శర్మ కాలక్షేపంకబుర్లు-తాడో! పేడో!!

తాడో! పేడో!!

తాడో, పేడో; అంటే అవునో, కాదో; తెల్చవయ్యా, నిర్ణయంగా చెప్పు నాన్చి చంపక అని వాడుక మాట. సాధారణంగా తాడో, పేడో అనే అంటారు, అసలీ తాడు,పేడు ఎందుకంటారు?

ఇక్కడ తాడు అని పసుపుతాడుని అంటారు. పసుపుతాడంటే మంగళ సూత్రాల తాడు. స్త్రీ రెండు మంగళ సూత్రాలు ధరిస్తుంది. ఒకటి ఆడపెళ్ళివారు చేయిస్తారు, మరొకటి మగపెళ్ళివారు చేయిస్తారు, ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారు. కొంతమందికి గుంట పుస్తెలు ఆనవాయితీ, పీకి దగ్గరగా కట్టుకుంటారు,వీటిని. కొంతమంది అరకాసు,కొంతమంది కాసు, మరికొందరు తులం బంగారంతో సూత్రం చేయించడం ఆనవాయితీ అంటారు, అలాగే చేయించేవారు. ఈ సూత్రాలని ఎవరు మటుకువారు పెళ్ళికి పట్టుకొస్తారు. వీటిని కంసాలికి పురమాయించిన తరవాత ఇంటికి తెచ్చుకోవడం కూడా ఒక ఊరెరిగింపు,బాజాలతో, అదొక వేడుకా! ఒక శాలువాను పరచి నలుగురు నాలుగు పక్కలా పట్టుకోగా ఒకరొక కర్రతీసుకుని మధ్యలో శాలువాకి బోటు పెట్టగా శాలువా కింద ఒక ముత్తయిదువు పళ్ళెంలో స్వయంపాకం తీసుకుని కంసాలి ఇంటికి వెళ్ళడం,బాజా భజంత్రీలతో, అతనికి స్వయంపాక మిచ్చి, సూత్రం తెచ్చుకోవడం, నిజంగానే ఒక వేడుక.

పెళ్ళిలో ఈ సూత్రాలని వేరువేరుగానే కట్టిస్తారు. పదహారు రోజుల పండుగ తరవాత ఈ సూత్రాలను ఒకటే తాడులో వేసి కట్టిస్తారు. అలా కట్టించేటపుడు, నానుకోడు అని ఒక పొడుగాటి పూస, రెండు పాలకాయ పూసలూ ముందు గుచ్చుతారు తాడుకు, నానుకోడు మధ్య ఉండేలా, పాలకాయ పూసలు పక్కన ఉండేలా. ఈ నానుకోడు, పాలకాయ పూసలూ మగపెళ్ళివారే చేయించాలి. పాలకాయ పూసలకి పక్కగా సూత్రాలు గుచ్చుతారు. ఆ తరవాత రెండు సూత్రాలూ ఏకం చేసి మరలా ఒకే పద్ధతిలో సూత్రాలు చేయించుకుంటారు. నేటికాలంలో సూత్రాలు ఒకరే చేయించేస్తున్నారు, డబ్బులు లెక్క చూసుకుంటున్నారు, ఈ తడిమిట్లన్నీ ఎందుకని. తాడంటే ఇక్కడ పసుపుతాడనే అర్ధం, ఇది పలుపుతాడు కాదు, నిజానికి వలపుతాడు, ఎలా అనుకుంటే అలాగే కనపడుతుంది, యద్భావం తద్భవతి కదా!

ఇక పేడంటే కట్టెపేడుని పేడని అంటారు. ఇక్కడ పేడంటే చితి( పేడు పేర్చినదే చితి ) అని అర్ధం.

నిజానికీ మాట ఒక ప్రేమించిన స్త్రీ ప్రియునితో అనేదే! బెదిరింపే సుమా!! తాడు కట్టి అనగా పసుపుతాడు అనగా మంగళసూత్రం కట్టి నన్ను భార్యగా చేసుకుని సుఖపడి, సుఖపెడతావా? లేకపోతే ఇదే తాడుతో ఉరేసుకుంటాను, ఛస్తాను, పేడుతో చితి పేర్చి తగలబెడతావా? అని ప్రియుణ్ణి అడిగే సందర్భమే!! ఎంతఘాటు ప్రేమయో!!!

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s