శర్మ కాలక్షేపంకబుర్లు-అంబటేరొచ్చింది….

అంబటేరొచ్చింది….

”అంబటేరొచ్చింది అత్తగారా!” అంటే ”కొలబుఱ్ఱ నా చేతిలోనే ఉందే కోడలా!!” అందట.

ఈ నానుడి లేదా జాతీయం అర్ధమేంటీ? చెప్పుకుందాం…

”అంబటేరు” అనే పదమేంలేదు. రెండు పదాలు వాడుకలో కలిసిపోయి అలా ఐపోయాయి. అవి ’అంబటి’ ’వేరు’ కలిసివాడుకలో అంబటేరు అయ్యాయి. మరైతే అర్ధమేంటీ? అంబటి అనేది మన తెనుగువారిలో ఇంటిపేరూ ఉంది. అంబటి అనేది అంబలి నుంచి వచ్చిన పదం, వేరు అనగా చెట్టు వేరనీ అర్ధం,వేరు పడడమనీ అర్ధం, ఇక్కడ రెండవదే అర్ధం….’అంబటేరొచ్చింది’ అంబటి వేరొచ్చింది అత్తా! అంటే కూటికి వేరొచ్చింది అత్తా! అందనమాట.

photo0005

 మా మామ్మగారు (మా అమ్మ అత్తగారి) నించి సంక్రమించిన వెదురు కఱ్ఱ అరసోల వాడుతున్నాం. దీని వయసు వందేళ్ళపైనుండచ్చు.

ఒక కోడలు కూటికి వేరు పడింది అత్తతో, ”కూడు/కుండ వేరైతే గుణం వేరని” సామెత. కాని కూటికి కావలసినది అత్తతో పంచుకోవాలి కదా! అందుకు కూటికోసం వేరుపడ్డా! మాది మాకు పంచమని అత్తని అడిగిందనమాట, దానికి అత్త ”నీకు ఇవ్వవలసినది,కొలవవలసినదానికి కావలసిన అధికారం నాదగ్గరే ఉందే! ఊరికే ఎగిరి పడకు, ఉస్థికాయలాగా” అని చెప్పిందనమాట. అదే కొలబుఱ్ఱ అంటే కొలిచి ఇచ్చే ఉపకరణం సోల/తవ్వ వగైరా, బియ్యం కొలిచి ఇచ్చే అధికారం నాదగ్గర మాత్రమే ఉందని చెప్పడమనమాట.

అదే అంబటేరొచ్చింది అత్తా అంటే కొల బుఱ్ఱ నా చేతిలోనే ఉంది కోడలా కత 🙂

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s