెట్టును చూసి ఒక సారి దానిచుట్టూ ప్రదక్షిణం చేసి ఒక సారి తనివితీరా కౌగలించుకున్నా, చాలా మార్పులొచ్చాయిగాని ఆ రహదారి బంగళా అలాగే ఉంది, పోస్టాఫీస్ పడిపోతూ ఉంది, ఎందుకో వాటిని చూసి ఉద్వేగం కలిగింది. అప్రయత్నంగా చూశా రావిచెట్టుకింద గంగయ్య కోసం ఎక్కడి, ఎప్పటి గంగయ్య పంచ భూతాలలో కలసిపోయి చాలా కాలం ఐ ఉండచ్చని గుర్తొచ్చేటప్పటికి మనసు చేదు తిన్నట్టైపోయింది. చేదు తిన్నట్టయి నిలబడిన నన్ను చూసి, జరుగుతున్నది చూసి కూడా ఉన్న స్నేహితుడు, ’ఏంట్రా ఏమయింది నీకూ అన్నాడు, నన్ను భుజాలు పట్టి కుదుపుతూ! అప్పుడు చెప్పేను, అతనికి ఆ స్థలంతో నాకున్న అనుబంధం గురించి, ఆశ్చర్యపోవడం అతని వంతయింది. దారి తప్పేమా?

నాన్నగారు వాటాదారుగా ఉన్న కంపెనీకి కలప అడితీ, రెండు టూరింగ్ సినిమా హాళ్ళు,గోకవరంలో,తంటికొండలో, ఒక బొగ్గు బస్సు ఉండేవి. నాకు నాలుగో సంవత్సరం నుంచి బొగ్గు బస్సు తెలుసు 🙂 బస్సును రహదారి బంగళాకి మా ఇంటికి మధ్య నిలిపి ఉంచేవాడు. ఉదయం ఎప్పుడొచ్చేవాడో గాని క్లీనర్ ఆరుగంటలకి బస్సు పొయ్యిలో నిప్పు అంటించి గాలి విసరడానికి చేతిపంకా తిప్పడం మొదలెట్టేవాడు. పూర్వకాలం కమ్మరి కొలిమిలో గాలి ఊదడానికి తోలుతిత్తి వాడేవారు తెలుసా? ఆ తరవాత కాలంలో గాలి ఊదడానికి యంత్రం వచ్చింది దాన్ని తిప్పితే సరిపోతుంది. ఇలా తిప్పి,తిప్పి జబ్బలు పడిపోయేలా తిప్పి బస్సు బాయిలర్లో నీళ్ళు కాగేలా చేసి ఆవిరి తెప్పించేవాడన మాట. ఇలా ఐన తరవాత తొమ్మిది ప్రాంతంలో ఇళ్ళకి, బస్సు బయలుదేరుతోందనే కబురు చెప్పేందుకో మనిషి వెళ్ళేవాడు. ఒక పెద్ద హేండిల్ తీసుకుని దాన్ని ఇంజన్ కి అనుసంధానించి తిప్పి,తిప్పి తిప్పితే బస్సు ఇంజను సార్ట్ అయ్యేది. పడుతూ లేస్తూ, రోడ్లన్నీ గోతులేగా, బస్సు రాజమండ్రి చేరేది.మా ఊరు వెళ్ళడానికి బొగ్గుబస్సెక్కి రాజమంద్రివచ్చి అక్కడనుంచి లాంచీ ఎక్కి వెనక్కి గూటాల వెళ్ళేవాళ్ళం. అలా బొగ్గుబస్సు మీద తొమ్మిదో ఏటిదాకా ప్రయాణం చేశా!

రాజమంద్రిలో రెండు బస్ స్టాండ్ లున్నాయి. ఒకటి గోకవరం బస్ స్టాండు, మరొకటి కోటిపల్లి బస్ స్టాండూనూ. మొదటిసారిగా గోకవరం నుంచి మాత్రమే బొగ్గుబస్సు రాజమంద్రి వచ్చేదనమాట,ఈ బస్ స్టాండు ఆ రోజుల్లో ఊరికి దూరంగానే ఉండేదనుకుంటా, అదే నేటి నన్నయ సంచార భవనం పక్క స్థలం..

నాకు పదో సంవత్సరం వచ్చేటప్పటికి బొగ్గుబస్సు అమ్మేశారు. ఆ తరవాతొచ్చినది ISLAND కంపెనీ బస్సు పెట్రోలుతో నడిచేది. ఆ బస్సు కంపెనీ పేరును ఈౙ్ లేండ్ అనేవాళ్ళం తెలియక.. ఇవేళ టపా ఇలా ఐపోయిందా? ఎతో పోయింది నా ప్రమేయం లేకనే….

ప్రకటనలు

18 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-బొగ్గు బస్సు

  • రమణారావుగారు,
   బహుకాల దర్శనం, కుశలమే కదా!

   1945 నాటికి నాకు నాలుగేళ్ళు,బొగ్గు బస్సుని 1950 దాకా చూశాననుకుంటా! 1950 నాటికి పెట్రోల్ బస్సొచ్చింది. ప్రపంచయుద్ధం వగైరా తెలిసే వయసు కాదు.
   ధన్యవాదాలు.

   • I am doing well.Wish you good health and long life.. I was
    14 in 1945.I am forced to write in English because I am not getting Lekhini in my computer..Please continue writing.At least some people will be interested to read.

    . .

