శర్మ కాలక్షేపంకబుర్లు-కోటికి పడగెత్తడం

కోటికి పడగెత్తడం

ఆయనకేంటండీ లక్షాధికారి, ఇది నా చిన్నప్పటి మాట. ఆరోజు లక్షాధికారుల సంఖ్య చాలా తక్కువే ఉండేది. దమ్మిడీ/ఏగానికి కి కూడా ఒక బెల్లపు ఉండేనా ఇచ్చేవాడు. ఆ తరవాత కాలంలో అగ్గిపెట్టి అర్ధణా ఉండేది. కత్తెర మార్క్ సిగరెట్లు పెట్టి బేడ, బంగారం తులం పదమూడు రూపాయలు,రూపాయైకి కుంచెడు బియ్యం, అంటే నాలుగు కేజిలు. సత్య కాలమంటారు, ఏమో ఏంటో తెలీదుగాని, ప్రజలు సుఖంగానే బతికేరనిపిస్తుంది, కూటికి గుడ్డకి కరువు వాచక.

ఆ తరవాత కాలంలో ఎద్దును దున్నపోతును కట్టి బండి తోలుకునే ఆసామీ లక్షాధికారి, ఆ తరవాత కోటీశ్వరుడూ అయ్యాడు, ఏం చేశాడు? రాజకీయం, కుల రాజకీయం, కలిసొచ్చింది మరి… 🙂 ఎద్దును దున్నపోతును బండి కట్టడమంటే తెలుసా? ‘ఎద్దు ఎండలోకీడిస్తే దున్నపోతు నీడకి ఈడుస్తుంది’ఇది సామెత నిజమూన ,అంటే రెంటికి జత కుదరదు. ఎద్దు ఎంత ఎండయినా సహిస్తుంది కాని చినుకును సహించలేదు, దున్నపోతు ఎంత వానైనా సహిస్తుందిగాని ఎండ సహించలేదు. అలా జతకుదరని వాటిని బండి కడితే జరిగే పని తక్కువ, అలా బతికినవాడు లక్షాధికారి ఎలా అయ్యాడు? దారి తప్పిపోయాం కదూ 🙂  అదడిగితే కోపాలొచ్చేస్తున్నాయి 🙂

నాటి రోజుల్లో లక్షాధికారి ఐనవాడికి ఎంతో కొంత దాతృత్వం ఉండేదనుకుంటా, ఉన్న సంపద నలుగురికి తెలిసేది కూడా. ఆ తరవాత వారు కోటీశ్వరులు, వీరు ఒక కోటి సంపాదన చేస్తే జండా ఎగరేసేవారట, నా సంపద ఒక కోటి అని.ఆ రోజుల్లో అలా జండా ఎగరేసి నేను కోటీశ్వరుణ్ణి అని చెప్పుకునేవారుట, ప్రజలకి తెలిసేలా ప్రదర్శించేవారు కూడా. పడగ అంటే టెక్కెము, జండా అని అర్ధం మరి, నేడు ఎన్ని కోట్లు దోచుకున్నా, దోచుకుని దాచుకున్నా పడగలెత్తలేరు. కారణం మీకు తెలిసిందే!

అదీ కోటికి పడగెత్తడం కత

ప్రకటనలు

6 thoughts on “శర్మ కాలక్షేపంకబుర్లు-కోటికి పడగెత్తడం

 1. బంగారు నాగ పడిగెలు
  రంగుగ కోటీశ్వరు లను రాజసమొప్పన్
  హంగుగ కోటి కొకటి యొన
  రంగా తమ యింట నుంతు రని వినియుంటిన్ .

  రామరత్నాలన , పడిగె , లర్బుదముల
  నంగ నేవేవొ లెక్కలు నాడు సంప
  దలకు కొలమాన మున్నట్లు తాతలు పలు
  ముచ్చటలు జెప్ప వింటిని మునుపు నిజమ ?

 2. మీ గుర్రపు స్వారీ పోస్ట్ ఇప్పుడే చదివాను. చాలా బాగుంది…సినిమాటిక్ గా కూడా ఉంది. సూర్రావుగారు టచ్ లో ఉన్నారా అండీ!

  • sivasravanababu గారు,
   నిజం నుంచే సినిమా పుట్టింది కదండీ! నచ్చినందుకు ధన్యవాదాలు.
   ఐదేళ్ళ కితం మిత్రుడిని కలిశాను. ఆ తరవాత అన్నయ్య గతించడంతో మరి పుట్టిన ఊరి వైపు పోలేదు, నాటికి నా దగ్గర సెల్ ఫోన్ లేదు, ఇలా చాలా కారణాలతో మా సూర్రావుని కలవలేదు. ఎనిమిదిపదులు దాటి ఉంటాయి, ఎక్కడో కులాసాగా ఉన్నాడనుకుంటే అదే ఆనందమని తెలుసుకోడానికి ప్రయత్నం చేయలేదు, ఏం మాట వినాలోననే భయం.
   ధన్యవాదాలు.

  • YVR’s అం’తరంగం’ గారు,

   ధనానికి పాములు కాపుంటాయంటారు, నిజమో కాదో తెలియదు. నేటి కాలంలో నల్ల తాచుల్ని కాపు పెడుతున్నారేమో
   ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s