శర్మ కాలక్షేపంకబుర్లు-ఆజానుబాహువు

ఆజానుబాహువు

ఆజానుబాహువు అంటే పొడుగైన చేతులున్నవాడని అర్ధం చెప్పేస్తున్నాం. ఏవి పొడుగైన చేతులు? ఒకదాన్ని మరొకదానితో పోలిస్తే, ఇది దానికన్న పొడుగేనా కావచ్చు,పొట్టేనా కావచ్చు కదా 🙂

ఆజానుబాహువు అనేపదంలో జానువు,బాహువు అనేవి రెండు వేరు వేరు పదాలు. మన శరీరంలో కాలిలో మోకాలి కింద రెండు ఎముకలుంటాయి, ఒకటి కాదు, అలాగే చేతిలో కూడా మోచేయి నుంచి కిందికి రెండు ఎముకలుంటాయి, వాటికి పేర్లూ ఉన్నాయి, రత్ని (Radius),  ఆరత్ని(Ulna). కాలిలో ఉన్న ఎముకలలో ఒకదాని పేరు జానువు (Tibia),మరొకటి జంఘిక (Fibula).

సామాన్య మానవుని చెయ్యి కిందికి వేలాడ దీసి ఉంచితే అది మోకాలి చిప్పకి పై భాగందాకానే వస్తుంది, అంటే జానువుకి దగ్గరగా రాదు. జానువు దగ్గరగా కొంతమందికి చెయ్యి పొడుగ్గా ఉంటుంది, మనెవరికి అలా ఉండదు, చూసుకున్నారా? సరిపోయిందా? ఈ చిన్న విషయాలు, మనగురించిన విషయాలే మనకు తెలియవు. ఎవరి చేయి వారి జానువుకి దగ్గరగా వస్తుందో వారే ఆజానుబాహువులు, జానువు వరకూ బాహువులున్నవాడు.

శ్రీరాముడు ఎనిమిది ధనువుల పొడుగున్నవాడు అని వాల్మీకి చెబుతారు. ధనువు అంటే ఆరడగులంటారు, అంటే నలభై ఎనిమిది అడుగుల పొడుగు, నమ్మగలమా? నేనైతే ధనువు అంటే తొమ్మిదంగుళాలనుకుంటా, అప్పుడు ఎనిమిది ధనువులంటే ఆరడుగులు కదా! నా ఊహ నిజం కాకపోవచ్చు కూడా!

ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి.

మానవ శరీర నిర్మాణం రెండు భాగాలు, ఊర్ధ్వ భాగం,అధోభాగం. కాలిపొడుగు ఎక్కువుండి పైభాగం తక్కువున్నవారు, పైభాగం, కింది భాగం సమానంగా ఉండేవారు, పైభాగం పొడవుండి, కింది భాగం తక్కువ ఉండేవారు ఉంటారు. భారతీయ పురుషుని సగటు ఎత్తు ౫’౫”, భారతీయ స్త్రీ సగటు ఎత్తు ౫’ ఈ ఎత్తును మించి ఉన్నవారు ఎత్తుగాకనపడతారు, వీరే అందంగానూ కనపడతారు. పదేళ్ళకితం వరకు పొట్ట ఉన్న స్త్రీ పురుషులు అరుదుగా కనపడేవారు, మరినేడో పొట్టలేనివారు అరుదుగానే కనపడుతున్నారు, కారణం చెప్పక్కరలేదనుకుంటా 🙂

అప్రాచ్యుడు.

అప్రాచ్యుడు అనేదాన్ని తిట్టు అనుకుంటాం, ఇది తిట్టా? దీవెనా? ఇది తిట్టూ కాదు దీవెనాకాదు. న+ప్రాచ్యుడు=అప్రాచ్యుడు. ప్రాచ్యము అనగా తూర్పు, ప్రాచ్యము కానిది పశ్చిమం. ప్రాచ్యుడు కానివాడు అప్రాచ్యుడు అనగా తూర్పు దిశకు చెందనివాడు, పశ్చిమ దిశకు చెందినవాడని అర్ధం.

2 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-ఆజానుబాహువు

  1. అప్రాచ్యుడు అనేది తిట్టు గానే తెలుసు తాత గారూ. అర్ధం తెలియదు. అలాగే ఆజానుబాహుడు లాంటి పదాలు వింటాం. మీ లాగ చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. ధన్యులం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s