  • మిత్రులు రమణా రావు గారు,
   మీకూ నాకూ మధ్య ఒక దశాబ్దం ఎడం ఉందన్నమాట.
   కొన్ని ఇబ్బందులు పడిన మాట వాస్తవం. పడ్డాను, పడిలేచాను, ప్రతిసారి ఇది అలవాటే! రాయడం మానటంలేదు, ఎవరు చూస్తున్నారు, లేదు అన్నదీ వదిలేశాను. మాటాడిన వారితో పలుకుతున్నా! ఓపికున్నంతకాలంలో కొనసాగుతా!!! మీ ప్రోత్సాహానికి
   ధన్యవాదాలు.

   • మిత్రులు రమణారావు గారు,
    నేనూ సామాన్య మానవుణ్ణే. ఎంత వయసు అనుభవం వచ్చినా సహజ స్పందనలని దాచుకోలేనివాడిని, గొప్పవాడిగా నటించలేనివాడిని. అందుకు కొన్ని సార్లు బాధలు పడుతున్నమాటా వాస్తవం, బాధ పడుతున్నానని చెప్పడమూ అలవాటే అయింది. కాని రాయాలనే అలవాటును చంపుకోలేదు, చంపుకోలేను కూడా, ఎవరేమనుకున్నా. ఈ వయసులో కూడా మీరు నా బ్లాగును చూస్తున్నందుకు, నాకు విలువైన సూచనలిచ్చినందుకు, ప్రోత్సాహానికి సదా కృతజ్ఞత తెలుపుకుంటాను.
    ధన్యవాదాలు.

 1. మహిత కస్తూరికా పరిమళము లతొ సరస మధుధారలొలుకు మీ పలుకులందు !
  సింధువునుజేరి బిందువు సింధువగును;ధ్యేయమునుబట్టి మీ బ్లాగు దివ్యమేను
  సహృదయులగు మీకు సన్మానమబ్బును శుక్తివిడిన నాటి మౌక్తికముగ.
  జన్మదిన శుభాకాంక్షలు గురువుగారు 🙏🙏🙏
  (భాషా పటిమ లేక దాశరధిగారి వాక్యాలను వాడుకొని ఈ అభినందనలు కూర్చాను. మీకు నచ్చుతాయని తలుస్తూ.)

 2. బొగ్గు బస్సు చూడలేదు గానీ చాలా కాలం ప్రయాణాలు బొగ్గింజను రైల్లోనే చేశాం శర్మ గారూ – ట్రెయిన్ దిగేసరికి బట్టలు, మొహం నల్లగా తయారయ్యి 😀😀.

  • మిత్రులు విన్నకోట నరసింహారావు గారు,
   బొగ్గు బస్సు ఎక్కిన ఆనందం మిగిలింది 🙂
   బొగ్గు ఇంజను రైల్ ప్రయాణమూ చేశాగాని పెద్ద దూరాలు కాదు లెండి 🙂

   ఈ ఫోటో ఆ బ్లాగులో కనపడితే ఈ జ్ఞాపకం కదిలింది
   ధన్యవాదాలు.

 3. శర్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🌹. May you have a long, healthy and happy life 💐.

  • మిత్రులు విన్నకోట నరసింహారావు గారు,
   గత వారంగా ఇంటి స్లాబ్ లీకులతో పోరాడుతున్నా! మేడ ఎక్కి దిగడం, చాలా సార్లు తప్పక, కొంత శరీర శ్రమ తప్పలేదు, మరో రెండు రోజులు తప్పదు. పని ఓ కొలిక్కి వచ్చినట్టే!

   మొన్న సాయంత్రం శ్రీజవహర్ రెడ్డిగారు,హైదరాబాద్ వాసి, దంపతులిద్దరూ అభిమానులు. రెడ్డిగారీ ప్రాంతానికి ఆఫీస్ పనిపై వచ్చారట. ఒక స్నేహితుని తీసుకుని వెతుక్కుంటూ…… వచ్చారు. ఆ దంపతుల అభిమానాన్ని ఏమని వర్ణించను? గొప్ప ఆనందం కలిగింది, ఏమని వర్ణించగలను?, అనుభవించిన ఆనందాన్ని .

   మీలాటి స్నేహితులు ఇలా ఆకాంక్షిస్తుంటే, అమ్మ దయ లేకపోదు, అమ్మ దయతో కష్టాలొచ్చినా దాటుకుపోతున్నాం.

   మీ అభిమానానికి మరొకసారి.
   ధన్యవాదాలు.

 4. మాస్టారూ ..నమస్తే ! ఎలా ఉన్నారు? ఈ రోజు మీ జన్మదినం కదా ! మీకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు . నిండు నూరేళ్ళు … ఆరోగ్యంగా, ప్రశాంతంగా వర్ధిల్లాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ … భగవంతుని అపారమైన కృప మీ, మీకుటుంబం యెడల ప్రసరించాలని ప్రార్ధిస్తూ … మీకు మరోమారు పుట్టినరోజు శుభకామనలు.

  • వనజగారు,
   అమ్మకి నమస్కారం. అమ్మ దయ,కరుణ మీ ద్వారా నాకు చేరుతుంటే లోటేమి తల్లీ!వయసుతోకొన్ని ఇబ్బందులు తప్పవు కదా!! బాగున్నామనే అనుకోవాలి, బాగున్నాం, మరో శరత్తు గడిచినట్టే, మీ అభిమానానికి
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s